కార్పొరేట్ ఐటీ, కంపెనీల్లో ఉద్యోగాల కోత, ఉద్యోగుల కష్టాల గురించి చాలా కథనాలు విన్నాం. ఉన్నట్టుండి ఉపాధిని కోల్పోతే, వారికి ఉండే అనేక రకాలైన కమిట్‌మెంట్లు, ఈఎంఐలు, స్కూలు ఫీజులు లాంటి అవసరాలకోసం ఎన్నో ఇబ్బదులు పడాల్సి వస్తుంది. సాధ్యమైనంత త్వరగా మరో ఉద్యోగం రాకపోతే ఈ కష్టాలకకు తోడు మానసిక ఒత్తిడి, ఆందోళన మరింత పెరుగుతుంది. ఈ క్షోభ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలా ఒక IIT నుండి తొలగించబడిన ఒక ఇండియన్ మేనేజర్ గాథ నెట్టింట పలువురి కంట తడి పెట్టిస్తోంది.
Nifty50 కంపెనీలో పనిచేసే మేనేజర్ ఏడు నెలల క్రితం ఉద్యోగాన్ని కోల్పోయాడు. 18 ఏళ్ల సర్వీసు ఏడాదికి, రూ. 70 లక్షల జీతం. దీంతో గత ఏడు నెలల కాలంగా తాను అనుభవిస్తున్నవెతలపై కలత పెట్టు కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒకపుడు టీంలీడర్‌గా ఉన్నా అతనికిపుడు పైసా ఆదాయం లేదు. కొత్త ఉద్యోగం దొరకడంలేదు. దాచుకున్న డబ్బంతా కరిగిపోయింది. రెండు నెలలు దాటితే జీవనం చాలా కష్టం అంటూ రెడ్డిట్ పోస్ట్‌లో తన గోడును వెళ్లబోసుకున్నారు.
లింక్డ్ఇన్, నౌక్రీ, రిఫరెన్స్‌లు,కన్సల్టెంట్‌లు అన్ని ప్రయత్నాలు అయ్యాయి. కానీ ఫలితం లేదు. మరిన్ని అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ప్రీమియం సేవలను కూడా తీసుకున్నాను. దురదృష్టవశాత్తు ఎలాంటి కాల్స్ కూడా రావడం లేదు. గత ఏడు నెలల్లో రెండు ఇంటర్వ్యూలు మాత్రమే వచ్చాయని టెక్కీ రాసుకొచ్చాడు. స్నేహితులు కూడా పెద్దగా సాయం చేయడం లేదని. పెద్దగా అప్షన్స్ లేవు కదా, తక్కువ జీతమే అయినా తనకి అవకాశాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిరాశగా ఉందంటూ వాపోవడంతో నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితి బాగాలేదంటూ వ్యాఖ్యానించారు. ఇండియా ఐటీ నిపుణులకు గడ్డుకాలం అని కొందరంటే, ఇండియాలో సీనియర్లకు జాబ్ రావడం అంటే ఛాలెంజ్‌గా మారిపోయిందనే అభిప్రాయాల్ని వ్యక్తం చశారు.
ఇదీ చదవండి: 40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్‌ఆర్‌ఐకి అరుదైన గౌరవం!


