స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. ఈ మధ్య కాలంలో డ్యాన్స్ షోలకు జడ్జిగా, సహాయ నటిగా కనిపిస్తూ బిజీ అయిపోయింది. మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టడంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుంది. 'గుంటూరు కారం'లో కుర్చీ మడతపెట్టి పాటతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.
పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. అలా మలయాళంలో సూపర్ డ్యాన్సర్ అనే పోటీలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత నటి అయిపోవడంతో మళ్లీ స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చే అవకాశం రాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్టేజీపై నృత్య ప్రదర్శన చేసిన తర్వాత భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. భర్త గురించి చెబుతూ పూర్ణ ఎమోషనల్ అయిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
'మా అమ్మ కృషి, ప్రోత్సాహం వల్లే నేను డ్యాన్సర్ అయ్యాను. పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు.. అమ్మలా నా డ్యాన్స్‌ని ఎంకరేజ్ చేసే భర్త రావాలని దేవుడిని కోరుకున్నాను. అలానే 'నువ్వు కోరుకున్న కలలు నెరవేరేలా చూసే వ్యక్తి నీకు భర్తగా రావాలి' అని అమ్మ కూడా నన్ను దీవించింది. అటు అమ్మ కల, ఇటు నా కలని దేవుడు నిజం చేశాడు. నా భర్త.. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. అయినా సరే నా డ్యాన్స్‌కి సపోర్ట్ చేశారు. కులం, నేపథ్యం లాంటి తేడాలు పట్టించుకోకుండా ఓ మనిషిగా, ప్రేమ గౌరవం చూపించే ఆయన మంచి మనసుకు నేను ధన్యురాలిని' అని భర్తని పూర్ణ తెగ పొగిడేసింది.
పూర్ణ లేటెస్ట్‌గా నటించిన సినిమా 'అఖండ 2'. తొలి భాగంలో ఈమె చేసిన పాత్రకు ఇందులోనూ కొనసాగింపు ఉండనుంది.
(ఇదీ చదవండి: రోడ్డు మీద దయనీయ స్థితిలో శ్యామల.. కాపాడిన పోలీసులు)


