ఇలాంటి టైమ్‌లో అలాంటి రిస్క్‌ తీసుకోను : కమెడియన్‌ సుదర్శన్‌ | Comedian Sudarshan Talk About Hey Balwanth Movie | Sakshi
Sakshi News home page

ఇలాంటి టైమ్‌లో అలాంటి రిస్క్‌ తీసుకోను : కమెడియన్‌ సుదర్శన్‌

Feb 22 2026 3:58 PM | Updated on Feb 22 2026 4:08 PM

Comedian Sudarshan Talk About Hey Balwanth Movie

చాలా మంది హాస్య నటులు తమకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత హీరోలుగా చేశారు. నా కెరీర్‌ ఇప్పుడే ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో అలాంటి రిస్క్‌ తీసుకోలేను.  ఒకవేళ నేను హీరోగా చేయాలంటే అది హీరోలు చేయలేని చిన్న చిన్న కాన్సెప్ట్‌లు చేయలేని సినిమాలు చేయాలి.  థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే మెయిన్‌ లీడ్‌ సినిమాలు చేయాలని లేదు’ అని అన్నారు కమెడియన్‌ సుదర్శన్‌. సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుదర్శన్‌ ఓ కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కమెడిన్‌ సుదర్శన్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు.

'హే బల్‌వంత్‌' లో మంచి క్యారెక్టర్‌ చేశాను. సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్‌ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి.  డ్రింకింగ్‌ సీన్‌, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌కు ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్‌, సుహాస్‌, నరేష్‌, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు.

ఈ సినిమాలో నటించిన అందరితో నాకు అందరితో మంచి ర్యాపో ఉంది. ప్రతి సీన్‌కు అందరం మంచి సింక్‌లో ఉన్నాం. అందరూ క్లోజ్‌నెస్‌తో ఫ్లోతో సీన్‌లు బాగా వచ్చాయి


నేను హీరోగా వెండితెరపై ఇప్పుడే చేయను. అనుకోకుండా సినీ పరిశ్రమకు  వచ్చాం. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను. ఈ టైమ్‌లో రిస్క్‌ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ఉంది. నటుడిగా సెటిల్‌ అయిపోయిన తరువాత హీరోగా  ఆలోచిద్దాం. ఒకవేళ హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో చేసే ఓటీటీ సినిమాలు చేస్తాను.

ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాను. కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది. కేవలం డేట్స్‌ క్లాష్‌ వల్ల దగ్గరికి వచ్చి పోతుంటాయి. తమిళంలో, కన్నడంలో కూడా ఆపర్లు వచ్చాయి.

కొత్త సినిమా విషయాలకొస్తే.. మృత్యుంజయతో పాటు, గొదావరి గట్టు మీద లో కూడా మంచి పాత్రలు చేశాను. త్వరలోనే అవి విడుదల కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను.

Advertisement
 
Advertisement
Advertisement