టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సరైన విజయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ (2019) విజయం తర్వాత తనకు సరైన హిట్ దక్కలేదు. రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంద వంటి సినిమాలు వచ్చినప్పటికీ ఏదీ కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. రీసెంట్‌గా విడుదలైన ఆంధ్రా కింగ్ తాలుకా మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ, పట్టుమని రెండు వారాలైన గట్టిగా థియేటర్స్‌లో రన్ కాలేకపోయింది. ప్రస్తుతం రామ్ 40ఏళ్లకు దగ్గర్లో ఉన్నాడు. కొద్దిరోజులుగా తన పెళ్లి వార్తలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన సినీ కెరీర్ కూడా పెద్దగా చెప్పుకునే విధంగా లేదు. ఇలాంటి సమయంలో ఆయన నిర్ణయం ఎటూ అనేది తేల్చుకోవడం కాస్త కష్టమే అని చెప్పాలి.
స్కంద వంటి మాస్ సినిమాను కూడా జనం చూడలేదు. డబుల్ ఇస్మార్ట్ అని చెప్పినా సరే థియేటర్ వైపు ప్రేక్షకులు చూడలేదు. సరే అని ఆంధ్రా కింగ్ తాలుకా అంటూ కొత్త ప్రయత్నం చేస్తే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ, ప్రేక్షకులు లేరు. దీనికి కారణం తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ మూవీ కోసం మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. చివరకు నష్టాలను చూసింది. ఇప్పుడు రామ్ ఎలాంటి సినిమా తీస్తే జనాలు చూస్తారనే క్లారిటీ కూడా లేదు.
కథ పరంగా ఎలాంటి జోనర్ టచ్ చేసినా సరే.. ఫెయిల్యూర్ వెంటాడుతూనే ఉంది. ఆంధ్రా కింగ్ తాలుకా మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్ లేవు. వరుస పరాజయాల కారణంగా తన సినిమాలకు థియేటర్ మార్కెట్ చాలా వరకు పడిపోయింది. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక హీరోకు కనీసం రూ. 20 కోట్లు కలెక్షన్స్ కూడా రాకుంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఇలాంటి సమయంలో ఓటీటీ మార్కెట్ సంగతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.
వార్2తో ఎన్టీఆర్, గేమ్ ఛేంజర్ చిత్రంతో రామ్ చరణ్ కూడా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. కానీ, వారికి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో త్వరగానే బౌన్స్‌బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, రామ్ పోతినేనికి బలమైన కథతో పాటు సరైన దర్శకుడు దొరికితేనే నిలిదొక్కుకునే అవకాశం ఉంది.


