
రీసెంట్ వీకెండ్‌లో మూడు సినిమాలొస్తే ఏ మాత్రం అంచనాల్లేని 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన మౌళి, శివాని నాగారంతో పాటు హీరో ఫ్రెండ్‌గా చేసిన జయకృష్ణని అందరూ ప్రశంసిస్తున్నారు. మౌళి, జయకృష్ణ యూట్యూబర్స్ అని చాలామందికి తెలుసు. కానీ కాత్యాయని పాత్రలో హీరోయిన్‌గా కనిపించిన శివాని ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు? ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?
ఈ సినిమాలో మౌళితో పాటు కాత్యాయని పాత్రలో శివాని కూడా ఆకట్టుకుంది. ఈమె ఇదివరకే ఓ తెలుగు సినిమాలో చేసింది. అయితే ఈమె యాక్టింగ్‌తోపాటు సింగర్ కమ్ ట్రైన్డ్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1988లో హైదరాబాదులో పుట్టిన శివానీ.. చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ చేసింది. 'అంతర్గత' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?)
ఇన్ స్టాలో చూసి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రంలో ఛాన్స్ ఉందని శివానికి తెలిసింది. అయితే హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇస్తే, అదృష్టం కలిసొచ్చి ఈమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు. సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఈమె.. ఖాళీ సమయంలో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అలానే తమ్ముడితో కలిసి సాంగ్స్ పాడుతూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
తొలి సినిమా కంటే ముందు 'జాతిరత్నాలు'లో న్యూస్ ప్రెజెంటర్‌గా చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' మూవీతో కాత్యాయనిగా కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేస్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న 'హే భగవాన్' అనే మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది.
(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ)