అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్ తదితరులు నటించిన సినిమా 'జిన్'. చిన్మయ్ రామ్ దర్శకుడు. నిఖిల్ ఎం. గౌడ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూవీ తాజాగా (డిసెంబరు 19) థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ఓ కాలేజీలోని లైబ్రరీలో ఓ కుర్రాడికి వింత అనుభవం ఎదురవుతుంది. రాత్రి ఒక్కడే ఉండటంతో అతనికి వింత శబ్దాలు, వింత ఘటనలు తారసపడతాయి. ఓ నలుగురు కుర్రాళ్లు ఎగ్జామ్ రాసేందుకు భూతనాల చెరువు దాటి జ్ఞాన వికాస్ కాలేజీకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎదురైన సంఘటనలేంటి? ఆ బిల్డింగ్‌లో వీళ్లు ఎలా చిక్కుకున్నారు? చివరకు బయటపడ్డారా? ఇంతకీ 'జిన్' సంగతేంటనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఫస్ట్ హాఫ్ అంతా కూడా నలుగురు కుర్రాళ్లు, వారి అల్లరి, కాలేజీ సీన్లతో టైమ్ పాస్ అయిపోతుంది. కాసేపటికి తమకు ఏర్పడిన ప్రమాదం గురించి తెలుస్తుంది. చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ద్వితీయార్దంలో జిన్ ఎంట్రీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, కాలేజీ బిల్డింగ్‌లో ఉన్న ఆత్మల గురించి రివీల్ చేస్తూ వెళ్లారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని బాగా ముగించారు.
అమిత్ రావ్ ఆకట్టుకున్నాడు. పర్వేజ్ సింబా బాగా చేశాడు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, పోలీస్ ఆఫీసర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో పర్లేదనిపించారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది. సునీల్ కెమెరా పనితనం, అలెక్స్ ఆర్ఆర్ మంచి అనుభూతి ఇచ్చింది. నవ్విస్తూనే భయపెట్టడంలో టీమ్ సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
- రేటింగ్: 2.5/5


