అబిద్ భూషణ్, రోహిత్ సహాని హీరోలుగా, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్ టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో జై వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘మిస్ టీరియస్’ ఫస్ట్ టికెట్‌ను లాంచ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘1985 ఫిబ్రవరి 1వ తేదీ నేను మొదట నటించిన సినిమా ‘శ్రీ తాతావతారం’. ఆ సినిమాలో హీరో నరేశ్‌గారి కాలేజ్ ఫ్రెండ్స్ పాత్రల్లో నేను, మహి కోమటిరెడ్డి కలిసి నటించాం. ‘మిస్ టీరియస్’లో నేను నటించకపోయినప్పటికీ మహి వల్లే ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని కోరారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది’’ అని మహి కోమటిరెడ్డి చెప్పారు. ‘‘150 థియేటర్స్‌లో మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు జై వల్లందాస్.


