
నటుడు అల్లు శిరీష్(Allu Sirish) కొద్దిరోజుల క్రితం తన వివాహం గురించి ఒక పోస్ట్ చేశారు. అక్టోబర్ 31న నయనికతో నిశ్చితార్థం చేసుకోనున్నట్లు చెప్పారు. అయితే, తను ఫోటోను మాత్రం ఆయన రివీల్ చేయలేదు. కానీ, దీపావళీ పండుగ సందర్భంగా అల్లు కుటుంబం మొత్తం ఒకచోట చేరి ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలో శిరీష్ వదిన అల్లు స్నేహ ఫ్యామిలీ ఫోటోలను సోషల్‌మీడియాలో పంచకున్నారు. పొరపాటున నయనిక ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. తర్వాత అసలు విషయం గుర్తించిన ఆమె ఆ ఫోటోను కాస్త సైడ్ చేసి ఉంచారు. ఇంతలో నెటిజన్లు డౌన్‌లోడ్ చేసి శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట షేర్ చేస్తున్నారు.
నయనిక అల్లు కుటుంబంతో దీపావళి వేడుకలో మొదటిసారి కనిపించారు. ఆ ఫోటోలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, స్నేహ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు. నయనిక తన కాబోయే భర్త పక్కన కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఫోటోలను వారు వెంటనే తొలగించినప్పటికీ, నెటిజన్లు వాటిని వైరల్ చేశారు. అయితే, అల్లు కుటుంబం ఆమెను అధికారికంగా ఎప్పుడు పరిచయం చేస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన నయనికతో శిరీష్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారు పెళ్లి పీటలెక్కుతున్నారు. అక్టోబర్ 31న నిశ్చితార్థం జరగనుంది. డిసెంబరులో విదేశాల్లో వివాహ వేడుక జరగనుందని సమాచారం.