breaking news
Shivani Nagaram
-
‘హే బల్వంత్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అసలేం జరిగిందంటే? తిరుమల వివాదంపై క్లారిటీ
-
తిరుమల దర్శన వివాదం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
లిటిల్ హార్ట్స్, అంజాజీపేట మ్యారేజ్ బ్యాండు, హే బలవంత్ తదితర సినిమాలతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం.. రీసెంట్గా ఊహించని విమర్శలు ఎదుర్కొంటోంది. తిరుమలలో తనకు 15 నిమిషాల పాటు స్వామి దర్శనభాగ్యం దక్కిందని కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో సామాన్య భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఐదు సెకన్ల దొరకడమే కష్టమనుకుంటే ఈమె ఇలా చెబుతుందేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోపై స్వయంగా సదరు హీరోయినే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)'కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. యాంకర్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. చిన్నప్పటి విషయాలు, సినిమా జర్నీ, భక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడాను. నా స్పిరిట్యూల్ జర్నీ గురించి పంచుకున్నా. అందులో తిరుపతి గురించి మాట్లాడాను. 15 నిమిషాల దర్శనం అనే మాట హైలైట్ అవుతోంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. 2025 అక్టోబరులో విమానాశ్రయంలో నేను, మా అమ్మ.. లైనులో నిల్చుని శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాం. తర్వాత దర్శనం చేసుకున్నాం. లైన్లో మొదటి నుంచి స్వామి దగ్గరకు వెళ్లేంతవరకు కొంచెం కొంచెం స్వామివారు కనిపిస్తుంటారు. ఆ మొత్తం సమయం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను తప్పితే పావుగంట పాటు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అని కాదు''సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా రూ.300 టికెట్ తీసుకుని కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లాను. అప్పుడు కేవలం 5 సెకన్ల పాటు స్వామిని చూశాను. నా జీవితంలో తొలిసారి 13 ఏళ్ల తర్వాత స్వామిని అంత దగ్గరగా చూశాను. ఇది నేను సంతోషంగా భావించి ఆత్రుతతో ఆ విషయాన్ని పంచుకున్నాను అంతే. అది కొంచెం మిస్ లీడింగ్‌గా వెళ్తోంది. మీలో ఎవరైనా శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుని వెళ్తే స్వామి దర్శనం మీకు కూడా అలానే దక్కుతుంది' అని హీరోయిన్ శివానీ నాగారం వివరణ ఇచ్చింది.(ఇదీ చదవండి: అన్వేష్‌కి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) -
ఇలాంటి టైమ్‌లో అలాంటి రిస్క్ తీసుకోను : కమెడియన్ సుదర్శన్
చాలా మంది హాస్య నటులు తమకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత హీరోలుగా చేశారు. నా కెరీర్ ఇప్పుడే ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో అలాంటి రిస్క్ తీసుకోలేను. ఒకవేళ నేను హీరోగా చేయాలంటే అది హీరోలు చేయలేని చిన్న చిన్న కాన్సెప్ట్‌లు చేయలేని సినిమాలు చేయాలి. థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మెయిన్ లీడ్ సినిమాలు చేయాలని లేదు’ అని అన్నారు కమెడియన్ సుదర్శన్. సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుదర్శన్ ఓ కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కమెడిన్ సుదర్శన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు.→ 'హే బల్వంత్' లో మంచి క్యారెక్టర్ చేశాను. సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి. డ్రింకింగ్ సీన్, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌కు ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్, సుహాస్, నరేష్, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు.→ ఈ సినిమాలో నటించిన అందరితో నాకు అందరితో మంచి ర్యాపో ఉంది. ప్రతి సీన్‌కు అందరం మంచి సింక్‌లో ఉన్నాం. అందరూ క్లోజ్‌నెస్‌తో ఫ్లోతో సీన్లు బాగా వచ్చాయి→ నేను హీరోగా వెండితెరపై ఇప్పుడే చేయను. అనుకోకుండా సినీ పరిశ్రమకు వచ్చాం. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను. ఈ టైమ్‌లో రిస్క్ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ఉంది. నటుడిగా సెటిల్ అయిపోయిన తరువాత హీరోగా ఆలోచిద్దాం. ఒకవేళ హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో చేసే ఓటీటీ సినిమాలు చేస్తాను.→ ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాను. కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది. కేవలం డేట్స్ క్లాష్ వల్ల దగ్గరికి వచ్చి పోతుంటాయి. తమిళంలో, కన్నడంలో కూడా ఆపర్లు వచ్చాయి.→ కొత్త సినిమా విషయాలకొస్తే.. మృత్యుంజయతో పాటు, గొదావరి గట్టు మీద లో కూడా మంచి పాత్రలు చేశాను. త్వరలోనే అవి విడుదల కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. -
సుహాస్‌కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
ఈ వీకెండ్ థియేటర్లలోకి పలు తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు వచ్చినప్పటికీ సుహాస్ హీరోగా చేసిన 'హే బలవంత్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారిక నంబర్స్ వదిలారు. ఎన్ని కోట్లు వచ్చాయనేది పోస్టర్ రూపంలో విడుదల చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)గతవారం రిలీజైన వాటిలో 'కపుల్ ఫ్రెండ్లీ' మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఈ వారం 'హే బలవంత్' ఆ బాధ్యత తీసుకుంది. ఇది కాకుండా మరో రెండు మూడు విడుదలైనప్పటికీ వాటికి పాజిటివ్ టాక్ రాలేదు. ఇకపోతే సుహాస్, శివానీ నాగారం, నరేశ్, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'హే బలవంత్' చిత్రానికి ముందురోజు ప్రీమియర్స్ వేశారు. నిన్న(ఫిబ్రవరి 20) థియేటర్లలోకి వచ్చింది. అలా తొలిరోజు రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. సుహాస్ గత చిత్రంతో పోలిస్తే ఇది చాలా బెటర్. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసే అవకాశముంది.'హే బలవంత్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కృష్ణ(సుహాసన్), తండ్రి బలవంత్(నరేశ్), నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) సంరక్షణలో పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి తండ్రిని రోల్ మోడల్‌గా తీసుకున్న కృష్ణ.. ఆయన బిజినెస్ టేకోవర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి తొలుత వద్దని చెప్పినప్పటికీ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత కృష్ణ మైండ్ బ్లాక్ అవుతుంది. దీని వల్లే ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం)కి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ బలవంత్ చేస్తున్న బిజినెస్ ఏంటి? దాని వల్ల కృష్ణ ప్రేమకు వచ్చిన చిక్కేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: మాధవన్) -
తిరుమల గుడిలో అలాంటి అనుభవం: శివానీ నగరం
హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమల. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడినుంచో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. రెండు సెకన్ల దర్శనభాగ్యం కోసం కొన్ని గంటల తరబడి లైన్లో నిలబడి వేచి చూస్తారు. అయితే తాను మాత్రం 15 నిమిషాలు వెంకటేశ్వరస్వామివారిని తనివితీరా దర్శించుకున్నానంటోంది హీరోయిన్ శివానీ నగరం. 15 నిమిషాల దర్శనం కాకపోతే అక్కడ తనను చూసిన కొందరు భక్తులు దేవుడితో పాటు తననూ కీర్తించారని కామెంట్లు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివానీ నగరం మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్లాను. దాదాపు 13 ఏళ్ల తర్వాత.. లిటిల్ హార్ట్స్ సక్సెస్ అనంతరం మళ్లీ తిరుమలకు వెళ్లాను. నన్ను కాసేపు ద్వారం దగ్గర నిల్చోబెడతామని చెప్పారు. ఏకంగా 15 నిమిషాలు గర్భగుడి ఎదుట నిల్చోబెట్టి దర్శనం చేయించారు. దేవుని గుడిలో నాగురించి..ఎవరూ నన్ను వెళ్లిపోమని తొందరపెట్టలేదు. ఒకవైపు నుంచేమో భక్తులు గోవిందా.. గోవిందా అంటూ కీర్తిస్తున్నారు. మరోవైపు నుంచి కాత్యాయని, భోం చేశావా? అంటున్నారు. అది వినగానే నేను షాకయ్యాను. దేవుడా.. ఇంక నాకేం వద్దు అనిపించింది. అదే సమయంలో అమ్మ కూడా.. 'నీవల్ల 15 నిమిషాల దర్శనం దొరికింది. థాంక్యూ బేటా.. నీకు తల్లినయినందుకు గర్వంగా ఉంది' అని కామెంట్ చేసింది. ఆ మాట వినగానే జీవితానికి ఇది చాలు అని ఉప్పొంగిపోయానంది. హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత దేనికి?ఇది చూసిన నెటిజన్లు.. ఒకటీరెండు సినిమాలు చేసిన హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత, అదే సామాన్య భక్తులను మాత్రం తోసేస్తారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివానీ డప్పు కొట్టుకుంటోందని సెటైర్లు వేస్తున్నారు. కాగా శివానీ నగరం.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. లిటిల్ హార్ట్స్ చిత్రంతో క్రేజ్ అందుకుంది. తాజాగా మరోసారి సుహాస్‌తో జతకట్టింది. అతడికి జంటగా నటించిన హే బలవంత్ మూవీ నేడే (ఫిబ్రవరి 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన సౌత్ లో సినిమాలో కనిపిస్తే చాలు చిన్న సినిమాలో చేసినా వాళ్ళను కూడా దేవుడి రేంజ్లో చూస్తారు లేకపోతే ఏమిటి దేవుడిపై మనసు లగ్నం చేయకుండా గర్భగుడిలో ఆమె నటించిన సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరుతో అరవడం ఏమిటి pic.twitter.com/pMLIqzDJIg— Kumar Reddy.Avula (@Kumar991957) February 20, 2026 చదవండి: ఎందుకిలా బాధపెడుతున్నారు? కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా -
‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యంగ్ హీరో సుహాస్‌కి ఈ మధ్యకాలంలో సరైన హిట్టే పడలేదు. వరుస సినిమా చేస్తున్నప్పటికీ..ఏ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని అందించలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘హే బల్వంత్’(హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సుహాస్‌కి జోడీగా నటించిన శివానీ నాగారం.. ఇందులోనూ హీరోయిన్గా చేసింది. సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై బన్నీవాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రంతో అయిన సుహాస్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే...తల్లిలేని కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి ఓ కోరిక ఉంటుంది. పెద్దయ్యాక తండ్రి రావు బల్వంత్(నరేశ్) చేసే బిజినెస్ టేకోవర్ చేసి.. మంచి పేరు సంపాదించాలనుకుంటాడు. అయితే నాన్న చేసే బిజినెస్ ఏంటి అనేది మాత్రం అతనికి తెలియదు. నాన్నను, నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ)ను అడిగినా.. చెప్పరు. చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ చూసుకుంటానంటే తొలుత నాన్న ఒప్పుకోడు. కానీ ఓ కారణంగా రావు బల్వంత్ వ్యాపారం కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. చిన్నప్పటి నుంచి ఏవోవో కలలు కన్న కృష్ణకి ఆ వ్యాపారం ఏంటనేది తెలిశాక..షాక్‌కి గురవుతాడు. తాను ఊహించినదానికి భిన్నంగా నాన్న వ్యాపారం ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మిత్ర(శివానీ నాగారం)కి కూడా ఆ వ్యాపారం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అసలు బల్వంత్ రావు చేసే వ్యాపారం ఏంటి? దాని వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? కృష్ణ చేసే వ్యాపారం గురించి ప్రియురాలు మిత్రకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? మిత్ర తాత(బాబు మోహన్)కి కృష్ణ బిజినెస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ బిజినెస్ వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పీవీబీ (హర్ష వర్ధన్)కి వచ్చిన సమస్య ఏంటి? చంప(స్రవంతి) ఎవరు? ఈ కథలో బెజ్జం దుర్గారావు (అజయ్ ఘోష్), యువన్ (వెన్నెల కిశోర్) పాత్రలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పేరుకు ఇది కామెడీ చిత్రం కానీ ఇందులో చాలా సెన్సిబుల్ టాపిక్‌ని చర్చించారు. సమాజం మొత్తం ఛీ కొట్టే ఓ వృత్తిలో మహిళలు ఎదుర్కొనే అవమానాలు, బాధలను చూపిస్తూ.. చట్టవిరుద్ధమైన ఓ వ్యాపారానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పాటు తండ్రి-కొడుకుల అనుబంధాన్ని, చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మంచి సందేశాన్ని అందించాడు దర్శకుడు. అయితే ఈ విషయాలన్నీ సీరియస్‌గా చెప్పకుండా లైటర్ వేలో కామెడీగా చూపించి..చివరిలో భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు.వినోదంతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీటవేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్లో చూపించినట్లుగా ఈ సినిమా కథ మొత్తం హీరో తండ్రి చేసే బిజినెస్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఆ వ్యాపారం ఏంటో చూపించారు. అది తెలిశాక హీరో ఎలా రియాక్ట్ అవుతాడా అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇక హీరో ఆ బిజినెస్‌ని తన చేతుల్లోకి తీసుకున్నాక అసలు కథ ప్రారంభం అవుతుంది. ప్రియురాలికి ఆ వ్యాపారం గురించి తెలియకుండా హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ప్రకృతి వైద్యం ఎపిసోడ్లో వెన్నెల కిశోర్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం ఓ శవం చుట్టూనే కథనం తిరుగుతుంది. ఆ శవాన్ని తిసుకురావడానికి హీరో గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఒకవైపు.. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వెన్నెల కిశోర్ చేసే హంగామా మరోవైపు.. ఇలా ద్వితియార్థం కొనసాగుతుంది. ఇక ప్రీక్లైమాక్స్‌లో బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను అనుకరిస్తూ నరేశ్ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం నెమ్మదిగా సాగుతుంది. కాస్త బుర్రపెట్టి చూస్తే..ట్విస్టులతో పాటు తర్వాత ఏం జరుగుతుందనేది కూడా ఊహించొచ్చు. క్లైమాక్స్‌లో నరేశ్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ బావోధ్వేగానికి గురి చేస్తుంది. లాజిక్స్ వెతక్కుండా సినిమా చూస్తే మరి పగలబడి కాకపోయినా.. సరదాగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు సుహాస్ న్యాయం చేశాడు. ఎప్పటిమాదిరే తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు సుహాస్‌తో పాటు మరో హీరో నరేశ్ అని చెప్పొచ్చు. రావు బల్వంత్ పాత్రలో జీవించేశాడు. సినిమా మొత్తం నవ్విస్తూనే చివరిలో భావోద్వేగానికి లోనయ్యేలా చేశాడు. మహేశ్ బాబు ‘పోకిరీ’ సీన్‌తో పాటు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను ఇమిటేట్ చేస్తూ చెప్పే డైలాగుకు పడి పడి నవ్వుతారు. మిత్ర పాత్రకి శివాని న్యాయం చేసింది. హీరో స్నేహితుడిగా సుదర్శన్ వేసే పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. యాంకర్ స్రవంతి పోషించిన చంప పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. అయితే డబ్బింగ్ విషయంలో ఆమె ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అన్నపూర్ణమ్మ, హర్షవర్దన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సుహాస్ ‘హే బల్వంత్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అదే బాధగా అనిపిస్తుంది : సుహాస్
నా కెరీర్ మొత్తంలో అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సినిమా ‘హే బల్వంత్’. కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యాను. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా వచ్చింది’ అన్నారు యంగ్ హీరో సుహాస్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హే బల్వంత్' (హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) . శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..భగవాన్ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో హేబల్‌వంత్‌గా మార్చాం. సినిమాలో నరేష్ క్యారెక్టర్ పేరు మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు.చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఆలోచించే కుర్రాడు, నాన్న బిజినెస్‌ను టేకప్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంర్‌టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది. ఈ మూవీతో నాకు విజయం అందుతుందనే నమ్మకం ఉంది.ప్రతి సినిమా కోసం మీ ఎఫర్ట్ పెడుతున్నాను. కానీ సరైన విజయం అందడం లేదు. విజయం కోసం ఎదురుచూడటమే కాస్త బాధగా అనిపిస్తుంది. కానీ వెంటనే తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాను.వరుస ఫెయిల్యూర్స్ తరువాత అందరూ కంట్రోల్‌గా ఆలోచించి సినిమా చేయమని చెప్పారు. ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్ ఇచ్చి హేబల్‌వంత్ చేశాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ‘మంచి యాక్టర్. మంచి సినిమా పడాలి’ అనే సానుభూతి అందరిలో ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.తమిళ్ సినిమా మందాడిలో మెయిన్ విలన్‌గా చేస్తున్నా. సినిమా రిజల్ట్ తరువాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. నేను వెయిట్ చేసిన లుక్ అండ్ క్యారెక్టర్. అంబాజీ పేట సినిమా చూసి ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు.నా కెరీర్ ప్రారంభంలో షార్ట్ఫిల్మ్స్లో నేను కామెడీ పాత్రలే చేశాను. ఈ సినిమాలో నా పాత్రను చూసి మా ఆవిడ కూడా ఇలాంటి సినిమాలు చేయమని కోరింది. లక్కీగా నాకు ఈ సినిమా వచ్చింది.కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా హిట్ అయితే అది ఇంకా పెరుగుతుంది. అందరూ సినిమా మీద ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నారు. పెద్ద విజయం రాబోతుంది. ఈ సినిమా మా వైఫ్ కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేసింది.ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను.త్వరలోనే ఫైలన్ అవుతాయి. -
ప్రేక్షకుల నోట ఆ మాట వినాలని ఉంది: శివానీ నాగారం
‘‘వేగంగా వంద సినిమాలు చేయడం కంటే.. నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఐదు సినిమాలు చేసినా చాలు’ అనుకునే మనస్తత్వం నాది. వెంట వెంటనే సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావు అని కొందరు నాతో అన్నారు. కానీ, ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట ప్రేక్షకుల నోట వినాలని ఉంది. సెలక్టివ్‌గా సినిమాలు చేసే సాయిపల్లవి, నిత్యామీనన్గార్ల బాటలోనే నేను కూడా పయనిస్తాను’’ అని చెప్పారు హీరోయిన్ శివానీ నాగారం. సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘హే బల్వంత్!’ (హే భగవాన్ టైటిల్‌ను హే భల్వంత్! గా మార్చారు). గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం హైదరాబాద్. గాయనిగా కెరీర్‌ను ప్రారంభించాను. యాక్టర్‌గా తొలిసారి సుహాస్‌తో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ మూవీ చేశాను. ఇప్పుడు మళ్లీ సుహాస్‌తో ‘హే బల్వంత్’ చేశాను.నా పాత్రలో అమాయకత్వంతో పాటు కామెడీ కూడా ఉంటుంది. నరేశ్, వెన్నెల కిషోర్, సుదర్శన్గార్ల కామెడీ నవ్విస్తుంది. సెకండాఫ్‌లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది. తెలుగు అమ్మాయిలకు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలకు చాన్స్ వచ్చింది.. వివరాలు త్వరలోనే చెబుతాను. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తాను. అవకాశం వస్తే సింగర్‌గాను నిరూపించుకోవాలని ఉంది’’ అని చెప్పారు. -
టాలీవుడ్లో తెలుగమ్మాయిల హవా.. ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్‌గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు. అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.మానస వారణాసి..మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.శివానీ నాగారం..తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్ మూవీతో యూత్‌ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.బేబీ వైష్ణవి చైతన్య..బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్ నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ మెరిసింది. ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.శ్రీ గౌరి ప్రియ..మ్యాడ్ బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. యూత్‌లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..కోర్ట్ మూవీతో ఓవర్‌నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్‌మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.ఈషా రెబ్బా..మన వరంగల్‌కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం. -
‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)
-
నాలుగు రోజుల్లో రిలీజ్.. 'హే భగవాన్' టైటిల్ మార్పు
టాలీవుడ్‌ను సెన్సార్ సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం 'కపుల్ ఫ్రెండ్లీ, వానర సినిమాల టైటిల్స్ మార్చాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. ఇప్పుడు తాజాగా సుహాస్ సినిమాకు అలాంటి ఇబ్బందే వచ్చింది. విడుదలకు కేవలం నాలుగురోజుల ముందు టైటిల్ మార్చాలని CBFC పేర్కొంది. దీంతో తప్పని పరిస్థితిల్లో సినిమా పేరును మార్చి పోస్టర్‌ను విడుదల చేశారు.తండ్రీ తనయుల మధ్య అనుబంధాన్ని 'హే భగవాన్' మూవీలో ఓ కొత్త కోణంలో చూపిస్తామని దర్శకుడు గోపీ అచ్చర అన్నారు. అయితే, తాజాగా సెన్సార్ సూచన ప్రకారం ఈ టైటిల్‌ను 'హే బల్వంత్'(Hey Balwanth)గా మార్చారు. దీంతో నెటిజన్లు షాకవుతున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రమిది. వీకే నరేశ్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీకి CBFC నుండి A సర్టిఫికేట్ లభించింది. కేవలం టైటిల్ కారణంగానే ఆ సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాత, డిస్ట్రీబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చెప్పారు. అదే 'ఫ్రెండ్లీ కపుల్' టైటిల్ పెడితే 'U/A' వచ్చేదని ఆయన గుర్తుచేశారు. దీంతో పెద్దలు మాత్రమే థియేటర్లలో సినిమా చూడాల్సి ఉంటుందనేది తెలిసిందే. మరోవైపు వానర మూవీ టైటిల్‌ను కాస్త వనవీరగా మార్చారు. హనుమంతుడితో ముడిపడి ఉన్న పేరు కావడంతో సున్నితమైన కుల,రాజకీయ అంశాలు ఉండటం వల్ల సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు కారణాలతో చిన్న సినిమాలకు సెన్సార్ చిక్కులు తప్పడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
సుహాస్ కాల్ చేసి మరీ..! ఫ్రెండ్ రోల్ కోసం వెళ్లి...
-
ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి : వంశీ నందిపాటి
‘‘హే భగవాన్’ ఎంటర్టైన్మెంట్ మూవీ. స్టోరీ లెవల్ నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ఇప్పుడు సమర్పకుడిగా ఉన్నాను. ఈ సినిమాలో బిజినెస్ అనే అంశం ఉంటుంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ అంశం ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో వినోదంతో పాటు భావోద్వేగాలు ఉన్నాయి. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది’’ అని వంశీ నందిపాటి అన్నారు. సుహాస్, శివానీ నాగారం జోడీగా గోపీ అచ్చర దర్శకత్వం వహించిన చిత్రం ‘హే భగవాన్’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ నందిపాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పేరు భగవాన్.. అందుకే ‘హే భగవాన్’ టైటిల్ పెట్టాం. కొంతకాలం నుంచి సుహాస్ ఎదురు చూస్తున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సాధించబోతున్నాడు. కథ పరంగా ఏవైనా మార్పులుంటే కన్విన్సింగ్‌గా చెబితే దర్శకులు కూడా ఒప్పుకుంటారు. అయితే కంటెంట్‌లో బలం ఉంటేనే మనం కూడా ఏమైనా చేయగలం.దర్శకుడు హ్యాపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. ఇక ‘లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ మూవీస్ తర్వాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఫిల్మ్‌ఛాంబర్‌లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఓటీటీ బిజినెస్‌లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం చేసే సినిమాలు పెరిగాయి. నిర్మాతగా మంచి చిత్రాలు అందించాలనేది నా లక్ష్యం. బన్నీ వాసుగారు నాకు బ్రదర్‌లాంటి వారు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటాయి. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్‌గా మార్చి 6న రిలీజ్ చేస్తున్నాను. సత్యదేవ్‌తో పాటు శ్రీవిష్ణుతో సినిమాలు చేస్తున్నాను. ‘పొలిమేర–3’ షూట్‌ని ఏప్రిల్ లేదా మేలో ప్రారంభిస్తాం. ఈ మూవీని అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈటీవీ విన్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
'హే భగవాన్' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
మహేష్ బాబు ట్వీట్ చూడగానే..! ఈ జన్మకి ఒక్కసారైనా...!
-
'హే భగవాన్'.. మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి రా? (ట్రైలర్)
సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'హే భగవాన్' ట్రైలర్ వచ్చేసింది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు తదితర సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సుహాస్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో గోపి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కించగా నరేంద్రరెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో శివాని నగరం, నరేష్ విజయ కృష్ణ, సుదర్శన్ తదితరులు నటించారు. -
'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
ఇంతకీ ఏంటా బిజినెస్? కామెడీగా 'హే భగవాన్' టీజర్
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలతో ఆకట్టుకున్న సుహాస్.. గతేడాది రెండు మూడు చిత్రాలు చేశాడు గానీ హిట్ పడలేదు. ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'హే భగవాన్'. గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సుహాస్ పాటు నటించిన శివానీ నాగారం.. ఇందులోనూ హీరోయిన్గా చేసింది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!)గ్లింప్స్ అయితే కామెడీగా ఉంది. తండ్రి చేస్తున్న బిజినెస్‌ని పెద్దయ్యాక టేకోవర్ చేస్తానని చిన్నప్పుడే ఫిక్స్ అయిన హీరో.. పెద్దయ్యాక ఏం తెలుసుకున్నాడు? ఇతడికి పరిచయమైన హీరోయిన్ ఎవరు? అనేది స్టోరీలా అనిపిస్తుంది. హీరో తండ్రిగా నరేశ్ కనిపించనున్నారు. అయితే ఆ బిజినెస్ ఏంటనేది పక్కనబెడితే టీజర్లో కామెడీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 20న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ) -
అప్పుడే తెలిసిపోయింది
తన ప్రయాణం ప్లాన్ చేసినదేం కాదు. కాని, విధి పిలుపును మాత్రం ఆమె విన్నది. అలా హైదరాబాద్ వీధుల్లో పానీపూరీ తింటూ నవ్వుకున్న సాదాసీదా అమ్మాయి– నేడు తెరపై సహజ మంత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె శివాని నాగారం. ఆమె విషయాలు ఆమె మాటల్లోనే మీ కోసం!⇒ చిన్నప్పటి నుంచే నేర్చుకున్న కూచిపూడి నాట్యం నాకు ఒక థెరపీలా ఉంటుంది. ఏదైనా టెన్షన్ ఉన్నా, కొన్ని స్టెప్స్ వేస్తే చాలు, మనసంతా రిలాక్స్ అయిపోతుంది.⇒ హైదరాబాద్‌లోనే పెరిగాను. అందుకే రోడ్డు పక్కన నిలబడి మిర్చి బజ్జీ, పానీపూరీ తినడం, సాయంత్రం రోడ్ల మీద కార్లు వెళ్లే శబ్దం వినడం ఇవన్నీ నా చిన్న చిన్న ఆనందాలు.⇒ సినిమాల్లోకి రావడం నేను ముందే ప్లాన్ చేసుకున్న విషయం కాదు. కాని, నా ప్రయాణం పెద్ద తెరతో కాదు, చిన్న కథలతోనే మొదలైంది. ఒక చిన్న షార్ట్‌ఫిల్మ్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించినా, అలా మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డ ఆ క్షణంలోనే ‘ఇదే నా దారి’ అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది.⇒ మొదటి సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ విడుదలైనప్పుడు మనుసులో కొంచెం భయం ఉన్నా, ప్రేక్షకులు చూపిన ప్రేమ ఆ భయాన్ని పూర్తిగా కరిగించింది.⇒ రెండో, మూడో సినిమాలు వచ్చేటప్పటికి నాలోనే ఒక కొత్త శివానిని చూసుకున్నాను. ప్రతి పాత్ర నాకు ఒక కొత్త నేర్పు, ఒక కొత్త అనుభవం ఇచ్చింది.⇒ పూలంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఏ పువ్వైనా చేతిలో తీసుకుని అలా తిరగేస్తూ, వాసన చూస్తూ ఉండటం నాకు హాబీలా మారిపోయింది.⇒ కథలు చదవడం నా అలవాటు. పెద్ద నవలలు కాకుండా, హృదయానికి హత్తుకునే చిన్న కథలు బాగా నచ్చుతాయి.⇒ ఫ్యాషన్ విషయానికి వస్తే నేను చాలా సింపుల్. ఒక మంచి జీన్స్, క్లీన్స్ గా ఉండే కుర్తా, చిన్న చెవిపోగులు. అంతే, నేను సిద్ధం.⇒ చర్మ సంరక్షణ విషయంలో నేను ఎక్కువ క్రీములు వాడను. రోజూ తగినంత నీళ్లు తాగడం, రాత్రి మాయిశ్చరైజర్ మాత్రం తప్పనిసరి. వారానికి ఒకసారి పెసరపిండి రాసుకుంటే చాలు, చర్మం బాగా ఫ్రెష్‌గా మారుతుంది.⇒ నాకు ఇష్టమైన రంగులు పింక్లోని మృదువైన షేడ్స్, లైట్ బ్లూ.⇒ అభిమానులతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. వాళ్ల కామెంట్లు, మెసేజులు, వారి ప్రేమ– అవన్నీ నాకు కొత్త శక్తి ఇస్తాయి. -
రుక్మిణి 'కాంతార 1' జ్ఞాపకాలు.. 'లిటిల్ హార్ట్స్' శివానీ ఇలా
'కాంతార 1' షూటింగ్ జ్ఞాపకాలతో రుక్మిణి వసంత్'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ గ్లామరస్ పోజులువర్కౌట్ చేస్తూ పెట్ డాగ్‌తో కీర్తి సురేశ్ సరదాజిమ్ ఫొటో పోస్ట్ చేసిన ముద్దుగుమ్మ సమంతఅందాల హరివిల్లులా జాన్వీ కపూర్ స్టిల్స్జిమ్ వీడియో పోస్ట్ చేసిన నభా నటేశ్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Namrata Purohit (@namratapurohit) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి
ప్రేక్షకుల మనసుకు దగ్గరవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు. ఎంచుకున్న పాత్రలో ఇమిడిపోయి నటించాలి. అలాంటి నటనతో మన పక్కింటి అమ్మాయిలా ఉందేంటి? మనింటి అమ్మాయిలానే ఉంది.. అనుకునేట్టుగా దగ్గరవుతున్న నటి శివాని నాగారం. ఆకర్షించే కళ్లు, ఆకట్టుకునే నటన ఈ తెలుగమ్మాయి సొంతం. ఈ లిటిల్ హార్ట్ గురించి మరెన్నో విశేషాలు మీకోసం..ఆ సినిమాతో క్లిక్అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాలో వెండితెరపై మెరిసిన నటి శివాని (Shivani Nagaram). మొదటి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో శివాని కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. శివాని స్వస్థలం హైదరాబాద్. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె మొదట ‘అంతర్గత’ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. తర్వాత ‘మిస్టర్ గర్ల్ ఫ్రెండ్’ అనే వెబ్ సిరీస్ చేసి తెలుగు యువతకు ముందుగానే పరిచయమైంది.చాలా అవకాశాలొచ్చాయి, కానీ..చిన్నతనం నుంచే శివాని సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఖాళీ సమయాల్లో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ క్లాసులు తీసుకోవడం తనకెంతో ఇష్టమట! సోషల్ మీడియాలో ఆమె తన తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. దాన్నిబట్టి ఆమెకు సంగీతంపై ఉన్న ఇష్టం అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ హిట్ అయ్యాక, చాలా అవకాశాలు వచ్చాయి కాని, ఒప్పుకోలేదు. ఎందుకంటే అదే తరహా క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. నాకు ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ ఉండాలి.నిత్యవిద్యార్థినిఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా.. నేనింకా యాక్టింగ్ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.ఆ హీరోయిన్‌కు అభిమానినినేను హీరోయిన్ సమంతకు పెద్ద ఫ్యాన్. శ్రీదేవి గారు, సావిత్రి గారి నటన అంటే చాలా ఇష్టం. 'నువ్వు హీరోయిన్ కాకపోయుంటే ఏమయ్యేదానివి’ అని చాలామంది అడుగుతుంటారు. హీరోయిన్ కాకుంటే కచ్చితంగా సింగర్ అయ్యేదాన్ని. నాకు మ్యూజిక్, డ్యాన్స్ అంటే ప్రాణం. నాకు కథ, అందులో నా క్యారెక్టర్ చాలా ముఖ్యం. అవి నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. అంతే తప్ప, గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవట్లేదు. నేను రెండు సినిమాలే చేశాను. వాటికే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతలా ప్రేమిస్తుండటం చూస్తే, చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది.చదవండి: దమ్ముంటే నాకు సైట్ కొట్టి చూడండి : హీరోయిన్ -
నటి శివానీ నగరం దసరా స్పెషల్..ఆ నమ్మకంతోనే ముందుకు
‘‘దుర్గా మాతని శక్తి స్వరూపిణి అంటారు. ప్రతి స్త్రీలోనూ అంతర్లీనంగా దుర్గా మాత ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే ఎలాంటి క్లిష్టమైన సవాల్‌ను ఎదుర్కొనాల్సి వచ్చినా బలంగా, ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నారు... సక్సెస్ అవుతూ, వారిని వారు సంరక్షించుకోగలుగుతున్నారు. స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే దసరా మహిళలందరికీ పెద్ద పండగ’’ అని అన్నారు యువ నటి శివానీ నాగారం. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయం అయ్యారు శివానీ. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తెలుగు తెరపై ఈ మధ్య మెరిసిన నవ తారల్లో తెలుగమ్మాయి శివానీకి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. విజయోత్సాహంలో ఉన్న శివానీ దసరా, బతుకమ్మ పండగ విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. మా కుటుంబానికి ‘దసరా’ చాలా పెద్ద పండగ. మేం అందరం కలిసి చాలా సందడిగా దసరా నవరాత్రులను చేసుకుంటాం. అలాగే బతుకమ్మ పండగను కూడా సెలబ్రేట్ చేస్తాం. రంగు రంగుల పువ్వులు సేకరించి, మా కుటుంబంలోని మహిళలతో పాటు అ పార్ట్మెంట్లోని మహిళలందరం కలిసి బతుకమ్మ ఆడతాం. దసరా అనగానే నాకు అమ్మవారు గుర్తుకు వస్తారు. మనకు ఉన్న చెడు వెళ్లిపోయి మనల్ని అమ్మవారు గుడ్ డేస్, గుడ్ స్ట్రెంత్తో ఆశీర్వదిస్తారు. మేం ఆ రోజు బంగారం కొంటాం. తొమ్మిదో రోజు ఆయుధ పూజ చేస్తాం. మా ఇంట్లో ఉన్న కార్లు, బైక్‌లకు పూల మాల వేసి, పూజలు చేస్తాం. ఇంటిని బాగా అలకరించుకుంటాం. బూరెలు, పాయసం, పులిహోర... ఇలా రకరకాల వంటకాలు చేసి, దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెడతాం. ఇక నా జీవితంలో దసరా పండక్కి ప్రత్యేకమైన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాను. కొన్ని పండగలకు మా కజిన్స్ మా ఇంటికి వస్తారు. కొన్నిసార్లు మేం వాళ్ల ఇంటికి వెళ్తాం. అలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటాం. దసరా పండగకి సంబంధించి నా స్కూల్ డేస్‌లో కానీ, కాలేజ్ డేస్‌లో కానీ ఎలాంటి మైథలాజికల్ క్యారెక్టర్ చేయలేదు. అయితే అవకాశం వస్తే ఆ తరహా పాత్ర చేయాలని ఉంది. ఎందుకంటే ఆ పాత్రలో కొంత మహిళా సాధికారత ఉంటుందని నా నమ్మకం. ఓ నటిగా నాకు స్థిరత్వం, ఓపిక చాలా ముఖ్యం. దసరా అంటే క్లిష్టపరిస్థితులను దాటుకుని, విజయం సాధించడం. అందుకే మనకు ఓపిక, నమ్మకం ఉండాలి. చెడు రోజులను బలంగా ఎదుర్కొని, హుందాగా నెగ్గుకు రాగలగాలి. చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలుకోల్కతాలో దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. నా జీవితంలో ఒక్కసారైనా నేను కోల్‌కతా వెళ్లి, దుర్గామాత పూజలో పాల్గొనాలని ఉంది. కొన్నిసార్లు నేను హైదరాబాద్‌లో బెంగాలీ సమితులకు వెళ్తాను. ప్రతి ఏడాది దసరా నవరాత్రుల ఉత్సవాల్లో ఏదో ఒకరోజు తప్పకుండా వెళ్లి, అమ్మ వారిని దర్శించుకుంటాను. అక్కడ దుర్గామాతకు హారతి ఇస్తారు. ఆ సమయంలో బెంగాలీ మహిళలు తెల్లచీర ధరించి, నుదుట ఎరుపు రంగు బొట్టు పెట్టుకుని, డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. ఇక దసరా ఫెస్టివల్‌కి నా కాలేజీ డేస్ నుంచి దాండియా, గర్బా ఆడటం అలవాటు. ఎవరు దాండియా, గర్బా ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేసినా అక్కడికి మేం గ్రూప్‌గా వెళ్లి రాత్రంతా ఆడేవాళ్ళం. అంత క్రేజీగా ఉండేది. నాకు అది లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇదీ చదవండి: Janhvi Kapoor అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : అమేజింగ్ లుక్నేను స్పిరిచ్యువల్ పర్సన్నిబాధగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడనే కాదు... అవకాశం దొరికినప్పుడల్లా దేవాయాలకు వెళ్తుంటాను. గుడిని ఇల్లుగా భావిస్తాను. అలాగే ఇంటిని కూడా దేవాలయంలా అనుకుంటాను. మా కుటుంబ సభ్యులు కూడా అలానే ఉంటారు. నేను ఎక్కడకి వెళ్లినా, ఎక్కడున్నా దేవుడు అక్కడే ఉన్నారని నేను అనుకుంటాను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నన్ను రక్షిస్తుందని నా నమ్మకం. నన్నే కాదు... అందర్నీ రక్షిస్తుంటుందని భావిస్తాను. ఈ నమ్మకం వల్లే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం. ఉపవాసం అంటే స్వీయ నియంత్రణఉపవాసం గురించి ఎవరి వ్యక్తిగత అభి్ర΄ాయాలు వారికి ఉండొచ్చు. దసరా సమయంలో ఇప్పటివరకు నేనైతే ఉపవాసం ఉండలేదు. మా అమ్మ, అమ్మమ్మగార్లు ఉంటారు. అయితే ఉపవాసం చేయడం వల్ల స్వీయ నియంత్రణ కలుగుతుంది. అమ్మవారికి మన వంతుగా ఏదో ఇచ్చిన ఓ సంతృప్తి ఉంటుంది.ఓపికతో ఉండాలి మనకు మనమే స్ఫూర్తిగా నిలవాలంటే ముందు మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇదే మనకు మనం ఇచ్చుకునే మోటివేషన్. ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితం వస్తుందంటారు. సహనంగా ఉంటే ఏ పనైనా సరిగ్గా అవుతుంది. అందుకే నా ఓర్పే నా శక్తి అని నమ్ముతాను. – ముసిమి శివాంజనేయులు -
ఆడియన్స్ పిచ్చోళ్లా.. ఇంత సపోర్ట్ చేస్తారా?: యంగ్ హీరో
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం సరిగ్గా ఆడడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ వచ్చిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ భారీ విజయం సాధించింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం రిలీజైన తొలిరోజే(సెప్టెంబర్ 5) హిట్ టాక్ తెచ్చుకొని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా హీరో మౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. ‘ఆడియన్స్.. పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా. మేము అస్సలు ఊహించలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. తొలి వారం కొంతమంది చూస్తారు. మౌత్ టాక్‌తో రెండో వారం నడుస్తుందేమో అనుకున్నాం. అలా అనుకొనే గట్టిగా ప్రమోషన్స్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా రారా అనుకున్నాం. కానీ ప్రీమియర్స్, ఫస్ట్ రోజు..థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఫస్ట్‌డే రూ.2.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది మా సినిమా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్. ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తునారనో నాకే అర్థం కాలేదు. ఎవరైనా సినిమా బాగోలేదని కామెంట్ పెడితే.. వాళ్లను తిడుతూ రిప్లై ఇస్తున్నారు. రవితేజ, నాని మొదలు ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను మొచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే కష్టపడి మంచి సినిమాలు తీస్తానని అందరికి మాట ఇస్తున్నా’ అన్నారు.సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. 2009-2020 మధ్యకాలంలో జరిగే టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. -
పెళ్లి కూతురిలా జాన్వీ కపూర్.. నివేదా చబ్బీ లుక్
పెళ్లి కూతురిలా ముస్తాబైన జాన్వీ కపూర్జిగేలు మనే డ్రస్సులో మెరిసిపోతున్న తమన్నాతెల్లని చీరలో ఓనం జరుపుకొన్న నివేదా థామస్చీరలో మరింత అందంగా అనన్య నాగళ్లఇళయరాజా పాట పాడి ఆకట్టుకున్న మడోన్నారెడ్ డ్రస్సులో 'లిటిల్ హార్ట్స్' శివానీ నాగారం View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
రీసెంట్ వీకెండ్లో మూడు సినిమాలొస్తే ఏ మాత్రం అంచనాల్లేని 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన మౌళి, శివాని నాగారంతో పాటు హీరో ఫ్రెండ్‌గా చేసిన జయకృష్ణని అందరూ ప్రశంసిస్తున్నారు. మౌళి, జయకృష్ణ యూట్యూబర్స్ అని చాలామందికి తెలుసు. కానీ కాత్యాయని పాత్రలో హీరోయిన్గా కనిపించిన శివాని ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు? ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?ఈ సినిమాలో మౌళితో పాటు కాత్యాయని పాత్రలో శివాని కూడా ఆకట్టుకుంది. ఈమె ఇదివరకే ఓ తెలుగు సినిమాలో చేసింది. అయితే ఈమె యాక్టింగ్‌తోపాటు సింగర్ కమ్ ట్రైన్డ్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1988లో హైదరాబాదులో పుట్టిన శివానీ.. చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ చేసింది. 'అంతర్గత' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?)ఇన్ స్టాలో చూసి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రంలో ఛాన్స్ ఉందని శివానికి తెలిసింది. అయితే హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇస్తే, అదృష్టం కలిసొచ్చి ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఈమె.. ఖాళీ సమయంలో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అలానే తమ్ముడితో కలిసి సాంగ్స్ పాడుతూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తొలి సినిమా కంటే ముందు 'జాతిరత్నాలు'లో న్యూస్ ప్రెజెంటర్‌గా చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' మూవీతో కాత్యాయనిగా కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేస్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న 'హే భగవాన్' అనే మూవీలో హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) -
ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)
-
‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: లిటిల్ హార్ట్స్నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులురచన, దర్శకత్వం : సాయి మార్తండ్నిర్మాత: ఆదిత్య హాసన్సంగీతం: సింజిత్ యెర్రమల్లిసినిమాటోగ్రఫీ : సూర్య బాలాజీవిడుదల తేది: సెప్టెంబర్ 5, 2025‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ఫేమ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమాపై ఓ మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఈ సినిమా కథ 2009-2020 మధ్య కాలంలో సాగుతుంది. నల్లి అఖిల్(మౌళి తనూజ్) చదువులో చాలా వీక్. అతన్ని ఇంజనీర్ చేయాలానేది తండ్రి గోపాలరావు(రాజీవ్ కనకాల)ఆశయం. కానీ అఖిల్ ఎంసెట్‌లో క్వాలిఫై కూడా కాడు. తనవల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు తండ్రి. ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న కాత్యాయని(శివానీ నాగారం) పరిస్థితి కూడా అంతే. ఆమెకు మెడిసిన్ చదవడం ఇష్టం ఉండదు. కానీ పెరెంట్స్ బలవంతంగా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తారు. అక్కడే అఖిల్‌కి కాత్యాయని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. అఖిల్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగానే.. కాత్యాయని ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడిస్తుంది. అదేంటి? అఖిల్, కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వీరిద్దరు ఎలా ఎదుర్కొని..ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉన్నా.. తెరపై చూస్తుంటే బోర్ కొట్టదు. ఊహించే మలుపు ఉన్నా.. ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా.. ఎంటర్టైన్ అవుతుంటాం. లిటిల్ హార్ట్స్ ఆ కోవలోకి చెందిన చిత్రమే. కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్ రొటీజ్ టీనేజ్ లవ్‌స్టోరీ. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. పంచ్ డైలాగులు సినిమాను నిలబెట్టాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా 2009-2020 మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. జియో సిమ్ రాకముందు అంటూ హీరోహీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లో హీరోహీరోయిన్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాత్యాయని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీ డబుల్ అవుతుంది. హీరోయిన్‌కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఆమె బర్త్‌డే కోసం అఖిల్ చేసే సర్ప్రైజ్.. అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోహీరోయిన్లు కలిసేందుకు చిన్న పిల్లలను వాడుకోవడం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న యూత్‌ఫుల్ కామెడీ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి. బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ‘గోల్స్ ఎప్పుడు అందంగా ఉండాలి’ అంటూ హీరోతో ఒక డైలాగ్ చెప్పించడమే కాకుండా.. క్లైమాక్స్‌లో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. యూత్ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. అఖిల్ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. కాత్యాయని పాత్రకి శివానీ నాగారం న్యాయం చేసింది. మౌళికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో స్నేహిడు మధుగా జయకృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది. మరో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. -
థియేటర్, ఓటీటీ తేడా చూడను.. కథ, నా పాత్ర నచ్చితే చాలు : శివానీ నాగారం
‘‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో కాత్యాయని అనే కాలేజ్ గర్ల్‌గా చేశాను. ప్రేక్షకులు తమని తాము పోల్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమాలోని అఖిల్ (మౌళి తనుజ్ పాత్ర), కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే కళాశాల రోజులు, అలాగే విద్యార్థిగా మనం చేసిన పనులన్నీ గుర్తొస్తాయి... మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది’’ అని శివానీ నాగారం తెలిపారు. మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ నాగారం మాట్లాడుతూ– ‘‘లిటిల్ హార్ట్స్’ సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. తన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సాయి మార్తాండ్ కథ, నా పాత్ర చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. మా సినిమా కంటెంట్ నచ్చడంతో ‘బన్నీ’ వాసు, వంశీ నందిపాటిగార్లు రిలీజ్ చేస్తున్నారు. దాంతో మా సినిమా ఓవర్సీస్లోనూ విడుదలవుతోంది. ఇక థియేటర్, ఓటీటీ అనే తేడాలు చూడను. కథ, నా పాత్ర నచ్చితే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తాను. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నేను, సుహాస్ కలిసి ‘హే భగవాన్’ సినిమా చేస్తున్నాం. మరో రెండు చిత్రాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.


