18ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా.. డబ్బు కంటే గౌరవం ముఖ్యం: నందు | Actor Sri Nandhu Interesting Comments About Psych Siddhartha Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

18ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా.. డబ్బు కంటే గౌరవం ముఖ్యం: నందు

Jan 1 2026 10:05 AM | Updated on Jan 1 2026 11:12 AM

Sri Nandhu Talk About Psych Siddhartha Movie

శ్రీ నందు, యామినీ భాస్కర్‌ జోడీగా నటించిన సినిమా ‘సైక్‌ సిద్ధార్థ’. వరుణ్‌ రెడ్డి దర్శకత్వంలో రానా స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌పై శ్రీ నందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీ నందు మాట్లాడుతూ–‘‘ఓ అబ్బాయిని ఓ అమ్మాయి మోసం చేస్తుంది. అదే అబ్బాయి జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో, ఆ అబ్బాయి జీవితం ఎలా బాగుపడింది? అన్నదే కథ. 

18ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం. ఈ క్రమంలో నా జడ్జ్‌మెంట్‌ ఎంతమేరకు కరెక్ట్‌ అనేది తెలుసుకోవడానికి నిర్మాతగా మారాను. నిర్మాత డి. సురేశ్‌బాబుగారు సపోర్ట్‌ చేస్తున్నారు. 

అక్కడే నా జడ్జిమెంట్‌ కరెక్ట్‌ అనిపించింది. అలాగే రానాగారి సపోర్ట్‌ను మర్చిపోలేను. నేను నటించిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్‌ అవుతుంది. అలాగే నేను, వెన్నెల కిషోర్, ‘వైవా’ హర్ష కలిసి ఓ సినిమా చేయబోతున్నాం’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement