టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ మూవీ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 13న వెంకీ మామ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్కు అదే రోజు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రేమంటే ఇదేరా 4కె ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా వెంకీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 13న రీ రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. కొత్త రిలీడ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో బర్త్డే రోజు ఈ సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న వెంకీమామ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అఖండ-2 వాయిదా పడడం, చిన్న సినిమాలు రిలీజ్ ఉండడం వల్లే ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కాగా.. 1998లో వచ్చిన ఈ మూవీకి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ ప్రేమకథా చిత్రంలో వెంకటేష్, ప్రీతి జింటా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
#PremanteIdera re-release postponed!
Stay tuned for new release date! #PremanteIderaReRelease #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/qrXeoDrRAl— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2025


