రీసైకిల్‌ కమ్‌ డెకరేషన్‌గా.. బాటిల్‌ ఆర్ట్‌..! | Creative Bottle Decoration Ideas for Home | DIY Recycled Bottle Crafts | Sakshi
Sakshi News home page

రీసైకిల్‌ కమ్‌ డెకరేషన్‌గా.. బాటిల్‌ ఆర్ట్‌..!

Oct 12 2025 2:22 PM | Updated on Oct 12 2025 3:37 PM

Home Decor Tips: Turn waste bottles into beautiful home decor showpiece

మన ఇళ్లలో ఖాళీగా ఉన్న గాజు లేదా ప్లాస్టిక్‌ బాటిళ్లు చెత్త బుట్టలోకి చేరుతుంటాయి. కాని కొంచెం సృజనాత్మక ఆలోచన, కొంచెం కలర్, పెయింట్‌ లేదా క్రాఫ్ట్‌ ఐడియాలతో ఆ బాటిళ్లను అందమైన హోమ్‌ డెకరేషన్‌లో షో పీసులుగా మార్చుకోవచ్చు. ఇది రీసైక్లింగ్‌కి తోడ్పడటమే కాకుండా ఇంటికి ఒక ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది.

డెకరేషన్‌  కోసం ఉపయోగించే మెటీరియల్స్‌
ఆక్రిలిక్‌ పెయింట్స్, స్ప్రే పెయింట్స్‌
గ్లిట్టర్, బీడ్స్, మిర్రర్‌ పీసెస్‌
జూట్‌ రోప్‌
స్టిక్కర్స్, టేప్‌
ఫాబ్రిక్‌ పీసెస్, లేస్‌ డిజైన్స్‌

బాటిల్స్‌ .. క్రియేటివిటీ

పెయింటెడ్‌ బాటిల్స్‌

బాటిల్‌పై స్ప్రే పెయింట్‌ వాడి ఒకే రంగులో కలర్‌ చేయాలి.

ఆక్రిలిక్‌ పెయింట్స్‌తో పూలు, ఆకులు లేదా జామెట్రిక్‌ డిజైన్స్‌ వేయాలి.
జూట్‌ రోప్‌ ర్యాప్‌

జూట్‌ తాడుతో బాటిల్‌ మొత్తం చుట్టి, పై భాగంలో షెల్స్‌ లేదా పూలు అతికిస్తే రస్టిక్‌ లుక్‌ వస్తుంది.

జనపనార తాడును ఉపయోగించి, అందమైన సన్నని అమ్మాయి, అబ్బాయి బొమ్మలను తయారు చేయవచ్చు.
లైట్‌ బాటిల్‌ ల్యాంప్స్‌

ఖాళీ బాటిల్‌లో ఫెయిరీ లైట్స్‌ పెట్టి నైట్‌ ల్యాంప్‌లా వాడుకోవచ్చు.

బొమ్మలుగా ఉండే సంగీత పరికరాలను అతికించి, షో పీసులుగా అమర్చవచ్చు. 
గ్లాస్‌ పేస్టింగ్‌ ఆర్ట్‌

బాటిల్‌కు కలర్‌ పేపర్, గ్లిటర్, స్టోరీస ... అతికిస్తే రిచ్‌ లుక్‌ వస్తుంది. అలంకరణలో ప్రత్యేకంగా ఉంటుంది.

పెయింట్‌తో పాటు పూసలు, అద్దాలు అతికించి మరింత అందంగా మార్చవచ్చు. 
ఫ్లవర్‌ వేజ్‌

పెద్ద పెద్ద గాజు బాటిళ్లను పెయింట్‌ చేసి, అందులో తాజా పువ్వులు లేదా ఆర్టిఫిషియల్‌ ఫ్లవర్స్‌తో అలంకరించి లివింగ్‌ రూమ్, సెంటర్‌ టేబుల్‌పై పెడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 
బాటిల్‌ డెకరేష  మనలోని సృజనాత్మకతను చూపించే ఒక అద్భుతమైన మార్గం. చిన్న బాటిల్‌ నుంచి పెద్ద బాటిల్‌ వరకు, ప్రతి ఒక్కదాన్ని కళాఖండంగా మార్చుకోవచ్చు.
ఎన్నార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement