‘అడుగు అడుగునా..’ ఆకట్టుకుంది: సీపీ సీవీ ఆనంద్‌ | Missterious Movie: Adugu Aduguna Telugu Lyrical Song Released By CP CV Anand | Sakshi
Sakshi News home page

Missterious: ‘అడుగు అడుగునా..’ ఆకట్టుకుంది: సీపీ సీవీ ఆనంద్‌

Aug 15 2025 11:54 AM | Updated on Aug 15 2025 12:42 PM

Missterious Movie: Adugu Aduguna Telugu Lyrical Song Released By CP CV Anand

రోహిత్ సాహిని, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్‌టీరియస్‌’. తాజాగా ఈ సినిమాలోని ‘అడుగు అడుగునా’ పాటని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్‌ ఈ పాటను ఆలపించిన సింగర్‌ కార్తికేయన్‌ను అభినందించాడు. అంకితభావంతో పని చేసే పోలీసు అధికారిపై చిత్రీకరించిన ఈ పాటను అద్భుతంగా ఆలపించాడంటూ ప్రశంసులు కురిపించాడు. ఈ పాటను లిరిక్స్‌తో పాటు సంగీతం అందించిన ఎమ్‌ఎల్‌ రాజాకి అభినందనలు తెలియజేశాడు. జయ్‌ వల్లందాస్‌ నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. 

‘ఎంతో బిజీ గా ఉండి కూడా మా సినిమా లిరికల్ సాంగ్ ని విడుదల చేసినందుకు కమీషనర్ CV ఆనంద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్త వరవడి లో చూపించే ప్రయత్నం చేశాం. దయచేసి అందరూ మా చిత్రాన్ని చూసి మమల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమం లో హీరో రోహిత్ సాహిని, గౌతమ్,  దర్శకులు మహి కోమటిరెడ్డి, నిర్మాత జయ్ వల్లందాస్, సహా నిర్మాత రామ్ ఉప్పు (బన్నీ రామ్)తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement