లడ్డూపై ఏకసభ్య కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి | Subramanian Swamy File Petition In Supreme Court Over Laddu Issue | Sakshi
Sakshi News home page

లడ్డూపై ఏకసభ్య కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి

Feb 22 2026 9:32 AM | Updated on Feb 22 2026 12:21 PM

Subramanian Swamy File Petition In Supreme Court Over Laddu Issue

సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్‌ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం రేపు(సోమవారం) విచారణ చేపట్టనుంది.

కాగా, తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్‌ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్‌ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌పై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు.

అయితే, తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కల్తీ కుతంత్రం పనిచేయకపోవడంతో చంద్రబాబు.. తన సొంత కమిటీ వేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో, కూటమి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపింది. సిట్ సూచనలకు భిన్నంగా కమిటీ ఏర్పాటు చేసి.. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement