ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్..
మండలి మరోసారి వాయిదా..
మంత్రుల ఓవరాక్షన్.. వైఎస్సార్‌సీపీ సభ్యుల అభ్యంతరం..
గాలేరు, నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుపై వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్న..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి..
- గాలేరు, నగరి ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేయాలి..
- గత ప్రభుత్వ హయాంలో జగన్ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించారు..
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది..
- గాలేరు, నగరి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ఎంత కేటాయింపులు చేశారు..
- ప్రాజెక్టు ఏపాటి లోపు పూర్తి చేస్తారో చెప్పాలి..
మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం..
- సభ్యులు అడిగిన ప్రశ్నల గురించే మాట్లాడాలి..
- అడిగిన ప్రశ్నలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అడగలేదు..
- వైఎస్సార్‌సీపీ సభ్యులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..
విపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటర్..
- రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి సూటిగా సమాధానం చెప్పాలి..
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వాస్తవమా.. కదా..
- కాదు అంటే కాదని చెప్పండి..
- ఈ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు మొదలు పెడతారు..
- ఎప్పటి లోపు పూర్తవుతాయి అనేది సమాధానం చెప్పాలి..
- లేకపోతే తర్వాత చెప్తామని చెప్పాలి..
మంత్రి నిమ్మల రామానాయుడు..
- వైఎస్సార్‌సీపీ వాళ్లకు సమాధానాలు వినే ధైర్యం ఉంటే రేపు చర్చిద్దాం..
- మేం అన్నీ ప్రశ్నలపై సమాధానాలు చెప్పేందుకు సిద్ధం..
- పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అని చెప్పారు..
- పొరుగు రాష్ట్రంలో వల్ల రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతారు..
- అధికారంలో ఉంటే ఒక రకంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా మాట్లాడుతున్నారు..
- గాలేరు, నగరి సహా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నాం..
మంత్రి నిమ్మల సమాధానంపై వైఎస్సార్‌సీపీ సభ్యుల అభ్యంతరం..
- సభలో పెద్దఎత్తున నినాదాలు..
- బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి..
- ఆయన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్లకు లేదా?.
- కాకపోతే ఇది వాస్తవం కాదు అని ఎందుకు చెప్పటం లేదు..
- సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా..
- ఎస్ ఆర్ నో సూటిగా సమాధానం చెప్పాలి..
మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్స్..
- పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మేం తేలేదు..
- వైఎస్సార్‌సీపీ వాళ్ళే తెచ్చారు..
- అధికారంలో ఉన్నప్పుడు ఏం గుర్తు లేదు..
- అధికారం పోయి 11 సీట్లకు పరిమితం అయినప్పుడు ఇప్పుడు సీమ ప్రజలు అని మాట్లాడుతున్నారు..
మంత్రి పయ్యావుల కేశవ్ కామెంట్స్..
- ప్రశ్నోత్తరాల సమయం ఇక గంట మాత్రమే..
- వైఎస్సార్‌సీపీ వాళ్ళు అది గుర్తుంచుకోవాలి..
- గత పదిరోజులుగా వైలేషన్ జరిగింది..
- అది ఎవరి వైపు నుంచి జరుగుతుందో అందరూ చూశారు..
బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- ఇద్దరు మాట్లాడుకుని లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలా..
- ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలు మా బాధ్యత..
- డైవర్షన్ చేయాలనుకోవటం ధర్మమా?.
- బొత్స మాట్లాడే సమయంలో వాకౌట్ అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు..
- మేం బయటకు ఎందుకు వెళ్తాం అంటూ బొత్స ఫైర్..
- ఏపీ శాసన మండలి మరోసారి వాయిదా.
- వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు.
- మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన
మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన..
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ సభ్యుల డిమాండ్.
- రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్న.
- రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు.
- లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేసి సీమకు అన్యాయం చేశారు.
- సీమ లిఫ్ట్ కడతారా? లేదా? ప్రభుత్వం చెప్పాలి.
అసెంబ్లీ మీడియా పాయింట్..
టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్
- రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అంతా రోడ్డు ఎక్కారు
- ప్రభుత్వం కనీసం వారిని పిలిచి చర్చలు కూడా జరపటం లేదు
- ఉద్యోగుల ధర్నాపై నిర్లక్ష్యం వహిస్తుంది
- సచివాలయ ఉద్యోగులు అంగన్‌వాడీలు, టీచర్స్ ఆందోళన బాట పట్టారు
- ఉద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు
- ఉద్యోగులకు అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పారు
- పీఆర్సీలు , ఐఆర్ ఇస్తాం అని మాయమాటలు చెప్పారు
- ఉద్యోగుల సమస్యలు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు అధికారం రాగానే మేనిఫెస్టో పక్కన పడేశారు
- ఉద్యోగులకు ఇచ్చిన హామీల నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాము
- అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు
- ఉద్యోగులకు సంబంధించి 35వేల కోట్లు బకాయిలు ఉన్నాయి అవి చెల్లించరా?
- పెండింగ్లో పెట్టి వాటిని కొండలాగా పెంచుకుంటూ పోతారా?
- ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే ఉద్యోగులంతా రోడ్లు ఎక్కారు
- శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ.. ఉద్యోగులు లేకుండా నడుస్తాయా?
- అధికారంలోకి రావటానికి రథ చక్రాలలా ఉద్యోగులు పని చేశారు
- నేడు ఆ చక్రాల కింద పడి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది..
- ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉంది
- ఎంతోమంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గాని ఉద్యోగ సంఘాలతో చర్చలు కూడా జరపడం లేదు
- 35 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు పెట్టారు...
- ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కరించి వారి డిమాండ్స్ నెరవేర్చాలి.
👉ఐదు నిమిషాల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన మండలి
మంత్రి సమాధానంపై బొత్స సీరియస్..
- రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మంత్రి సమాధానం చెప్పకపోవడంపై బొత్స సీరియస్
- మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- సభా సంప్రదాయాలు ఉంటాయి..
- ఇరిగేషన్ మంత్రి ఉపన్యాసంతో మాకు అభ్యంతరం లేదు..
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారా లేదా?.
- దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
- మేం మాట్లాడుతుంటే మైక్ సౌండ్స్ తగ్గిపోతున్నాయి.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై శాసనమండలిలో ప్రశ్న..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ భాషా కామెంట్స్..
- శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోపు తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకెళ్తున్నారు..
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 841 అడుగులకు వెళ్తే కానీ నీళ్లు అందవు..
- 800 అడుగుల లోపు మన వంతుగా నీళ్ళు రావటానికి గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చారు..
- దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి..
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు పనులు ఆపించామని చెప్పారు..
- ఒక రాయలసీమ వాసిగా ఉన్న చంద్రబాబు సీమ నీటి హక్కుల విషయంలో తెలంగాణతో లాలూచీ పడ్డారు..
- రాయలసీమకు హక్కుగా రావలసిన వాటా నీళ్లు రాకుండా చేయటం న్యాయమా, ధర్మమా?.
- లేకుంటే ప్రాజెక్ట్ పనులు ఆపాల్సిన అవసరం లేదు..
- మీరు ఈ పనులు పూర్తి చేస్తారా.. లేక రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కామెంట్స్..
- రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రాంత రైతులకు, ప్రజలకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్..
- రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి..
- చంద్రబాబు తో ఏకాంత సమావేశంలో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపించాలని చెప్పారు..
- అయినా ఇంతవరకు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పలేదు..
- పంటలు పూర్తిగా ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు..
- కానీ ప్రభుత్వం మాత్రం సీమ హక్కుల గురించి పట్టించుకోవటం లేదు..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కామెంట్స్..
- రాయలసీమ నీటి అవసరాలకు ఎత్తిపోతల పథకాలు చాలా అవసరం..
- రాజకీయ అవసరాల దాన్ని మూసేస్తున్నారా..
- దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయి..
- ప్రజల ఆందోళనలు ప్రభుత్వం నివృత్తి చేయాలి..
- అనంతరం మంత్రి సమాధానంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం..
👉సభలో ఆందోళన..
👉పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో సభలో గందరగోళం..
👉కొద్దిసేపు విరామం ప్రకటించిన ఛైర్మన్.
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రసాభాస
- మంత్రి సమాధానంపై అభ్యంతరం తెలియజేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
- తన విజ్ఞప్తి వల్లే రాయలసీమ ఎత్తిపోతలు నిలిపివేశారు అంటూ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
- ఆయన మాటలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు


