టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా .. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్దఎత్తున చర్చ జరిగింది. మూవీ మేకర్స్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఈ చిత్రాన్ని వేశారు. ఈనెల 5న విడుదల కావాల్సిన అఖండ-2.. చివరి నిమిషంలో అభిమానులకు షాకిచ్చింది.
అయితే తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్. అఖండ-2ను డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 12న దాదాపు ఐదారు చిన్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. సందీప్ రాజ్ మౌగ్లీ, హెబ్బా పటేల్ ఈషా, సైక్ సిద్ధార్థ్ లాంటి చిత్రాలు ముందుగానే డేట్ ప్రకటించారు.
కానీ ఊహించని విధంగా బాలయ్య అఖండ-2 ఇదే రోజున రిలీజ్ చేస్తున్నారు. దీంతో సందీప్ రాజ్ మూవీ మౌగ్లీ ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య సినిమా వాయిదా ఎఫెక్ట్ చిన్న సినిమాల రిలీజ్కు అడ్డంకిగా మారింది. ఈ విషయంపై డైరెక్టర్ సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా ఇవాళ హెబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో అఖండ-2 సినిమా వల్ల బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు తప్పుకోవాల్సిన పరిస్థితిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న సినిమాలు తప్పుకుంటున్నాయా? అన్న ప్రశ్నకు నిర్మాత బన్నీ వాసు స్పందించారు.
ఈ ప్రశ్నకు బన్నీ వాసు స్పందిస్తూ.. అఖండ-2ను పెద్దలారీతో పోల్చారు. చిన్న సినిమాలను చిన్న కారుగా అభివర్ణించారు. 'హైవేపై మనం చిన్నకారులో వెళ్తున్నాం.. మన వెనకాల పెద్ద లారీ వస్తోంది.. వాడు హారన్ కొడితే.. మన కారు పక్కకు తప్పుకోవాల్సిందే' అన్నారు. అలా కాదంటే.. మనం ఎక్కడికో వెళ్లిపోతాం అంటూ బన్నీ వాసు కామెంట్స్ చేశారు.
అయితే చిన్న సినిమాలను ఉద్దేశించి బన్నీ వాసు కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. చిన్న చిత్రాలను కించపరిచేలా బన్నీ వాసు వ్యాఖ్యలు ఉన్నాయంటూ సినీ ప్రియులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్‌పై రావాల్సిన ఈ చిత్రం.. అఖండ-2 దెబ్బకు క్రిస్మస్కు తరలిపోయింది.
ఇండస్ట్రీ లో అందరు తప్పక "Jai Balayya" అని తప్పుకుంటున్నారా ?
"Highway మీద పెద్ద vehicles కి దారి ఇవ్వకపోతే మనకే risk" - #BunnyVas#Akhanda2 #Balakrishna pic.twitter.com/p0ujehI0kR— Daily Culture (@DailyCultureYT) December 10, 2025


