రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'రంగస్థలం'. 2018లో రిలీజైంది. అప్పటివరకు చరణ్ యాక్టింగ్‌పై ట్రోల్స్ లాంటివి వచ్చేవి. ఈ మూవీ దెబ్బకు వాటన్నింటికి చెక్ పడిందనే చెప్పొచ్చు. అంతలా మెప్పించింది. ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా రామకృష్ణ.. తనకు ఎలాంటి అవార్డ్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా రాకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా అన్నారు.
(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్)
'రంగస్థలం' చిత్రంలో నటనకుగానూ రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుందని అందరం అనుకున్నాం. ఆయనకనే కాదు ఈ సినిమాలో చాలామందికి అవార్డ్స్ రావాలి కానీ ఎవరికీ రాలేదు. సౌండ్ డిజైనర్‌కి మాత్రమే వచ్చింది. లక్కీగా ఆయనకు రావడంతో మేమంతా హ్యాపీగా ఫీలయ్యాం. కనీసం రాష్ట్రస్థాయి అవార్డులు కూడా ఇవ్వలేదు. అయితే నేను పనిచేస్తూ ఎంజాయ్ చేసింది 'రంగస్థలం', 'అంతరిక్షం' సినిమాలకే. 'రంగస్థలం' వెరీ రూరల్, రియలస్టిక్ స్టోరీ. ఇది సెట్ అని అవార్డ్స్ ఇచ్చేవాళ్లకు తెలీదు. ఊరిలో షూటింగ్ చేశామని అనుకున్నారు. రాష్ట్ర అవార్డ్ ఇవ్వలేదు. నేషనల్ అవార్డ్ కూడా రాలేదు. రామ్ చరణ్ కూడా జాతీయ అవార్డ్ గెలుచుకుంటారని నాతో అన్నారు. కానీ జరగలేదు' అని ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈయన చెప్పింది కూడా నిజమేనేమో. ఎందుకంటే 2018కిగానూ తెలుగు ప్రేక్షకులు చాలామంది రామ్ చరణ్‌కి అవార్డ్ వస్తుందని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అప్పటికి ఇంకా ఈ పాన్ ఇండియా ట్రెండ్ కూడా పెద్దగా లేదు. ఒకవేళ ప్రస్తుత టైంలో 'రంగస్థలం' రిలీజయ్యుంటే కచ్చితంగా చరణ్‌కి అవార్డ్ వచ్చి ఉండేదేమో? అదే ఉద్దేశాన్ని ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇప్పుడు చెప్పుకొచ్చారు. అవార్డులు రాకపోతేనేం సుకుమార్, చరణ్.. ఎవరికి వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)
“I enjoyed working on #Rangasthallam and #Antariksham, both are complete sets, but we didn’t get awards for either.
Even #Ramcharan sir said, ‘You will get a National Award for this movie.’”
- Art Director #RamaKrishna | #Sukumar pic.twitter.com/VHdVmzscAd— Whynot Cinemas (@whynotcinemass_) February 22, 2026


