ట్రోల్స్‌ లెక్క చేయను.. నా ఇంటివరకు వస్తే మాత్రం! | Actress Samantha Ruth Prabhu Reacts to Social Media Trolling | Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: సోషల్‌ మీడియా ట్రోలింగ్‌.. సామ్‌ రియాక్షన్‌ ఇదే!

Feb 22 2026 4:57 PM | Updated on Feb 22 2026 5:04 PM

Actress Samantha Ruth Prabhu Reacts to Social Media Trolling

దర్శకుడు రాజ్‌ నిడిమోరును పెళ్లి చేసుకున్నాక సమంత ముఖం వెలిగిపోతోంది. ఒకప్పుడు విచారంగా కనిపించే తన ముఖం ఇప్పుడు వెయ్యి ఓట్ల బల్బులా ప్రకాశిస్తోంది. ప్రస్తుతం సంతోషకర జీవితం గడుపుతున్న సామ్‌ మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం! ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఏదీ నన్ను కదిలించలేదు
ఇదిలా ఉంటే తాజాగా తను సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌ చేసింది. ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు? అని ఓ వ్యక్తి అడిగారు. అందుకు సమంత స్పందిస్తూ.. ప్రశంసలు నన్ను కదిలించలేవు. అలాగే విమర్శలు కూడా నన్ను ఎఫెక్ట్‌ చేయవు. కానీ, నెగెటివిటీని నా ఇంటివరకు తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని బ్లాక్‌ చేస్తాను.

దానర్థం అదే..
అలా నా స్పేస్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను. మిమ్మల్ని బ్లాక్‌ చేశానంటే నేను బాధపడ్డానని కాదు. మీలాంటివారికి నాదగ్గర చోటు లేదని అర్థం అని రిప్లై ఇచ్చింది. మీలోని ఓ ఫన్నీ థింగ్‌ ఏంటని అడగ్గా.. కిందపడి మరీ నవ్వుతానంది. ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తారని అడగ్గా.. ధ్యానం చేస్తానని బదులిచ్చింది.

సినిమా
మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఇందులో సమంత పెళ్లయిన అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఆపద వచ్చినప్పుడు కత్తి పట్టేందుకు కూడా వెనుకాడని శివంగిగానూ అలరించనుంది. గుల్షన్‌ దేవయ్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.

చదవండి: ఇంకా అదే బాధలో ఉన్న కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌

Advertisement
 
Advertisement
Advertisement