తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
కేక్ కటింగ్‌లు, డీజే శబ్దాల మధ్య ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ హోరెత్తించారు.
నగరాలు, పట్టణాలు మొదలుకొని గ్రామాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
2026కు స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.


