అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాశ్ తుమినాడ్, రవి భట్, సంగీత లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వంలో నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. ‘జిన్ అనేది ఉండుంటే ఒకసారి వచ్చి నా చేతిని టచ్ చేయాలి, నన్ను మీరే కాదు... ఎవ్వరూ పట్టుకోలేరు’ అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘థియేటర్స్‌లో కరెక్ట్‌గా భయపెడితే ఆడియన్స్ హారర్ చిత్రాలను ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘జిన్’ ట్రైలర్ నచ్చింది’’ అన్నారు
సోహెల్ మాట్లాడుతూ .. ‘తెలుగు ఆడియెన్స్ అన్ని భాషల చిత్రాల్ని, అన్ని భాషల టెక్నీషియన్లను ఆదరిస్తుంటారు. ‘జిన్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. స్పూకీ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ బాగుంది. జిన్‌లో గుడ్ జిన్ ఉంటుంది.. బ్యాడ్ జిన్ ఉంటుంది. ట్రైలర్ చూస్తే ఇది బ్యాడ్ జిన్ గురించి చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. డిసెంబర్ 19న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ .. ‘‘మా ‘జిన్’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా అందరినీ సపోర్ట్ చేసేందుకు డబ్బులు పెట్టి నిర్మించిన నిఖిల్ గారికి థాంక్స్. మా చిత్రం డిసెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఆడియెన్స్ అందరూ మా మూవీని చూడండి. మీరు పెట్టే డబ్బులకు సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇస్తామ’ని అన్నారు.


