బుల్లితెర నటి ఆద్య పరుచూరి (Aadhya Paruchuri) పెళ్లిపీటలెక్కనుంది. ప్రియుడు పృథ్వీ వేలు పట్టుకుని ఏడడుగులు వేయనుంది. బెస్ట్ ఫ్రెండే భర్తగా మారనున్నాడంటూ.. తన ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మడియాలో పలు ఫోటోలు షేర్ చేసింది.
అంతా ఒక కలలా..
'నా బెస్ట్ ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఇదంతా ఒక కలలా ఉంది. దీన్నుంచి బయటకు రాబుద్ధి కావడం లేదు. మేమిద్దరం కలిసి పెరిగాం.. కలిసి నవ్వుకున్నాం. ఇప్పుడు కలిసి భవిష్యత్తును నిర్మించుకోబోతున్నాం. జంటగా అడుగులు వేయబోతున్నాం' అంటూ ఈ జంట అందమైన క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు బుల్లితెర నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గతంలో చెల్లి పెళ్లి.. ఇన్నాళ్లకు అక్కకి..
నిశ్చితార్థపు వేడుకలో ఒకరి వేలికి మరొకరు ఉంగరం తొడిగారు. జంటగా కేక్ కట్ చేశారు. ఆద్య విషయానికి వస్తే.. కృష్ణ తులసి, ఆ ఒక్కటి అడక్కు, ఉప్పెన, దేవతలారా దీవించండి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోనూ యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నటి చెల్లికి మూడున్నరేండ్ల కిందట పెళ్లవగా.. ఇన్నాళ్లకు అక్క పెళ్లి పీటలెక్కింది.


