హీరోగా టాలీవుడ్ కమెడియన్‌.. హీరోయిన్‌గా ఏకంగా మిస్ యూనివర్స్..! | Comedian Satya Tollywood Movie actress first look poster out now | Sakshi
Sakshi News home page

హీరోగా టాలీవుడ్ కమెడియన్‌.. హీరోయిన్‌గా ఏకంగా మిస్ యూనివర్స్..!

Dec 10 2025 5:27 PM | Updated on Dec 10 2025 5:27 PM

Comedian Satya Tollywood Movie actress first look poster out now

తన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కమెడియన్ సత్య. బ్రహ్మనందం, అలీ తర్వాత టాలీవుడ్కు దొరికిన ఆణిముత్యం ఆయనే. ప్రస్తుతం కమెడియన్గా ఫుల్ స్వింగ్లో ఉన్న సత్య.. ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సత్య నటిస్తోన్న తాజా చిత్రం జెట్లీ. ఇటీవలే మూవీ ఫస్ట్లుక్పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించారు.

తాజాగా మూవీకి సంబంధించిన హీరోయిన్ఫస్ట్లుక్పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఇవాళ రియా సింగా పుట్టినరోజు కావడంతో విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీతోనే రియా టాలీవుడ్కు పరిచయమవుతోంది. రియా సింగా మిస్యూనివర్స్ఇండియా-2024 టైటిల్ విన్నర్ కావడం విశేషం. కమెడియన్సత్య సరసన ఏకంగా మిస్ యూనివర్స్ హీరోయిన్గా కనిపించడంపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా.. జైపూర్‌కు చెందిన రియా సింగా గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా 2024 నవంబర్ 16న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె టాప్ 30 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. మిస్ యూనివర్స్ ఇండియా కంటే ముందు.. ఆమె మిస్ టీన్ ఎర్త్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement