తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్‌లోనూ ఈసారి ఐదు సినిమాలు పండగకి రానున్నాయి. వీటిలో ప్రభాస్ 'రాజాసాబ్'(జనవరి 09న), చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'(జనవరి 12న) ఉన్నాయి. గత నెలలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇకపై ఏ చిత్రానికి టికెట్ రేట్ల పెంపు లేదని తేల్చేశారు. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు.
(ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే)
టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అత్యవసర పిటీషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరిన నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటీషన్లపై హైకోర్టులో బుధవారం (డిసెంబరు 07) విచారణ జరగనుంది.
ఇకపోతే 'రాజాసాజ్' నిర్మాతలు.. తెలంగాణ ప్రభుత్వాని టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల గురించి అప్లై చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రీమియర్ల కోసం మల్టీప్లెక్స్‌ల్లో రూ.1000, సింగిల్ స్క్రీన్లలో రూ.800కు విక్రయించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్-మల్టీప్లెక్స్‌ల్లో ప్రీమియర్ల కోసం రూ.600 ధరకు విక్రయించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. మరి ఈ విషయంలో అటు హైకోర్టు, ఆపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి?
(ఇదీ చదవండి: తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి! )


