స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు.. 20 మంది అరెస్ట్ | KPHB Police arrested 20 Members at Spa Centres | Sakshi
Sakshi News home page

Spa Centres: స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు.. 20 మంది అరెస్ట్

Mar 4 2026 1:35 AM | Updated on Mar 4 2026 12:32 PM

KPHB Police arrested 20 Members at Spa Centres

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రెండు స్పా సెంటర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

పక్కా సమాచారంతో చేపట్టిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఎస్సై పేర్కొన్నారు.  నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో అరెస్టైన 20 మందిని  పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement