అప్పన్న ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనులకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

అప్పన్న ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనులకు శ్రీకారం

Mar 15 2026 1:31 AM | Updated on Mar 15 2026 1:31 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. దేవస్థానం ఈవో జె. వెంకటరావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ధ్వజస్తంభానికి సుమారు రూ.1.8 కోట్ల వ్యయంతో సీఎంఆర్‌ సంస్థ స్వర్ణతాపడం చేయించింది. ప్రస్తుతం అదే సంస్థ ధ్వజస్తంభం అడుగుభాగంలో ఉన్న పీఠానికి కూడా స్వర్ణతాపడం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పీఠానికి ఎంత మేర బంగారు తాపడం అవసరమవుతుందో తెలుసుకునేందుకు అధికారులు కొలతలు తీసుకునే పనులను ప్రారంభించారు. పనులు పూర్తయిన తర్వాత ధ్వజస్తంభం పీఠం మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement