ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసి, అతడి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా.. వారి కుమారుడిని నగ్నంగా నిల్చోబెట్టి వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన జనవరి రెండో తేదీన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో రాజేష్ గార్గ్ అనే వ్యక్తి తన ఇంటి బేస్‌మెంట్‌పై జిమ్ నిర్వహిస్తున్నాడు. జిమ్ బాధ్యతను సతీష్ యాదవ్ అనే వ్యక్తి చూసుకుంటున్నాడు. అయితే, సదరు జిమ్ హక్కుల విషయంలో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో రాజేష్, అతడి భార్య.. సతీష్‌పై ఆరోపణలు చేశారు. సతీష్ యాదవ్ తమను మోసం చేశారని, తమ ఆస్తిని స్వాధీనం చేసకున్నాడని ఆరోపించారు. దీని గురించి ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు.
A youth was allegedly assaulted, stripped naked and dragged away by neighbours in Delhi’s Laxmi Nagar area. Recounting the incident, his mother, Reeta Garg, said the attack began when she and her husband were standing outside their own property.
She alleged that Shubham Yadav… pic.twitter.com/w6mKdpXM3E— IndiaToday (@IndiaToday) January 5, 2026
అనంతరం, విషయం పెద్దది కావడంతో సతీష్ ఆగ్రహంతో రగిలిపోయాడు. జిమ్‌పై తమ హక్కు గురించి ప్రశ్నించినందుకు దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండో తేదీన సతీష్ యాదవ్ మరో ముగ్గురితో కలిసి వచ్చి.. రాజేష్ కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. రాజేష్‌పై దాడి చేసిన దుండగులు.. అతడి భార్య జుట్టుపట్టుకుని లాగి, దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఇది గమనించిన తమ కొడుకు అక్కడికి రాగా.. అతడిపై కూడా దాడి చేసి, కొంతదూరం తీసుకెళ్లి దుస్తులు విప్పించారు. వీధిలోకి లాక్కెళ్లి ఇనుప రాడుతో దాడి చేయగా, తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటనలో గార్గ్ తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు సతీష్ యాదవ్‌ను అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు వికాస్ యాదవ్, శుభం యాదవ్, ఓంకార్ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


