హారర్ థ్రిల్లర్ ‘జిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ రోజుల్లో వైవిధ్యభరితమైన కథలు ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. కథలో స్టఫ్ ఉండాలే గానీ, కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాను తీసుకొని ఓ డిఫరెంట్ జానర్ లో "జిన్" అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ చిన్మయ్ రామ్. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తుండగా.. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడమే గాక అంచనాలు నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మంచి హైప్ నడుమ ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు జిన్ అనే టైటిల్ ప్లస్ పాయింట్. కథనే కాదు టైటిల్ లో కూడా వైవిద్యం ఉండటంతో ఈ సినిమా సులువుగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా కథకు యాప్ట్ అయ్యే పలు లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఖర్చుకు నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదట. స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందని, ఈ మూవీ థియేటర్స్ సూపర్ సక్సెస్ కావడం పక్కా అని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం కానీ ఇది అన్నింటిలో డిఫరెంట్ అవుతుందని అంటున్నారు.