
హీరోయిన్ రేణు దేశాయ్ ఇటీవలే తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సమయంలో అందరూ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. దయచేసి రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువ శబ్దం వచ్చే క్రాకర్స్‌ను పేల్చవద్దని కూడా ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేసింది.
అయితే తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల దీపావళి ఇంటర్వ్యూలో సన్యాసం తీసుకోవడంపై తాను చేసిన కామెంట్స్‌పై మాట్లాడింది. రేణు దేశాయ్ సన్యాసం తీసుకుంటారని వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. నా జీవితంలో ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని అనుకోలేదని తెలిపింది. నా లైఫ్‌లో నా పిల్లలే అన్నింటికంటే ముఖ్యమని తెలిపింది. వారి లైఫ్ సెటిల్ చేశాకే తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటానని రేణు దేశాయ్ తెలిపింది. అంతే కానీ ఇప్పటికిప్పుడు తాను సన్యాసం తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. దయచేసి ఇలాంటి వాటిపై కాకుండా.. మనదేశంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని మీడియావారిని కోరుతున్నట్లు వీడియో రిలీజ్ చేసింది.
వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ..'ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇటీవల దీపావళి ఇంటర్వ్యూలో యాంకర్ నెక్ట్స్ ఏంటి అని అడిగింది. దీనికి నేను సరదాగా సన్యాసం తీసుకుంటా అని చెప్పా. కానీ ఇప్పటికిప్పుడు తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదు. ఇది చూసి పెద్ద సెన్సేషన్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్, బంధువులు కాల్ చేసి ఈ విషయం గురించి అడుగుతున్నారు. అసలు రేణుకు ఏమైంది? బాగానే ఉందా? అని అడుగుతున్నారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఆద్య టెన్త్ క్లాస్‌లో ఉంది. వారి బాధ్యత నాపై ఉంది. ఇప్పుడైతే నేను సన్యాసం తీసుకోను. నా వయసు 55 నుంచి 60 వచ్చినప్పుడు ఆలోచిస్తా. నాకిప్పుడు దేవుడి కంటే నా పిల్లలే ముఖ్యం' అని క్లారిటీ ఇచ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్‌లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది.