విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఆ ప్రయాణం గమ్యం చేరుతుందా అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా కనిపిస్తున్నాయి. బస్సు ఎక్కితే సీట్ల కోసం తగాదాలు, దిగితే తోపులాటలే కనిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తుంటే, అసలు బస్సు ఎక్కడం కూడా మహిళలకు ఒక ‘గగన యాత్ర’లా మారిందనిపిస్తోంది. సంక్రాంతి పండగ హడావుడి మొదలైంది.
జగదాంబ సెంటర్ నుంచి పూర్ణామార్కెట్ వరకు ఇసుక వేస్తే రాలనంత జనసంచారం. షాపింగ్‌లు, పనుల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సంచులతో నిలబడి ఉన్నా ఆ సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు కనీసం అపలేదు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు కల్పించింది ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందో ఆర్థమవుతోందని విమర్శలు వెల్లువెత్తాయి.


