
ఒకప్పుడు సంప్రదాయానికి చిరునామాగా ఉన్న వంటగది, ఇప్పుడు సాంకేతిక విప్లవానికి నిదర్శనంగా మారుతోంది. సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ పాక శాస్త్రంలో కొత్త అధ్యాయానికి తెర తీస్తోంది. దూసుకొస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ)తో నడిచే రోబోటిక్స్ నల భీములకు ప్రత్యామ్నాయాలను అందిస్తూ చేయి తిరిగిన చెఫ్‌లకు కొత్త సవాళ్లు విసురుతోంది.
ఆహార రంగంలో కారి్మకుల కొరతను పరిష్కరించడం, ఆహార నాణ్యత నిర్ధారించడం లక్ష్యంగా వంటల రంగంలో ఆహార తయారీ నుంచి డెలివరీ వరకూ రోబోటిక్ సేవలు పెరుగుతున్నాయి. దీంతో ఈ రంగం వైపు తమ సాంకేతికతను విస్తరించడానికి రోబోటిక్ కంపెనీలు గణనీయమైన పెట్టుబడులను పెడుతున్నాయి. గత జనవరిలో, మిసో రోబోటిక్స్ కొత్త ఏఐ–శక్తితో కూడిన ఫ్లిప్పీ ఫ్రై స్టేషన్‌ను ప్రారంభించింది.
ఈ కొత్త మోడల్ 99% అప్‌టైమ్ రేటుతో అంతకు ముందు వాటి కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇది ఫ్రైస్, ఆనియన్ రింగ్స్, చికెన్‌తో సహా అనేక రకాల వేపుళ్లను వండగలదు. ఫ్లిప్పీని వైట్ కాజిల్ జాక్ ఇన్ ది బాక్స్ వంటి ప్రధాన ఫాస్ట్–ఫుడ్ రెస్టారెంట్ గ్రూప్స్ ఉపయోగిస్తున్నాయి. కాలిఫోర్నియాలో కొత్తగా ప్రారంభించిన బర్గర్ రెస్టారెంట్, ఏబీబీ రోబోటిక్స్‌ను వినియోగిస్తూ 30 సెకన్లలోçపే బర్గర్లను ఉత్పత్తి చేస్తోంది. ఏఐ మోడల్స్ మెరుగుపడుతున్న కొద్దీ, రోబోటిక్ చెఫ్‌లు విసు్తృత శ్రేణిలో వంట పదార్థాల శైలిని నిర్వహించగలుగుతున్నారు.
ఇంటి కిచెన్స్‌లోనూ..
రోబోటిక్ చెఫ్‌లు గృహ వినియోగ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ నోష్ త్వరలోనే ఇంట్లో కూడా వంట చేసే రోబోట్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఏఐ–ఆధారిత పరికరం వన్–పాట్ మీల్స్‌ను ఆటోమేట్ చేస్తుంది.
వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా పదార్థాలను లోడ్ చేయడానికి రోబోట్‌ను కమాండ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ బేర్ రోబోటిక్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇది డైనింగ్ రూమ్‌ల కోసం ఏఐ–ఆధారిత స్వయంప్రతిపత్తి సేవా రోబోట్‌లను తయారు చేస్తుంది.
అంతర్జాతీయ సంస్థలూ సై..
లండన్‌కు చెందిన మోలీ రోబోటిక్స్ 2023 చివరిలో ప్రపంచంలోనే మొట్టమొదటి లగ్జరీ రోబోట్ కిచెన్ షోరూమ్ ప్రారంభించింది. 2024లో నిర్వహించిన ఓ అంతర్జాతీయ ప్రదర్శనలో కాక్‌టెయిల్–మిక్సింగ్ రోబోట్ బారిస్టా బాట్‌లను ప్రదర్శించారు. గత జూలైలో భారత దేశానికి చెందిన ఆటోచెఫ్ అనే స్టార్టప్.. యాప్ ద్వారా నియంత్రించ గలిగిన రోబోటిక్ కిచెన్‌ను ప్రదర్శించింది.
జూలై 2025లో, చైనీస్ కంపెనీ డోబోట్ రోబోటిక్స్ 1,800 కి.మీ దూరం నుంచి వీఆర్ హెడ్‌సెట్ ద్వారా రిమోట్ ఉపయోగించి స్టీక్‌ను సిద్ధం చేయగల హ్యూమనాయిడ్ రోబోట్‌ను ప్రదర్శించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఆన్‌లైన్ వంట వీడియోలను చూడటం ద్వారా వంటకాలను నేర్చుకుని, పునఃసృష్టించగల రోబోటిక్ చెఫ్‌ను పరిచయం చేశారు.
కమ్మదనానికి ప్రత్యామ్నాయం కాదు..
రెస్టారెంట్ కిచెన్‌లోకి కొంత కాలం క్రితమే ఆటోమేషన్, ఇప్పుడు రోబోటిక్స్ రంగ ప్రవేశం చేశాయి. ఆహారాన్ని తయారు చేయడం,
వడ్డించడం వరకూ అనేక పనులను ఏఐ ఆధారిత సాంకేతికత పునర్‌నిర్వచిస్తోంది. దీని వల్ల మెరుగైన ఆహార భద్రత, కార్మికుల కొరతకు పరిష్కారం, కచ్చితత్వంతో పెద్ద పరిమాణాలను తయారు చేయడం వంటి లాభాలున్నాయి.
అయితే ఇది ఒక స్థాయికి మించి పెరిగితే ఆహారంతో పాటు అందే మానవ స్పర్శ, ప్రేమ కనుమరుగవుతాయి. అలాగే అనవసర ఖర్చులు పెరుగుతాయి. సాంకేతికతపై అతిగా ఆధారపడటం సృజనాత్మక శక్తిపై ప్రభావం చూపుతుంది.
కొన్ని వ్యవస్థల్లో, భారీ పరిశ్రమల్లో అవసరం కావచ్చు కానీ, ఈ ఆటోమేషన్ ప్రక్రియ మనిషి తయారు చేసిన వంటలోని కమ్మదనానికి ప్రత్యామ్నాయం కాబోదనేది నిర్వివాదమైన అంశం. రోజువారీ సేవలు అందించే రెస్టారెంట్స్‌లో మానవ స్పర్శ తగిలితేనే జిహ్వకు చక్కని రుచులు అందుతాయి.
– మహేష్ పడాల, చెఫ్
(చదవండి: క్యాబ్ డ్రైవర్‌గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..)