టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. హరణ్య అనే అమ్మాయితో గతేడాది (నవంబర్ 27న) గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ కెరీర్‌కు కొంచెం గ్యాప్ ఇచ్చిన రాహుల్.. మ్యారేజ్ తర్వాత ఫుల్‌గా చిల్ అవుతున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే సింగర్ రాహుల్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలపై నెట్టింట రచ్చ మొదలైంది. కొంచెం డబ్బులు రాగానే బట్టలన్నీ విప్పేసి ఏదో సోషల్ మీడియాలో స్టేటస్ చూపించుకోవడమేంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కొంచెం తగ్గించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ఈ రోజు మీకు ఇది ఫ్యాషన్ అవ్వొచ్చు కానీ.. రాబోయే రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలతో ఇబ్బందులు పడతారని అంటున్నారు. మీకంటూ సభ్యత సంస్కారం ఉందా తమ్ముడు అంటూ రాహుల్‌పై నెటిజన్స్ ఫైరవుతున్నారు. మీ హనీమూన్ ఫోటోలు మేము చూసి ఎంజాయ్ చేయాలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిప్లిగంజ్‌కు చురకలంటిస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడండి.. ఇలాంటి పనులు కోసం కాదని రాహుల్‌కు సూచిస్తున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ నేపథ్యం..
రాహుల్ (Rahul Sipligunj) జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. ఓపక్క తండ్రికి సాయంగా బార్బర్ షాప్‌లో పని చేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అవే అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు సాంగ్ అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.


