‘ఎగ్‌’సలెంట్‌ లుక్‌ కోసం! | Beauty tips: Egg white face mask: Benefits and how to make one | Sakshi
Sakshi News home page

‘ఎగ్‌’సలెంట్‌ లుక్‌, గోళ్ల ఆరోగ్యం కోసం!

Nov 30 2025 4:25 PM | Updated on Nov 30 2025 4:25 PM

Beauty tips: Egg white face mask: Benefits and how to make one

నిజానికి గోళ్లలో చేరే ఫంగస్‌ను గోరంత సమస్య అనుకుంటే పొరబాటే! అందం, ఆరోగ్యం ఇలా రెండింటిపైనా ప్రభావం చూపించే ఈ సమస్య పూర్తిగా తగ్గాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు! పైనంతా పుచ్చిపోయి, లోపలికంటా పుండుపడిపోయి, ఇబ్బందిగా మారిన గోళ్లు తిరిగి మునుపటి రూపంలోకి రావాలంటే, ఈ అధునాతన పరికరం ఇంట్లో ఉండాల్సిందే!

‘ఫంగబీమ్‌’ అనే ఈ డివైస్‌ తక్కువ–స్థాయి లేజర్‌ థెరపీని అందిస్తుంది. డ్యూయల్‌–వేవ్‌లెంగ్త్‌ లేజర్‌ టెక్నాలజీని ఉపయోగించడం ఈ గాడ్జెట్‌ ప్రత్యేకత. దీనిలో 905 నానోమీటర్ల ఇన్‌ఫ్రారెడ్‌ లైట్, 470 నానోమీటర్ల బ్లూ లైట్‌– ఇలా రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. మొదటిది గోరు అడుగు భాగానికి లోతుగా చొచ్చుకుపోయి, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ మూలాన్ని లక్ష్యంగా చేసుకునేలా పని చేస్తుంది. రెండవది ఉపరితల స్థాయిలో పరిశుభ్రతను పెంచడానికి, గోరు రూపాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ రెండు లైట్‌ థెరపీలు– ఎటువంటి మందులు, రసాయనాలు లేకుండా, నొప్పిలేకుండా ఫంగస్‌ నిర్మూలనకు సహాయపడతాయి.

ఈ పరికరం ప్రధానంగా వినియోగదారులకు చక్కటి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్‌గా పని చేస్తుంది, ఎలాంటి సెట్టింగులు అవసరం లేదు. ఒక్కో గోరుకు కేవలం 7 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ ట్రీట్‌మెంట్‌లో ఎటువంటి నొప్పి ఉండదు. దీనితో ఇంట్లో లేదా ప్రయాణంలో ఈజీగా చికిత్స చేసుకోవచ్చు. ఈ డివైస్‌ క్రమం తప్పకుండా వాడటం వలన గోరు రంగు చక్కగా మారుతుంది. గోరు మందం పెరిగి, ఆరోగ్యంగా కనబడుతుంది. ఈజీ చికిత్సను కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.

‘ఎగ్‌’సలెంట్‌ లుక్‌!
సాధారణంగా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గాలంటే ఎగ్‌ వైట్స్‌ వాడమంటున్నారు నిపుణులు. ఓ కప్పులోకి ఎగ్‌ వైట్‌ తీసుకుని బాగా మిక్స్‌ చేయాలి. దానిలో కలబంద గుజ్జు కొద్దిగా, పంచదార పొడి కొద్దిగా వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించుకోవాలి. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. 

ఎగ్‌ వైట్స్‌లో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చుతుంది. మృదువుగా మచ్చలు లేకుండా చేస్తుంది. అయితే 20 నిమిషాల పాటు ఉంచుకున్న తరవాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది. 

(చదవండి: అతిపెద్ద ఆలయం ఎక్కడ ఉందంటే..! మన ఇండియాలో మాత్రం కాదు..)

Advertisement
 
Advertisement
Advertisement