దివంగత సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్‌గా ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఘంటసాలగా కృష్ణ చైతన్య, ఘంటసాల సావిత్రమ్మగా మృదుల, చిన్న ఘంటసాలగా అతులిత నటించగా, సుమన్ ముఖ్యపాత్ర పోషించారు. సీహెచ్ రామారావు రచన, దర్శకత్వంలో అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో సీహెచ్ ఫణి తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబరు 12న విడుదల కానుంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆదిత్య హాసన్ అతిథిగా హాజరై ట్రైలర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఘంటసాల’ స్క్రిప్ట్ భావోద్వేగంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఘంటసాలగారిపాటలు వింటూ పెరిగిన నేను ఇలా ఆయన జీవిత చరిత్రను చెప్పే సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని కృష్ణ చైతన్య తెలిపారు. ‘‘ఘంటసాలగారి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియాలని ఈ సినిమా తీశాను’’ అని చె΄్పారు సీహెచ్ రామారావు.
∙ఆదిత్య హాసన్, సీహెచ్ రామారావు, కృష్ణ చైతన్య


