breaking news
Missterious Movie
-
సస్పెన్స్... థ్రిల్
అబిద్ భూషణ్, రోహిత్ సహాని హీరోలుగా, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్ టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో జై వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘మిస్ టీరియస్’ ఫస్ట్ టికెట్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘1985 ఫిబ్రవరి 1వ తేదీ నేను మొదట నటించిన సినిమా ‘శ్రీ తాతావతారం’. ఆ సినిమాలో హీరో నరేశ్‌గారి కాలేజ్ ఫ్రెండ్స్ పాత్రల్లో నేను, మహి కోమటిరెడ్డి కలిసి నటించాం. ‘మిస్ టీరియస్’లో నేను నటించకపోయినప్పటికీ మహి వల్లే ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని కోరారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది’’ అని మహి కోమటిరెడ్డి చెప్పారు. ‘‘150 థియేటర్స్‌లో మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు జై వల్లందాస్. -
‘అడుగు అడుగునా..’ ఆకట్టుకుంది: సీపీ సీవీ ఆనంద్
రోహిత్ సాహిని, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టీరియస్’. తాజాగా ఈ సినిమాలోని ‘అడుగు అడుగునా’ పాటని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ఈ పాటను ఆలపించిన సింగర్ కార్తికేయన్‌ను అభినందించాడు. అంకితభావంతో పని చేసే పోలీసు అధికారిపై చిత్రీకరించిన ఈ పాటను అద్భుతంగా ఆలపించాడంటూ ప్రశంసులు కురిపించాడు. ఈ పాటను లిరిక్స్‌తో పాటు సంగీతం అందించిన ఎమ్ఎల్ రాజాకి అభినందనలు తెలియజేశాడు. జయ్ వల్లందాస్ నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. ‘ఎంతో బిజీ గా ఉండి కూడా మా సినిమా లిరికల్ సాంగ్ ని విడుదల చేసినందుకు కమీషనర్ CV ఆనంద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్త వరవడి లో చూపించే ప్రయత్నం చేశాం. దయచేసి అందరూ మా చిత్రాన్ని చూసి మమల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమం లో హీరో రోహిత్ సాహిని, గౌతమ్, దర్శకులు మహి కోమటిరెడ్డి, నిర్మాత జయ్ వల్లందాస్, సహా నిర్మాత రామ్ ఉప్పు (బన్నీ రామ్)తదితరులు పాల్గొన్నారు.


