
‘కవాయి’ అనేది ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్స్ ట్రెండ్‌గా మారింది. మృదువైన రంగులు, కంటికి సంతోషాన్ని ఇచ్చే వస్తువులతో జపసనీస్ ఇంటీరియర్ డిజైన్ కవాయి విజువల్ థెరపీలా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ‘నా గది నా కంఫర్ట్‌ప్లేస్’ అనుకునేవాళ్లకు తమ గదిని మానసిక ప్రశాంతత ఇచ్చేలా తీర్చిదిద్దుకోవడానికి కవాయి డిజైన్ ఉపయోగపడుతుంది.
‘ఎంతోమంది, ముఖ్యంగా మహిళలు కవాయి ఇంటీరియర్స్ గదులను బాగా ఇష్టపడుతున్నారు. కవాయి డిజైనింగ్ వ్యక్తులపై సానుకూల ప్రభావం కలిగిస్తుంది’ అంటుంది బెంగళూరు చెందిన ఆర్కిటెక్ట్ సిరి శేఖర్. ‘కవాయి’ అనే జపనీస్ పదానికి అందమైన, ఆకర్షణీయమైన అని అర్థం. క్లౌడ్–షేప్‌డ్ ల్యాంప్స్, ఫ్లోరల్ ల్యాంప్స్, మష్రూమ్ మోటిఫ్స్, వాల్ స్టికర్స్, క్యూట్ బౌల్స్, మినియేచర్‌లు... మొదలైనవి కవాయిలో భాగం.
ఫ్యాషన్, కళ, సంగీతం, జీవనశైలి (లైఫ్‌స్టైల్), ఇంటీయర్స్‌లో కవాయి ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలో కవాయి ఇంటీరియర్స్‌కు సంబంధించి డిజైనర్‌ల సంఖ్య పెరిగింది. ‘గది అలంకరణ అనేది కేవలం ఆకర్షణ కోసం మాత్రమే కాదు.
ఆ అలంకరణ మనల్ని ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. కవాయి ఇంటీరియర్స్‌తో నా గదిని తీర్చిదిద్దుకున్నాను. గదిలోకి అడుగు పెడితే ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది గోవాకు చెందిన కంటెంట్ క్రియేటర్ రిచా దేశాయ్.
(చదవండి: ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!)