ముంబై: మహారాష్ట్రల్లో కోడి గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. అటు శీతాకాలం, గుడ్ల మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో గుడ్ల ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరాయి. ఛత్రపతి శంభాజీనగర్‌లో గుడ్ల హోల్‌సేల్ ధరలు ఒక్కింటికి దాదాపు రూ. 8 చొప్పున పలుకుతోంది. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ ధరలు మాత్రం హైలో ఉన్నాయని టోకు వ్యాపారులు తెలిపారు. దీని ప్రభావం ఉభయ తెలుగురాష్ట్రాల్లో కూడా ఉంటుందని మార్కెట్ నిపుణులు, వ్యాపారులు చెప్పారు.
శీతాకాలంలో గుడ్ల డిమాండ్ మహారాష్ట్రలో రోజుకు సుమారు మూడు కోట్లు ఉంటుందని అధికారులు , తాజా లోటుతో కారణంగా రోజుకు 1.5 కోట్ల కొరత ఉంటుందని అంచనా. కోళ్లలో వ్యాధుల వ్యాప్తి గుడ్ల ఉత్పత్తిని దెబ్బతీసిందని వ్యాపారులు చెప్పారు. వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రధాన సరఫరా కేంద్రాలలో పక్షి సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందడం వల్ల లోటు ఏర్పడిందని పశుసంవర్ధక శాఖ అదనపు కమిషనర్ శీతల్‌కుమార్ ముకానే అన్నారు.
చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!
వ్యాధులు ప్రబలినప్పటికీ, ఏపీ, తమిళనాడులోని పౌల్ట్రీ యజమానులు కోళ్లను మార్చలేదనీ, ఇది ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అలాగే చలి వాతావరణం సహజంగానే గుడ్ల వినియోగం , డిమాండ్‌ను పెంచుతుందని కూడా ఆయన చెప్పారు. అయితే ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి, ముఖ్యంగా తమిళనాడు నుండి గుడ్ల దిగుమతి గణనీయంగా పెరిగిందని ముకానే చెప్పారు. పౌల్ట్రీ ఫీడ్‌లో కీలకమైన మొక్కజొన్న ధర తగ్గిన కారణంగా, ప్రస్తుత మార్కెట్ ఉత్పత్తిదారులకు అనుకూలమని పౌల్ట్రీ వ్యాపారవేత్త ఫిరోజ్ పింజారి అన్నారు.
చదవండి: ఉదయపూర్‌లో బిలియనీర్ కుమార్తె పెళ్లి : జూ. ట్రంప్ స్పెషల్ గెస్ట్
గత సంవత్సరం ఇదే రోజున నమోదైన రూ. 6.10 6.30 వరకు ఉన్న గుడ్డు ప్రస్తుత హోల్‌సేల్ రేటు గణనీయంగా పెరిగింది. మారుతున్న వినియోగదారుల అలవాట్లు, గుడ్లలో లభించే అధిక పోషక విలువలు, కల్తీ తక్కువ లాంటి అంశాలు డిమాండ్ పెరగడానికి కారణమని వసంతరావు నాయక్ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పౌల్ట్రీ నిపుణురాలు అనితా జింతర్కర్ పేర్కొన్నారు. పౌల్ట్రీ ఉత్పత్తులకు మంచి రేటు లభించడం సానుకూల పరిణామన్నారు.


