పాన్ ఇండియా మార్కెట్‌లో రాణించలేకపోతున్న టాలీవుడ్ సీనియర్ హీరోలు
పాన్ ఇండియా సినిమాకే కేరాఫ్‌గా మారింది టాలీవుడ్. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు తేజ సజ్జ, నిఖిల్ లాంటి కుర్ర హీరోలు కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తూ తమ పాపులారిటినీ పెంచుకుంటున్నారు. అదే జోష్‌లో మన సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్‌లో నిలబడాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి వర్కౌట్ అవ్వడం లేదు.
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్ల పాటు సినిమాలను ఆపేసినా కూడా ఆయన మార్కెట్ చెక్కుచెదరలేదు. కానీ పాన్ ఇండియా మార్కెట్‌లో మాత్రం చిరంజీవి ఫ్లాప్ అవ్వాలి. గాడ్ ఫాదర్ చిత్రంతో పాన్ ఇండియాలో మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరో నటించినా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దరుణంగా బోల్తా పడింది.
దీంతో చిరు పాన్ ఇండియా ప్రయత్నాలు వదిలేసి.. మళ్లీ లోకల్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు. సంక్రాంతికి రాబోతున్న ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ పక్కా తెలుగు సినిమా. ఇక్కడ హిట్ అయితే చాలు..పాన్ ఇండియా అవసరం లేదనుకొని, అదే రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇక బాలయ్య కూడా పాన్ ఇండియాపై ఫోకస్ చేశాడు. అఖండ 2తో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ చిరంజీవి కంటే దారుణమే ఎదురుదెబ్బ తగిలింది. అఖండ 2 కోసం ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేశాడు. హిందీతో డైలాగులు చెప్పి అలరించాడు. కానీ అవేవి థియేటర్స్‌కి రప్పించలేకపోయాయి. బాలీవుడ్‌లో అఖండ 2 అట్టర్ ఫ్లాప్ అయింది.
ఇక వెంకటేశ్ కూడా పాన్ ఇండియా మార్కెట్‌లో రాణించాలని ‘సైంధవ్’తో ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే కథలపైనే ఫోకస్ పెట్టాడు.
మనో సీనియర్ హీరో నాగార్జున కూడా అంతే. పాన్ ఇండియా పై ఆయనకు మోజే లేదు. సోలోగా రాణించాలనే ఆశే లేదు. కుబేర, కూలి, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు కానీ.. హీరోగా మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇలా టాలీవుడ్ సీనియర్లంతా పాన్ ఇండియా మార్కెట్ వద్ద ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా హిట్ కొడతారో చూడాలి.


