వావ్‌ అథ్లెట్స్‌కు సీపీ సత్కారం | - | Sakshi
Sakshi News home page

వావ్‌ అథ్లెట్స్‌కు సీపీ సత్కారం

Mar 15 2026 1:31 AM | Updated on Mar 15 2026 1:31 AM

విశాఖ సిటీ: జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించిన వెటరన్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ విశాఖపట్నం(వావ్‌) అథ్లెట్లకు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ఘనంగా సన్మానించారు. ఇటీవల జగల్పూర్‌, మధ్యప్రదేశ్‌లో జరిగిన నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోను, థాయ్‌లాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌–2026లో వావ్‌ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించారు. శనివారం నగరంలో ఒక హోటల్‌లో జరిగిన వీరి సన్మాన కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా అథ్లెట్లకు సీపీ శాలువాలు వేసి జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెటరన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత ఉత్సాహంతో జీవితాన్ని గడపగలరని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న వాట్‌ చైర్మన్‌, వావ్‌ చీఫ్‌ పేటర్న్‌ డా.కమల్‌ బయద్‌ మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ ద్వారా ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రస్టీలు నండూరి రామకృష్ణ, సి.హెచ్‌.శ్రీనివాసరాజు, ఇండియా టీం మేనేజర్‌, ఇండియా మాస్టర్స్‌ సెక్రటరీ జనరల్‌ డా.మంగవరప్రసాద్‌, వావ్‌ కార్యదర్శి ఎల్‌.వి.సుధాకర్‌, కోశాధికారి కె.రామారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement