మోటార్ సైకిల్ అమ్మాయిలకు కాదు, భారతీయ రోడ్లు మహిళలకు అస్సలు సురక్షితం కాదనే భావన అందిరిలోనూ బలంగా ఉంది. అందువల్లే భారతీయ మహిళలు సోలో రైడ్‌లు చేయడం అత్యంత అరుదు. కానీ పిల్లల తల్లి, సైనిక నర్సింగ్ అధికారి ఆ మూసధోరణిని బద్ధలు గొట్టి స్త్రీలు కూడా సోల్ రైడ్‌లు చేయగలరని చూపించింది. మరింత మంది మహిళలు ఆ దారిలో ధైర్యంగా ముందుకువచ్చి నడిచేలా స్ఫూర్తిగా నిలిచింది.
ఆ సాహసవంతురాలే లెఫ్టినెంట్ కల్నల్ అంబిలీ సతీష్. ఆమె మిలటరీ నర్సింగ్ సర్వీసెస్ అధికారిగా ఆపరేషన్ థియేటర్‌లలో శస్త్ర చికిత్సలు చేస్తుండేది. అయితే ఆమెకు మోటార్ సైకిల్ అంటే మహాఇష్టం. ఎప్పటికైన నడపడం నేర్చుకోవాలనేది ఆమె ఆకాంక్ష.
వాళ్లనాన్న సైతం మోటార్ సైకిల్ ఆడవాళ్లకు కాదనే భావనకు బలంగా కట్టుబడి ఉండేవాడు. అయితే తనను ఎంతో ప్రేమగా చూసుకున్నప్పటికీ..ఈ విషయంలో వద్దనే వారించేవాడని చెప్పుకొచ్చింది. అయితే పెళ్లై, పిల్లలు పుట్టాక..ఆ కోరికను ఎందుకు నిజం చేసుకోవాలనిపించిందామెకు. ఆ నేపథ్యంలోనే తనకు బైక్ నడపడం నేర్పే గురువుని వెదకసాగింది.
స్నేహితురాలే గురువుగా..
ఎంఎన్‌సీ దళంలోకి అధికారిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించినప్పుడూ తన బ్యాచ్‌మేట్ ప్రియమైన స్నేహితురాలు లెఫ్టినెంట్ సరితా మువాల్‌నే తన గురువుగా నిర్ణయించుకుని తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆమె కారణంగానే తనకు రైడ్‌లపై మక్కువ పెరిగిందని చెప్పుకొచ్చింది. ఇతర క్రీడల్లోనే బైక్ మహిళలకు స్వేచ్ఛను ఇస్తుందంటోంది.
సరిత కేవలం ఐదు అడుగులు ఎత్తు మాత్రమే..అయినప్పటికీ ట్రక్కులతో సహా అన్ని రకాల వాహనాలను నడపగలదు. తాను మోటార్ సైకిల్‌ని నడపడం నేర్చుకున్న వెంటనే ఆమె తన వెనుక పిలియన్ రైడర్‌గా కూర్చోనేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చేంది. సాధారణంగా ఎవరైనా అందుకు భయపడతారు..కానీ ఆమెకు నా మీదున్న నమ్మకమే తనకు మరింత ధైర్యాన్నిచ్చిందంటోంది. అలా తామిద్దరం ఇసుక దిబ్బలలో రైడ్‌కి వెళ్లేవాళ్లం అని చెప్పుకొచ్చింది.
తన తొలి బైక్ సిసి బజాజ్ XCD మోటార్ సైకిల్‌పై రైడ్‌కి వెళ్లేది. అప్పుడే తన కాబోయే భర్త పూణేలోని అప్పటి గ్రూప్ కెప్టెన్ సి ఎన్ సతీష్‌ను ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్‌లో కలిసింది. అక్కడ నాగపూర్‌లో 1500 కి.మీ. 10 రోజుల ర్యాలీలో నలుగురు అంగ వైకల్య వ్యక్తుల బృదంతోపాటు మేజర్ అంబిలీ కూడా చేరారు.
నిజానికి ఆ ర్యాలీ శారీరకంగా దృఢం ఉండే వ్యక్తుల కంటే దివ్యాంగులు తక్కువ కాదని చెప్పేందుకు నిర్వహించినట్లు చెప్పుకొచ్చింది. అలా తమ బృందం బ్రేవ్‌హార్ట్స్' అనే సమూహాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చింది.
తమకు మార్గనిర్దేశిత రైడర్‌గా 1971 ఇండో పాక్ యుద్ధంలో విశిష్ట అనుభవజ్ఞురాలైన 75 ఏళ్ల వ్యక్తి ఉన్నారని అన్నారు. అతని ఆధ్వర్యంలోనే తాను తొలి సుదూరు రైడ్‌ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. బెంగళూరు నుంచి ఫిరోజ్‌పూర్ వరకు 2,700 కి.మీ రైడ్‌చేసింది. ఆ తర్వాత 2023, 2024 కార్గిల్ విజయ్ దివాస్‌ని స్మరించే సశక్తికరణ్ ర్యాలీలో పాల్గొందామె. అవన్నీ బృందంగా చేసిన రైడ్‌లు. ఇక ఇటీవలే..12 జ్యోతిర్లింగాలకు (శివుని పవిత్ర పుణ్యక్షేత్రాలు) 8,800 కి.మీ మాత్రం సోలోగా బైక్ రైడ్ చేసి అరుదైన ఘనతను సృష్టించింది.
అంతేగాదు ఈ విజయం మహిళలకు భారతీయ రోడ్లు సురక్షితం కాదు అను నమ్మకాన్ని ఒమ్ము చేసేందుకు దోహదపడిందని సగర్వంగా చెప్పుకొచ్చింది. అంతేగాదు తాను ఈ అసాధారణ విజయాన్ని తన కుటుంబం, స్నేహితుల మద్దతు వల్లే సాధించగలిగానని తెలిపింది. అంతేగాదు స్త్రీలు ఏదైనా సాధించగలరని ప్రూవ్ చేసింది అంబిలీ సతీష్.
(చదవండి: పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నందిని చక్రవర్తి..! ఏడుగురు సీనియర్ అధికారులను..)


