సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ మధ్య చాలా మంది బహిరంగంగా మాట్లాడుతున్నారు. పలువురు హీరోయిన్లు తమకు ఎదురైన వేధింపుల గురించి మీడియాతో పంచుకుంటున్నారు. అంతేకాదు అలాంటి వేధింపులు వస్తే..ఎలా డీల్ చేయాలో కూడా సలహాలు ఇస్తూ.. నూతన నటీనటులుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా నటి యామిని భాస్కర్(yamini Bhaskar) కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిచింది. ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎదవలు ఉంటారని.. ధైర్యంగా ఎదురుతిరిగితేనే కెరీర్‌లో రాణిస్తామని చెబుతోంది.
రభస(2014) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తొలి చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కాటమరాయుడు, నర్తనశాల, భలే మంచి చౌకబేరమ్, కొత్తగా మా ప్రయాణం ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా నటిస్తూ వచ్చింది. నర్తనశాల రిలీజ్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన యామిని.. ఇప్పుడు ‘సైక్ సిద్ధార్థ’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.
ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా కొంతమంది ఎదవలు ఉంటారు. నా కెరీర్ ప్రారంభంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు ఆనీ.. మధ్యలో కొంతమంది తగిలారు. వాళ్లని ఎలా డీల్ చేయాలో అర్థం కాక.. సినిమాలనే వదులుకున్నాను. కొన్నిసార్లు మనల్ని డ్యామినేట్ చేసేవాళ్లు ఉంటారు. మేల్ ఈగో చూపిస్తూ.. అమ్మాయిలను ఇబ్బంది చేస్తుంటారు. అప్పట్లో నాకు కాస్త భయం ఉండేది. వాళ్ల గురించి మాట్లాడలేకపోయా. సైలెంట్‌గా ఉండేదాన్ని. దీంతో అందరూ నాకు యాటిట్యూడ్ అనుకున్నారు. కానీ అలాంటి వాళ్లకు దూరంగా ఉండడం బెటరనీ నేను భావించా. అయితే ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లు అయితే లేరు. కొంతమంది మంచి వాళ్లు కూడా ఉన్నారు. అమ్మాయిలను గౌరవిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు.
ఇక కేవలం మగవాళ్లు మాత్రమే ఇబ్బంది పెడతారని నేను చెప్పట్లేదు. ఇక్కడ అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాళ్లు ఉన్నారు. అవసరానికి వాడుకొని వదిలేసే అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ రంగంలోనే కాదు ఎక్కడైనా ఇలాంటి వాళ్లు ఉంటారు. మన ప్రవర్తనను బట్టి..మనమేంటో తెలుసుకుంటారు’ అని యామిని చెప్పుకొచ్చారు. అలాగే తనకు గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆర్‌ఎక్స్ 100 చాన్స్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? తదిరల విషయాలను కూడా సాక్షితో పంచుకుంది. అవి తెలుసుకునేందుకు ఈ వీడియోని చూసేయండి


