ఎంత పెద్దవారైనా బాల్యపు ఆనందాన్ని తిరిగి పొందాలనుకుంటారు. అది సాధ్యం కాదని నిరుత్సాహపడకుండా పెద్దవాళ్లు కూడా ఊయల ఎక్కి చిన్ననాటి ఆనందాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఇంటి అలంకరణలోనూ ప్రత్యేక ఆకర్షణగా మారిన మోడర్న్ ఉయ్యాలలు ఇంట్లో ఉండటం ఇప్పుడో ట్రెండ్‌గా మారింది.. జూలా లేదా స్వింగ్ అని పిలిచే ఊయలను ఇంట్లో అలంకరించి, ఆనందాన్ని పొందుదాం. ఊయల పెట్టేంత పెద్ద పెద్ద లోగిళ్లు ఈ రోజుల్లో సాధ్యం కాదని నిరుత్సాహం అక్కర్లేదు. చిన్న స్పేస్‌లో కూడా ఏర్పాటు చేసుకోదగిన మోడర్న్ ఊయలలు నేడు అందుబాటులో ఉన్నాయి.
ట్రెండ్ ఎందుకు పెరిగిందంటే...
చిన్న అపార్ట్‌మెంట్లు, బాల్కనీలు పెరిగిన నేపథ్యంలో ఇంట్లో ప్రశాంతంగా కూర్చోగలిగే అవకాశాన్ని ఒక ‘స్వింగ్’ సెటప్ అందిస్తుంది. మోడర్న్ ఫర్నిచర్‌తో కలిపి వుడ్ + మెటల్ చెయిన్ + కాటన్ మెటీరియల్‌తోనూ ఊయలలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాణ్యత, పరిమాణాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులు ఉన్నాయి. ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఇవి లభిస్తున్నాయి.
వీటి అమరికకు...
ఇంట్లో సర్దుబాటు స్థలం ఎంత ఉందో చూసుకోవాలి. స్థలాన్ని బట్టి ఊయల ఎంపిక చేసుకోవాలి. అటూ ఇటు తిరుగుతున్నప్పుడు తగలకుండా, ఒక కార్నర్ ప్లేస్ ఊయలకు కేటాయించడం మంచిది.
మెటల్ + వుడ్ కలిపి ఉండే ఊయల ఎంచుకున్నప్పుడు కుషన్లు, వాటి రంగుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
మ్యాక్రోమేడ్ హ్యాంగింగ్ స్వింగ్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది, లైట్ వెయిట్, మోడర్న్ బోహో లుక్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి.
టాయ్ స్వింగ్స్ ఇంటి అలంకరణకు మాత్రమే ఉపయోగించవచ్చు. వీటిని లివింగ్ లేదా డైనింగ్, కిడ్స్ రూమ్, బాల్కనీ కార్నర్ లలో ఉపయోగించవచ్చు.
సీలింగ్–మౌంటెడ్ రౌండ్ స్వింగ్ అంటే హాల్ లేదా బాల్కనీలో వీటిని వేలాడదీయవచ్చు. ఇది ఫ్యామిలీ కార్నర్‌గా మారిపోతుంది.
ఫోల్డబుల్ ఊయలను అవసరమైనప్పుడు మాత్రమే పెట్టి, తర్వాత తీసి, మడిచి జాగ్రత్త చేయవచ్చు. స్మార్ట్ అర్బన్ లివింగ్‌కి సరైన ఆప్షన్.
బాంబూ స్వింగ్స్ నేచురల్ లుక్‌లో కనిపిస్తాయి. ఇవి సస్టెయినబుల్ డెకర్‌లో ఒక భాగం.
వాల్–మౌంటెడ్ హ్యాంగింగ్ చెయిర్స్ చిన్న బెడ్‌రూమ్ లేదా స్టడీ కార్నర్‌లో కూడా సులభంగా ఫిట్ అవుతాయి.
డెకర్ టిప్స్
ఊయల చుట్టూ ఇండోర్ ప్లాంట్స్ పెడితే రిలాక్సింగ్ లుక్ వస్తుంది.
కుషన్‌లు, లైట్ బ్లాంకెట్స్‌తో కంఫర్ట్ టచ్ ఇవ్వచ్చు.
ఊయల కింద చిన్న రగ్ లేదా ఫ్లోర్ లాంప్ పెడితే మంచి లుక్ వస్తుంది.
ఎకో ఫ్రెండ్లీ టచ్‌తో పాత కుర్చీ ఫ్రేమ్‌ని రీయూజ్ చేసి ఊయలగా మార్చుకోవచ్చు. ‘సస్టైనబుల్ లివింగ్‘కి ఇది ఒక అందమైన ఉదాహరణ.
ఊయల అంటే ఒక జ్ఞాపకం. ఒక రిలాక్సేషన్ స్పాట్. మోడర్న్ హోమ్‌లలో ఇది ఇప్పుడు కేవలం సీటింగ్ ఆప్షన్ మాత్రమే కాదు, డిజైన్ స్టేట్‌మెంట్ కూడా.
(చదవండి: గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?)


