అత్త పోరు.. మహిళా టెక్కీ ఆత్మహత్య | 35-year-old software engineer Ends Life | Sakshi
Sakshi News home page

అత్త పోరు.. మహిళా టెక్కీ ఆత్మహత్య

Mar 5 2026 8:27 AM | Updated on Mar 5 2026 12:17 PM

35-year-old software engineer Ends Life

యశవంతపుర(కర్ణాటక): మంచి ఉద్యోగం, దండిగా జీతం.. కానీ కుటుంబ కలహాలతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు అబ్బిగెరెలో జరిగింది. అత్త వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన సుష్మ (35) డెల్‌ సంస్థలో ఐటీ ఇంజనీరు, ఐదేళ్ల క్రితం పునీత్‌కుమార్‌తో పెళ్లి కాగా, 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. 

ఇంటిలో చిన్నచిన్న విషయాలపై అత్త కల్పనతో సుష్మకు గొడవలు జరిగేవి. మంగళవారం అత్తతో పోట్లాట జరిగింది. దీంతో ఆవేదన చెందిన సుష్మ ఇంటిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. అత్త, భర్త వేధింపుల వల్లనే తమ కూతురు చనిపోయిందని, అదనపు కట్నం తేవాలని సతాయించేవారని సుష్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, సోలదేవనహళ్లి పోలీసులు విచారణ చేపట్టారు.     

Advertisement
 
Advertisement
Advertisement