
మనలోని పది రకాల దుర్గుణాలను నాశనం చేసి, విజయానికి గుర్తుగా దసరా వేడుకను జరుపుకుంటారు. మన జీవితాల్లోని ప్రతికూలతను నాశనం చేయడానికి, మంచితనాన్ని స్వీకరించడానికి ఆహ్వానించే రోజు. అంతటి ప్రత్యేకతలు గల రోజులలో ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి, మన ఇంటిని స్వర్గధామంగా మార్చే కొన్ని సులువైన దసరా అలంకరణలివి..
1. పూల తేరు
ఏ పండగలోనైనా అలంకరణలో ప్రధానంగా మన కళ్లకు కట్టేది పూల తోరణాలు. పూలనే తేరుగా చేసే బతుకమ్మ వేడుకలు కాబట్టి, ఇంట్లోనూ వివిధ రకాల పూల అమరిక వేడుక రోజులను హైలైట్ చేస్తుంది.
2. థీమ్ ప్రాజెక్ట్
దసరా రోజుల్లో మనకు ప్రధానంగా కనిపించేది అమ్మవారి అలంకరణ. ఎరుపు, పసుపు, పచ్చ రంగులు వచ్చేలా సృజనాత్మకతను దశ విధాల థీమ్ ప్రాజెక్ట్‌తో గృహాలంకరణను చేపట్టవచ్చు.
3. జత చేసిన రంగుల ఫ్యాబ్రిక్
కాటన్, సిల్క్, బాందినీ, గోటా పట్టీ.. ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన హ్యాంగింగ్స్, బీడ్స్, కర్టెన్స్.. వంటివి అలంకరణలో ఉపయోగించవచ్చు.
4. అద్దాలు
డైమండ్, స్క్వేర్, చిన్నా పెద్ద అద్దాలను అమర్చిన వాల్ హ్యాంగింగ్స్‌ను అలంకరించవచ్చు. అట్టముక్కలను కట్‌చేసి, రంగు కాగితాలను, అద్దాలను అతికించి, ఈ డిజైన్స్ ఏర్పాటు చేయవచ్చు.
5. ఫర్నిషింగ్
రాజస్థానీ, గుజరాతీ హస్తకళా వైభవాన్ని తలపించే ఫర్నిషింగ్ అంటే కుషన్ కవర్స్, టేబుల్ రన్నర్స్‌ను ఈ వేడుకకు సరైన కళను తీసుకువస్తాయి.
6. దాండియా కళ
నవరాత్రి రోజుల్లో దాండియా వేడుకను తలపించేలా ప్లెయిన్ వాల్‌పైన కాగితంతో దాండియా బొమ్మలు, వుడెన్ స్టిక్స్‌తో అలంకరించవచ్చు.
7. కార్నర్ కళ
లివింగ్‌రూమ్ లేదా డైనింగ్ హాల్‌లో ఒక కార్నర్ ప్లేస్‌ను ఎంపిక చేసుకొని, ఆ ప్రాంతాన్ని బొమ్మల కొలువు, దేవతామూర్తుల విగ్రహాలు, పువ్వులు, దీపాలతో అలంకరణను ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఇంటికి పండగ కళ ఇట్టే వస్తుంది.
8. ఇత్తడి, రాగి పాత్రలు
పండగ రోజుల్లో కుటుంబ వారసత్వంగా వచ్చిన ఇత్తడి, రాగి పాత్రలు, కలప వస్తువులను అలంకరణలో ఉపయోగించవచ్చు.
9. రంగోలీ మ్యాట్స్
పండగ రోజుల్లో ఇంటి ముందు, లోపల అందమైన రంగోలీని తీర్చిదిద్దడం చూస్తుంటాం. రంగోలీని తీర్చిదిద్దేంత సమయం లేదనుకునేవారు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన రంగోలీ మ్యాట్స్‌ను ఇంటి లోపల, గోడల పక్కన అలంకరించవచ్చు.
10. టెర్రకోట బొమ్మ లేదా ఇండోర్ ప్లాంట్స్
టెర్రకోటతో తయారైన అమ్మవారి తల ఉన్న బొమ్మలు తక్కువ ధరలో మార్కెట్లో లభిస్తాయి. వీటిని సెంటర్ టేబుల్ లేదా కార్నర్ టేబుల్‌పైన ఉంచి, పువ్వులను అలంకరించవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌తోనూ అలంకరణలో ప్రత్యేకత తీసుకు రావచ్చు.
ఎన్నార్
(చదవండి: ఈ బామ్మ రూటే వేరు..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్)