ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సినిమాలు చూడం: హీరో కార్తి | Actor Karthi Talk About Annagaru Vastaru Movie | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సినిమాలు చూడం: హీరో కార్తి

Dec 10 2025 7:15 PM | Updated on Dec 10 2025 8:53 PM

Actor Karthi Talk About Annagaru Vastaru Movie

‘హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ‘అన్నగారు వస్తారు’ మూవీ ఉంటుంది’ అన్నారు హీరో కార్తి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్‌ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్ లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్ ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది.

నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.

కథల పరంగా కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను. నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్ లో అక్కడి సినిమాలు ఇక్కడ ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాసోవర్ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్ లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు.

డైరెక్టర్ నలన్ గత సినిమాలు శాడ్ ఎండింగ్ తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్ గా ఉంటుంది. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది.

నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్ తో ఉంటాయి. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడు. సంతోష్ నారాయణన్ ను ఇంట్రడ్యూస్ చేసింది నలన్ కుమారస్వామి. అయితే ఈ సినిమాకు నలన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడు. కానీ సంతోష్ వచ్చి నేనే వర్క్ చేస్తా అని అడిగి మరీ మూవీకి జాయిన్ అయ్యాడు.

హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్ ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.

నేను టీమ్ వర్క్ ను బిలీవ్ చేస్తాను. దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసుకుంటాం. సెట్ లో సీన్ చేసే ముందు కూడా మాట్లాడుకుంటాం. నాకు అనిపించిన సజెషన్స్ చెబుతాను. నేను క్యారెక్టర్ లో ఉండిపోతాను కాబట్టి ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. నావంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేస్తుంటా.

ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మూవీకి ఏం కావాలన్నా చేశారు. అన్నగారు వస్తారులో కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం. ఒకవారం రెండు మూడు సినిమాలు వచ్చినా తప్పులేదు. ప్రేక్షకులు ఒక మూవీ తర్వాత మరొక మూవీ చూస్తారు. నేనూ ఒక ఆడియెన్ గా అలాగే చూసేవాడిని. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటారు.

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని భావోద్వేగాలు, పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలు ఎప్పుడు చూసినా మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement