Hyderabad News
-
గూగుల్‌లో చూసి.. సంతకాలు ఫోర్జరీ చేసి..
మంత్రులు, జడ్జిల పేర్లతో క్రికెట్ అసోసియేషన్లకు టోకరా ఉప్పల్: మంత్రులు, న్యాయమూర్తుల పేరును వాడుకుంటూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లను సంపాదించడంతో పాటు ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్న ముఠా గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకొని అధికారులను మోసగించిన తీరు విస్తుగొలుపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. ఈ నెల 3న ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు స్టేడియం పార్కింగ్ వద్ద టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. ఉప్పల్ ఎస్ఐ మాధవరెడ్డి బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పదంగా తచ్చాడుతున్న మహీంద్రా థార్ వాహనాన్ని తనిఖీ చేసింది. అందులో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది. అత్యున్నత స్థాయి వ్యక్తుల సంతకాలు ఫోర్జరీ కేవలం బ్లాక్‌లో టికెట్లు అమ్మడం మాత్రమే కాకుండా, ఈ ముఠా పెద్ద స్కెచ్ వేసింది. గూగుల్ నుండి న్యాయమూర్తలు, మంత్రులు, గవర్నర్ల అధికారిక లెటర్ హెడ్లను డౌన్న్ లోడ్ చేసేవారు. వాటిపై సంబంధిత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు సమర్పించేవారు. అలా వీవీఐపీల కోటాలో ఖరీదైన ’కాంప్లిమెంటరీ’ టికెట్లను పొంది, ఆ తర్వాత వాటిని అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా పట్టుబడ్డారు. చైన్నె ప్రాంతానికి చెందిన ముగ్గురి సహకారంతో వీరు టికెట్లను సంపాదించే వారు. ఈ సీజన్లో ఉప్పల్‌లో రెండు మ్యాచ్‌లకు, బెంగుళూరులో రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను పోందారు. ఉప్పల్‌కు వచ్చే సరికి ఒకసారి టికెట్‌ను ఇచ్చిన హెచ్‌సీఏ అధికారులు రెండవ సారికూడా టికెట్లను అందజేసి చివరకు అనుమానం రావడంతో ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన గట్టమనేని అశోక్(20) రియల్ ఎస్టేట్ వ్యాపారి, కంకనాల దినేష్(25)పార్టీల జెండాలను తయారు చేసే వ్యాపారం, సింగమనేని వేణుమాధవ్(26)ప్రైవేట్ ఉద్యోగి. ఈ ముగ్గురూ ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం పల్కూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చైన్నెకి చెందిన మరో ముగ్గురు నిందితులు ఆశిష్, సెంథిల్, తాన్సిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ. 22 వేల విలువ గల 5 టికెట్లు, మహీంద్రా థార్ వాహనం. 5 మొబైల్ ఫోన్లు, 5 ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ టికెట్లు పొంది బ్లాక్‌లో విక్రయం ఉప్పల్ స్టేడియం వద్ద ముగ్గురు నిందితుల అరెస్ట్ -
బాలల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి
మణికొండ: బాలలంతా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునే భరోసా ఇవ్వాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, పోలీస్ కమిషనర్ ఎం.రమేష్‌లు అన్నారు. నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంప్‌లో వలస కార్మికుల పిల్లల కొరకు వర్క్ సైట్ స్కూల్‌ను వారు ప్రారంభించారు. నాణ్యమైన విద్యతో వారికి మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని, ఇది దేశంలోనే మొదటి పాఠశాల అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికుల శ్రమ ఎంతో ఉందని, వారి పిల్లల భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, రాజపుష్ప ఫౌండేషన్ ప్రతినిధి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో నయవంచన
● సంపన్న యువతులే లక్ష్యంగా మోసాలు ● పోక్సో నిందితుడిని స్వయంగా విచారించిన సీపీ బంజారాహిల్స్: సంపన్న యువతులే లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి వ్యాపారం పేరిట లక్షల రూపాయలు వసూలు చేసిన చీటర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీ నిమిత్తం తీసుకువచ్చారు. సోమవారం నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా నిందితుడిని విచారణ చేశారు. కూకట్‌పల్లిలో నివసిస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్లో పని చేస్తున్న కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (22) ఇన్‌స్ట్రాగామ్‌లో ఖరీదైన కార్లలో తిరుగుతున్నట్లు క్లబ్‌లు, పబ్‌ల్లో మద్యం తాగుతున్నట్లు ఫొటోలు పెడుతూ యువతులను ఆకర్షించేవాడు. ఈ క్రమంలో వెంకటగిరికి చెందిన ఓ బాలిక చంద్రశేఖర్ ఉచ్చులో పడింది. స్టార్టప్ పేరుతో ఆమె నుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాయ మాటలతో యువతులను ఆకర్షిస్తూ చాలా మందిని మోసం చేసినట్లుగా విచారణలో తేలడంతో సోమవారం స్వయంగా సీపీ సజ్జనార్ ఇక్కడికి విచ్చేసి నిందితుడితో మాట్లాడారు. ఎంత మందిని మోసం చేసిన విషయాన్ని కూడా ఆరా తీశారు. సుమారు గంట పాటు సీపీ సజ్జనార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుపై దృష్టిసారించారు. కస్టడీ అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చంద్రశేఖర్ తల్లి మీనాకుమారితో పాటు మేన మామను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. -
హైదరాబాద్
చెత్త ఏరుకునేవారిలాగ వచ్చి.. చీరల చోరీ బంజారాహిల్స్: చెత్త సేకరించే మహిళలు లాగా భుజాలపై సంచులు వేసుకుని వచ్చిన నలుగురు మహిళలు ఓ చీరల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహ్నుమా నవాబ్సాబ్ కుంటకు చెందిన ఎండీ సాదిక్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లో చీరల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు మహిళలు భుజాలపై చెత్తను ఏరుకునే సంచులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ చీరల దుకాణం వద్దకు వచ్చి చెత్త ఏరుతున్నట్లు నటిస్తూ షోరూం తాళాలు పగులగొట్టారు. లోనికి వెళ్లి రూ.2 లక్షల ఖరీదైన చీరలను మూటగట్టుకుని మెల్లగా జారుకున్నారు. సోమవారం ఉదయం షాపు తెరవడానికి వచ్చిన సాదిక్ తాళాలు పగులగొట్టి ఉండడం గమనించాడు. లోపల దుస్తులన్నీ చిందరవందరగా పడి ఉండడం అనుమానం వచ్చింది. చాలామంది చీరలను వర్క్ పనుల కోసం ఆయనకు ఇస్తుంటారు. వాటిని కూడా చోరీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా నలుగురు మహిళలు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు తేలింది. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నరు. -
ఆక్సిజన్ సిలిండర్ల గోదాంలో పేలుడు
నలుగురికి గాయాలు.. పగిలిన ఇళ్ల అద్దాలు, పహాడీషరీఫ్: రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆక్సిజన్ సిలిండర్ల గోదాంలో పేలుడు సంభవించింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి వివరాల ప్రకారం.. జల్పల్లి బాబాకాంట సమీపంలో అబ్దుల్ కరీం, అబ్దుల్ గౌస్, షేక్ మహ్మద్ రిజ్వాన్ అహ్మద్‌లు లైఫ్ కేర్ మెడికల్, ఇండస్ట్రియల్ ఎయిర్ ప్రొడక్ట్స్ పేరుతో ఆక్సిజన్ సిలిండర్ల గోదాం నిర్వహిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా కర్నూలు, పటాన్చెరు నుంచి భారీ కంటైనర్లను తీసుకువచ్చి, చిన్న కంటైనర్లు, అందులోంచి సిలిండర్లలోకి నింపి ఆస్పత్రులు, పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ కంటైనర్ నుంచి గ్యాస్ లీకై , భారీ శబ్దంతో పేలింది. ఈ ప్రభావంతో మరో కంటైనర్ నుంచి వాయువు విరజిమ్మింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ప్రహరీ కూలి డీసీఎం, పది బైక్‌లు ధ్వంసమయ్యాయి. గోదాం కప్పు దెబ్బతిన్నది. ఇళ్ల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. కంపెనీ ఆపరేటర్ బృందావన్ దాస్, పక్క షెడ్లోని కార్మికులు తౌఫిక్, సయ్యద్ ఖలీం గాయపడ్డారు. వీరిని మైలార్‌దేవ్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రేపటి నుంచి యువ నాటకోత్సవాలు
గన్‌ఫౌండ్రీ: నాటక రంగం వైపు యువతను ప్రోత్సహించేందుకు బుధవారం నుంచి మూడు రోజుల పాటు రవీంద్రభారతిలో యువ నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలోని అకాడమీ కార్యాలయంలో యువ నాటకోత్సవాల బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 6న డింభక రాజ్యం వీధి, సిరిసిరి మువ్వ కల్చరల్ సంస్థ కళాకారులు గేమ్ సామాజిక నాటకం, నవ క్రాంతి కల్చరల్ అసోసియేషన్ కళాకారులు శ్రీ మహిషాసుర మర్దిని పద్య నాటకాలను ప్రదర్శిస్తారని వెల్లడించారు. 7న నిషాహి నిషి వీధి నాటకం, స్వప్నం రాల్చిన అమృతం, స్వామియే శరణం అయ్యప్ప పద్య నాటకాలను ప్రదర్శిస్తారని తెలిపారు. 8న మాయాజాలం డాట్ కామ్, అమ్మ చెక్కిన బొమ్మ, యయాతి అనే పద్య నాటక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. మూడు రోజుల పాటు సాయంత్రం వేళల్లో ప్రదర్శించనున్న నాటకోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
శిల్పారామంలోసమ్మర్ ఆర్ట్ క్యాంప్
● ఈనెల 22 వరకు శిబిరం మాదాపూర్: మాదాపూర్‌లోని శిల్పారామంలో సోమవారం సమ్మర్ ఆర్ట్ క్యాంపును ప్రారంభించారు. పాటరీ, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్,ఆక్రలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాప్ట్, వాటర్ కలర్స్, క్లే టాయ్స్, లిప్పన్ ఆర్ట్ తదితర అంశాలలో చిన్నారులకు, పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచి ఇటువంటి సాంప్రదాయ పెయిటింగ్స్లో శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. వివరాలకు 8886652030, 8886652004 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
ప్రజావాణిలో 55 ఫిర్యాదులు
లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు 36 వినతిపత్రాలు అందజేశారు. జోన్ వారీగా అందిన ఫిర్యాదుల్లో శంషాబాద్ జోన్లో 2, రాజేంద్రనగర్ జోన్లో 6, చార్మినార్ జోన్లో 3, ఖైరతాబాద్ జోన్లో 2, సికింద్రాబాద్ జోన్లో 6 ఫిర్యాదులు అందాయి. మొత్తం 55 ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమంలో అందినట్లు అధికారులు తెలిపారు. రాంగోపాల్పెట్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 10న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభా వేదిక వద్ద సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంచార్జి అభయ్ పాటిల్ పాల్గొన్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని, సభకు 2 లక్షలమందిపైగా హాజరవుతారని రాంచందర్‌రావు తెలిపారు. -
జడ్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ చాంబర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో ల్యాప్ టాప్‌తో పాటు ఫర్నిచర్ దగ్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం. సెలవు దినం కావడంతో కార్యాయలంలో ఎవరు లేరు. హై వోల్టేజీతో రివర్స్ విద్యుత్ సరఫరా కావడంతో ఈఈ చాంబర్ పక్కనే ఉన్న కేబుల్స్ కాలిపోయాయి. అక్కడి నుంచి రెండో అంతస్తులో జడ్సీ చాంబర్లో మంటలు చెలరేగాయి. ల్యాప్ టాప్, ఫర్నీచర్, విద్యుత్ లైట్లు, ఫ్లోర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో జడ్సీ అమిత్ కాన్ఫరెన్స్ హల్లోనే సోమవారం విధులు నిర్వహించారు.ఇదిలా ఉండగా హై వోల్టేజీ కారణంగా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలోను కేబుల్స్ కాలిపోయినట్లు తహసిల్దార్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎంఈఓ కార్యాలయం బయట కూడా కొన్ని విద్యుత్ వైర్లు కాలిపోయాయయి. -
జీఓ నెం.7 రద్దు చేయాలి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాంపల్లి: జీఓ నెం.7ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు జిఓను తీసుకువచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్పష్టత లేని జిఓను వెంటనే రద్దు చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం రాత్రి గన్‌పార్కు ఎదుట విద్యార్థులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాకు తెలంగాణ వస్తే మంచి చదువులు వస్తాయని, మా బతుకులు ఎంతో బాగుపడుతాయని ఆశిస్తే విద్యార్థులకు చదువులే లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తాత్సరం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నరసింహా నాయక్, విద్యార్థి నేతలు సానియా, అంకిత, వైష్ణవి, సాయి, అర్చన, రమ్య, అశ్విని, కీర్తి, అక్షయ పాల్గొన్నారు. -
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సాక్షి, సిటీబ్యూరో: వేసవి డిమాండ్ దృష్ట్యా రైళ్ల నిర్వహణ, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సదుపాయాలు, భద్రతపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వడగాలుల దృష్ట్యా రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలపై జీఎం దిశానిర్దేశం చేశారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ట్రాక్‌లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన మేరకు ట్రాక్‌లను కంకరతో నింపాలని సూచించారు. వేడి వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు వేసవి జాగ్రత్తల ప్రాముఖ్యతపై ట్రాక్ పెట్రోల్ సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. రైళ్లలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా నివారించడానికి నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్‌ను సమీక్షించారు. ప్రైవేట్ సైడింగ్‌లు, గూడ్స్ షెడ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ ప్రవేశాలకు ఆవకాశం ఉన్న కొన్ని ప్రదేశాలలో ట్రాక్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. -
వడదెబ్బతో గుర్తు తెలియనివ్యక్తి మృతి
విజయనగర్‌కాలనీ: ఎండ వేడిమికి తాళలేక ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సఘటన సోమవారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిమల్కాపూర్ విజయశ్రీ అపార్టుమెంట్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) స్పృహ లేకుండా పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే అతడు మృతిచెంది ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఒకపూట చిరుధాన్యాల ఆహారంతో ఆరోగ్యం
రాజేంద్రనగర్: రోజూ ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీ హబ్ సహకారంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో సోమవారం రాజేంద్రనగర్ ఐఐఎంఆర్‌లో ‘‘రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం’’ జాతీయ మిషన్‌కు వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ తాను చిరుధాన్యాల అహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని తగ్గించుకోగలిగానన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి మాట్లాడుతూ, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం మంచిదన్నారు. -
విమానాలు.. సాంకేతిక చిక్కులు
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి కన్నూర్ బయల్దేరిన ఇండిగో విమానం వెనక్కి వచ్చింది. ఆదివారం 76 మందితో ప్రయాణమైన 6ఈ–7225 విమానంలో కొన్ని నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించారు. పైలట్ తిరిగి తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయంగా మరో విమానం ఏర్పాటు చేసింది. అలాగే.. 180 మందితో బెంగళూరు బయల్దేరిన ఐఎక్స్–1345 విమానంలోనూ సాంకేతిక సమస్యను గుర్తించి రద్దు చేశారు. ప్రయాణికులను మరో విమానంలో పంపారు. హైదరాబాద్ నంచి జల్గావ్ వెళ్లాల్సిన విమానంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. -
ఆర్టీఏలో పైరవీల జోరు
మెసేజ్‌లకే పరిమితమైన ‘సిలిండర్’ బుకింగ్ తర్వాత 15 రోజులు ఎదురుచూపులు కిలో లెక్కన.. ఆకాశమే హద్దు! డొమెస్టిక్,కమర్షియల్ గ్యాస్ ధరలను కిలోల లెక్కన బేరీజు వేస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గృహ వినియోగ గ్యాస్ కిలో ధర సుమారు రూ. 66.55 పైసలు పలుకుతుండగా, వాణిజ్య గ్యాస్ కిలో ధర సుమారు రూ. 174.47 అంటే, వాణిజ్య గ్యాస్ ధర గృహ వినియోగ ధర కంటే దాదాపు 2.6 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ భారీ లాభాల కోసమే కంపెనీలు కమర్షియల్ ఆర్డర్లకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా డొమెస్టిక్ రీఫిల్స్ లోడ్ సరిగా రావడం లేదని గ్యాస్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. సాక్షి, సిటీబ్యూరో మహా నగరంలో వంటగ్యాస్ పంపిణీ వ్యవస్థ పడకేసింది. చమురు సంస్థల నిర్లక్ష్యం, డీలర్ల ధనదాహం వెరసి సామాన్యుడి వంటింట్లో ‘గ్యాస్’ మంటలు రేపుతోంది. రీఫిల్ బుక్ చేస్తే మూడు, నాలుగు రోజుల్లో వస్తుందని ఊదరగొడుతున్న చమురు సంస్థలు ఆచరణలో మాత్రం వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బుకింగ్‌కూ బుకింగ్‌కూ మధ్య గడువు పెంచిన సంస్థలు, తీరా బుక్ చేశాక 15 రోజులు గడిచినా సిలిండర్‌ను గడప దాటించకపోవడం పంపిణీ వైఫల్యానికి పరాకాష్టగా మారింది. ఫోన్లకు వచ్చే సంక్షిప్త సమాచారాలు (ఎస్ఎంఎస్) తేదీల మార్పుతో కాలక్షేపం చేస్తుంటే, అటు డీలర్లు స్టాక్ లేదంటూ కాలయాపన చేయడంతో గ్యాస్ కోసం సామాన్యులు నిరీక్షణ మంత్రం జపిస్తున్నారు. బుకింగ్ ఉంటే.. డెలివరీ గగనం ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ నిబంధనల ప్రకారం ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య 25 రోజుల కనీస గడువు ఉండాలి. అయితే.. బుక్ చేసిన తర్వాత వారం రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుందన్న చమురు సంస్థల ప్రకటనలు కేవలం ఫోన్ మెసేజ్‌లకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి బుకింగ్ చేసిన తర్వాత 15 రోజులు గడిస్తే తప్ప సిలిండర్ గడపకు చేరని పరిస్థితి నెలకొంది. రీఫిల్ బుక్ చేసిన వెంటనే ఒక తేదీని, వారం తర్వాత మరో తేదీని సూచిస్తూ కంపెనీలు పంపుతున్న సంక్షిప్త సమాచారం వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తోంది. కమర్షియల్ లాభం.. డొమెస్టిక్‌పై నిర్లక్ష్యం చమురు సంస్థలు గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ కంటే వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ల సరఫరాకే మొగ్గు చూపుతున్నా యనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసమే. తాజాగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ. 993 పెరిగి రూ. 3,315కి చేరింది. 14.5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 965 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల అసమానత సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బదిలీల జాబితాపై మొదలైన కసరత్తు పక్కదారి పడుతున్న ‘రీఫిల్’ బండి సరఫరా తగ్గిన తరుణంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్టాక్‌ను కూడా ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గృహ వినియోగ సిలిండర్లను అధిక ధరలకు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర వాణిజ్య సంస్థలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. డీలర్ల అక్రమ దందాతో సామాన్య గృహిణులు గ్యాస్ అయిపోయిన వేళ ప్రత్యామ్నాయం లేక అవస్థలకు గురి కావాల్సివస్తోంది. -
విద్యార్థిని అవయవాల దానం
బంజారాహిల్స్: ఇటీవల వెలువడ్డ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా ఆమె కళ్లతోపాటు ఇతర అవయవాలను తల్లిదండ్రులు దానం చేసి తమ కూతురు మరికొందరికి ప్రాణం పోయాలన్న సంకల్పం నెరవేర్చుకున్నారు. ఫిలింనగర్‌లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన లావణ్య సాయి(16) ఇంటర్ ఫెయిల్ అయింది. తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు మట్టిలో కలిసిపోకూడదని మరికొందరికి చూపు నివ్వడమే కాకుండా ప్రాణం పోయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంగరాల మూర్తి–సుబ్బలక్ష్మి దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురి అవయవాలను దానం చేస్తూ నిర్ణయం తీసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు. -
వృక్షాలకు నివాళులర్పించి..
ఆక్సిజన్ మాస్కులు ధరించి..బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ కొనసాగుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు, వాకర్లు రోజుకో రీతిన వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ సుమారు 1,320 వృక్షాలు కొట్టేస్తుండటంతో పచ్చదనం పూర్తిగా కరువవుతోందని, భవిష్యత్తులో ఆక్సిజన్ అందక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తామంటూ సోమవారం ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి నిరసనకు దిగారు. నేలకొరిగిన వృక్షాలకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. పార్కు చుట్టూ వాక్‌వేలో ప్లకార్డులు ప్రదర్శించారు. పర్యావరణవేత్తల వినూత్న నిరసన -
‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ లోగో ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ ’(ఈ2ఈ) అంతర్జాతీయ వేదిక లోగోను ఆవిష్కరించారు. తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా నిలిపేందుకు కృషిచేయాలన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ..2027 మార్చి 31 నాటికి 1,000 వ్యాపారాలు, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సందీప్ కుమార్ మక్తాలా, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, టీ కన్సల్ట్ డైరెక్టర్ భాగ్య లక్ష్మి వాకిటి తదితరులు పాల్గొన్నారు. -
ఐస్‌క్రీమ్ తేకపోతే బదిలీ చేస్తా!
ఎస్ఐకి జోన్ ఉన్నతాధికారి హుకుం సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఖరీదైన జోన్లో ఓ ఉన్నతాధికారి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు బూతులు మాట్లాడతారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకూ కమిషనర్ అన్ని జోన్ల ఉన్నతాధికారులతో కలిసి చర్చించి ఒకేసారి 65 మంది ఇన్స్పెక్టర్ల బదిలీకి రంగం సిద్ధం చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఓ జోన్ ఉన్నతాధికారి తెల్లవారుజామున 3 గంటలకు ఓ ప్రొహిబిషనరీ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)కు ఫోన్ చేసి ఐస్‌క్రీమ్ తీసుకురావాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ‘మనమే షాప్‌లను బంద్ చేయిస్తున్నాం కదా సార్. ఈ సమయంలో ఐస్‌క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది?’ అని సదరు ఎస్ఐ సమాధానం ఇవ్వగా.. చెప్పింది చేయకుంటే మల్టీ జోన్‌కు బదిలీ చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో చేసేదేం లేక గల్లీ గల్లీ తిరిగి ఆ ఎస్ఐ అధికారులందరికీ ఐస్ క్రీమ్ తీసుకెళ్లక తప్పలేదు. ఇదే జోన్ అధికారి మరో సందర్భంలో ఓ భూ తగాదా కేసులో తాను ఆదేశించినట్లు చేయనందుకు మరో ఎస్ఐపై ఆగ్రహానికి గురై ఫోన్లోనే బూతు పురాణం వినిపించాడు. తిట్ల దండకాన్ని సదరు ఎస్ఐ ఫోన్లో రికార్డ్ చేసి సహచరులకు, పలువురు ఉన్నతాధికారులకు వినిపించి, తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. గంటలో రిలీవ్ కావాలంటూ.. కాగా.. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఒకేసారి 32 మంది ఎస్ఐలను చార్మినార్ జోన్‌కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఎస్ఐలు గంటలోపు రిలీవ్ కావాలని సెట్లో కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం నిర్ణీత గంట వ్యవధి విధిస్తూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ (ఎస్హెచ్ఓ)లకు ఆదేశాలు రావడంతో గందరగోళం నెలకొంది. బాస్ ఆదేశాలతో చేసేదేం లేక ఎస్ఐలను రిలీవ్ చేసే పనిలో ఎస్హెచ్ఓలు నిమగ్నమయ్యారు. వివిధ కేసుల్లో కోర్టుకు వెళ్లిన ఎస్ఐలకు మెమోలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీ అయిన వారిలో కొందరు ఎస్ఐలు డీజీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అర్ధరాత్రి గల్లీ గల్లీ తిరిగి పట్టుకొచ్చిన ఎస్ఐ కేసు దర్యాప్తులో మరో ఎస్ఐపై దుర్భాషలు సైబరాబాద్‌లో చర్చనీయాంశం -
ఉత్సాహంగా బాల సమ్మేళనం
సుల్తాన్‌బజార్: బాల సాహిత్యానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని వక్తలు అన్నారు. సోమవారం సాయంత్రం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో బాల సాహిత్య సమ్మేళనం ఘనంగా జరిగింది. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు నుంచి బాల సాహితీ వేత్తలు, బాల సాహిత్య వికాసం కోసం ఉత్తమ అభిరుచితో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు పాల్గొని బాల సాహిత్యాన్నికి ఉన్నత భవిష్యత్తు కల్పించే వివిధ అంశాలపై చర్చలు సాగించారు. పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన శాంత వసంత ట్రస్ట్ సౌజన్యంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన సమ్మేళనంలో పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బాల సాహిత్య మిత్ర, బాల సాహితీమూర్తి పురస్కారాలను ప్రధానం చేశారు. ప్రభుత్వ మాజీ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన బాల సాహితీవేత్తలు -
ఎస్ఐఆర్పై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష
హైదరాబాద్: గాంధీభవన్ లో మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు కోఆర్డినేటర్లు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఎన్నికల సంఘం చేపట్టిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)” కార్యక్రమంపై లోతైన చర్చ జరిపి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ లో ఎక్కడా దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉండకుండా ప్రతి బూత్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్ర స్థాయిలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలని, యువత, మహిళలు మరియు కొత్తగా అర్హత పొందిన వారిని ప్రత్యేకంగా గుర్తించి నమోదు చేయించాలన్నారు. ఈ దిశగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.బూత్ స్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ కోసం వెంటనే “బూత్ లెవల్ అసిస్టెంట్స్ (BLA)” నియామకాన్ని పూర్తి చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను కర్తవ్యంగా భావించి పనిచేస్తేనే భవిష్యత్ ఎన్నికల్లో విజయానికి బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు,మరియు డివిజన్ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేయాలని అన్నారుఈ కార్యక్రమంలో మధుయాష్కి గారు,జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు. ఉప్పల్ నియోజకవర్గం కోర్డినేటర్ శశికళ యాదవ్ గారు,బండి రమేష్ గారు,కోలన్ హనుమంత్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు -
సరోజీని దేవి కంటి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
గోల్కొండ: మెహిదీపట్నంలోని సరోజీనిదేవి కంటి ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్ ప్లోర్ లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ రూమ్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను సిబ్బంది ఆర్పివేశారు. కాగా ఇండోర్ ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఇన్‌పేషంట్ విభాగం కూడా ఉండడంతో అక్కడ ఉన్న రోగులు ఔట్పేషంట్కు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఏడిఎఫ్వో వి.భానుప్రతాప్ తెలిపారు. -
పని చేస్తున్న చోటే దొంగతనం
మియాపూర్ : భవన నిర్మాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ సామాగ్రిని చోరీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్ డీఐ రమేష్ నాయుడు తెలిపిన మేరకు.. నిజామాబాద్ నవీపేట్‌కు చెందిన కల్లూరి లక్ష్మణ్ (39) జీడిమెట్ల రాంరెడ్డినగర్‌లో నివాసముంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీననం కొనసాగిస్తున్నారు. డబ్బు సరిపోకపోవడంతో చోరీలబాట పడ్డాడు. ఈ క్రమంలో ఓ నిర్మాణ సంస్థలో ఎలక్ట్రికల్ సామాగ్రి మాయమవుతుండటంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం చేసింది కల్లూరి లక్ష్మణ్ అని గుర్తించారు. అతని వద్ద నుండి రూ.1.50 లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. -
పంథా మార్చి.. ఏమార్చి
● కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ ● తాజాగా సికింద్రాబాద్‌లో క్రిస్టల్ మెథ్ స్వాధీనం, అదుపులో ఇద్దరు మహిళలు బంగారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో క్యారియర్లుగా మహిళలుసాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్మగ్లర్లు పంథా మార్చారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాకు మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు. డీఆర్ఐ, కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల దృష్టి మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ గడిచిన కొన్నాళ్లల్లో 11 మంది మహిళలు పట్టుబడటమే దీనికి నిదర్శనం. తాజాగా మంగళవారం సికింద్రాబాద్‌లో ఇద్దరు మహిళా క్యారియర్లను అదుపులోకి తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.4 కోట్ల విలువైన 11.4 కేజీల క్రిస్టల్ మెథ్ స్వాధీనం చేసుకున్నారు. మహిళలు, అందునా నిండుగర్భం, చంకలో పసిపిల్లలు, అంగవైకల్యంతో వచ్చేవారిని అధికారులు అనుమానించడం అరుదు. ఈ కారణంగానే వివిధ దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపి క్యారియర్లుగా మార్చుకుంటున్నారు. మాదకద్యవాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటిబిడ్డలతో వస్తున్నవారికి అప్పగించి పంపిస్తున్నారు. మెటల్ డిటెక్టర్లనూ ఏమార్చ వచ్చని.. వివిధ రూపాలు, పంథాల్లో ఒంటిపై బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలకు విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్(డీఎఫ్ఎండీ) కూడా కొంతవరకు కలిసి వస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగా ధరించే నగల వల్ల శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం ఉంటుందని బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. సూత్రధారులు మాత్రం చిక్కట్లేదు.. ఈ తరహా దందాలో చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా, ముఠా సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టమవుతోందని కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళా క్యారియర్లకు చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్ళి సరుకు తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. గతంలోనూ ఉదాహరణలు ఎన్నో.. దుబాయ్ నుంచి కొకై న్ క్యాప్సుల్స్‌ను కడుపులో దాచుకుని వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసాను పట్టుకుంటే 793 గ్రాముల డ్రగ్స్ దొరికింది. సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన ఓ మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
తండ్రి కాలేయంతో బాలుడికి ప్రాణం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు రెండేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రెండేళ్ల కుమారుడు మహ్మద్ అఫాన్ కండరాల బలహీనతతో తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి బాలుడు కాలేయసంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించారు. కాలేయదానం చేయడానికి తండ్రి అంగీకరించడంతో అతని నుండి 240 గ్రాముల కాలేయాన్ని సేకరించి దాదాపు 14 గంటల పాటు శ్రమించి బాలుడికి విజయవంతంగా అమర్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చు అయ్యే ఇలాంటి శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహించామని.. దాదాపు లక్షమందిలో ఒకరికి ఇలాంటి అరుదైన వ్యాధి ఉండే అవకాశం ఉంటుందని ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. వైద్యుల కృషిని మంత్రి మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. -
నేటినుంచి సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్
సాక్షి,సిటీబ్యూరో: సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని అధికారులు నియమించారు. 2న విశ్వశాంతి సంకీర్తనా యజ్ఞం సాక్షి, సిటీబ్యూరో: యుద్ధ వాతావరణం తదితర సంక్షోభాల నేపథ్యంలో ‘‘అన్నమాచార్య భావనా వాహిని’’ ఆధ్వర్యంలో ‘విశ్వ శాంతి సంకీర్తనా యజ్ఞం‘ నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా.నందకుమార్ తెలిపారు. ఈ నెల 2న 618వ అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ఉదయం ట్యాంక్ బండ్‌పై అన్నమయ్య విగ్రహం దగ్గర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 5న కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష అబిడ్స్: తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మే 5న లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరహార దీక్ష చేపడుతామని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ పేర్కొన్నారు. గగన్‌విహార్‌లోని టీఎన్జీఓ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండవ పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎఫ్ రద్దుతో పాటు మరో 64 ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామన్నారు. టీఎన్జీఓస్ నాయకులు కుర్రాడి శ్రీనివాస్, విక్రమ్ కుమార్, కేఆర్.రాజ్‌కుమార్ పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన రోజే పీపీఓలు సాక్షి, సిటీబ్యూరో: పదవీ విరమణ చేసిన రోజే సభ్యుల పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులను జారీ చేయడం లక్ష్యంగా రూపుదిద్దుకున్న ‘ప్రయాస్’ కార్యక్రమంలో భాగంగా గురువారం పలువురు ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపు ఉత్తర్వుల (పీపీఓలు)ను అందజేశారు. కూకట్‌పల్లిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ’ఉద్యోగుల పెన్షన్ పథకం, 1995’ కింద బాలానగర్‌కు చెందిన మెస్సర్స్ మల్హోత్రా షేవింగ్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఆర్టిసి సంస్థల ఉద్యోగులకు ఈ పిపిఓలను పంపిణీ చేశారు. గత నెలలో ప్రాసెస్ చేసిన 08 పెన్షన్ దరఖాస్తులకు సంబంధించిన ఉత్తర్వులను సహాయక పీఎఫ్. కమిషనర్ బాబుల్నాథ్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. ● రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహదారు జితేందర్ రెడ్డి గచ్చిబౌలి: ఒలింపిక్ స్థాయి క్రీడాకాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పని చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహదారులు ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ నిర్వహించారు. యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ విద్యతో పాటు శిక్షణ అందిస్తూ స్థిరమైన క్రీడా వ్యవస్థను నెలకొల్పేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మెన్,ఎండీ సోనీ బాల మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ స్థాయి నుంచి పోటీలు నిర్వహంచి ప్రతిభ వెలికి తీస్తున్నట్లు పేర్కొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కిశోర్ గోపీనాథన్, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘గుండె చికిత్స’పై చర్చా కార్యక్రమం సాక్షి, సిటీబ్యూరో: గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో నగరం గణనీయ పురోగతి సాధించిందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌లు పేర్కొన్నారు. ‘తీవ్రమైన గుండె వ్యాధుల చికిత్సలో నగరం’అంశంపై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏఐజి హాస్పిటల్ కు చెందిన కార్డియాక్ క్యాత్ ల్యాబ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనుజ్ కపాడియా పాల్గొని మాట్లాడారు. కవాట వ్యాధుల విషయంలో, అతి తక్కువ కోతతో చేసే గుండె చికిత్సా విధానాల దిశగా నిరంతర మార్పు కనిపిస్తోందని ఆయన తెలిపారు. -
‘ఆపరేషన్ ఆక్టోపస్’తో కదిలిన కేంద్రం
రెండు దఫాల్లో నిర్వహించిన హైదరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదేశాల మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నిర్వహించారు. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంతో ఆయా అంశాలను వివరిస్తూ సజ్జనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) లేఖ రాశారు. దీంతో కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి వీసీ సజ్జనర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలను నిరోధించాలంటే లోపాలు అధ్యయనం చేసి, మూలాల్లోకి వెళ్లాలని భావించిన సజ్జనర్ దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆక్టోపస్‌ను డిజైన్ చేశారు. తొలుత ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్–1’ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 16 రాష్ట్రాల్లో సోదాలు చేసి 117 మందిని అరెస్టు చేశారు. వీరిలో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలు అందించిన వారు (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), దళారులు ఉన్నారు. వీరి విచారణలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో రెండో విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ను ఏప్రిల్‌లో చేపట్టారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు వినియోగించిన 350 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటికి దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర అమాయకుల ధరాన్ని లూటీ చేశారని వెల్లడైంది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో బ్యాంకు అధికారుల పనిపట్టడానికి గత నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ చేపట్టారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన 16 ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్‌ల్లో దాడులు నిర్వహించాయి. ఫలితంగా పట్టుబడిన 52 మందిలో 32 మంది బ్యాంకు అధికారులు కాగా... 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో వివిధ బ్యాంక్‌లకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, క్లర్కులు ఉన్నారు. వీరి విచారణలో వెలుగులోకి వచ్చిన, దర్యాప్తులో గుర్తించిన అంశాలతో సజ్జనర్ ఆర్బీఐకి లేఖ రాయగా దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సమస్య పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎం.నాగరాజు, ఉన్నతాధికారులు, సీబీఐ డైరెక్టర్, ఇండియన్ సైబర్ క్రైౖ మ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు హైదరాబాద్ కొత్వాల్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు బహిర్గతం కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రం నుంచి హాజరైనహైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ -
అరుదైన కళాకారుడు ‘ఎల్లా’
సూరీడి కర్ఫ్యూ సూరీడి ప్రతాపంతో నగరం ఉడుకుతోంది.. ప్రజలు బయటకు రావాలంటేనే వణికే పరిస్థితి నెలకొంది. ఎలాంటి సమయంలోనైనా నిత్యం రద్దీగా కనిపించే రహదారులు సైతం బోసిపోతున్నాయి. గురువారం చార్మినార్ వద్ద కనిపించిన దృశ్యమిది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గన్‌ఫౌండ్రీ: ప్రముఖ మృదంగ విద్వాంసుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎల్లా వెంకటేశ్వరరావు అరుదైన, అద్భుతమైన కళాకారుడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సోమశేఖర మ్యూజిక్ డాన్స్ కల్చరల్ సొసైటీ, కిన్నెర ఆర్ట్ థియేటర్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఎల్లా వెంకటేశ్వరరావుకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన భట్టి మాట్లాడుతూ..కర్ణాటక సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న గొప్ప కళాకారుడు వెంకటేశ్వరరావు అని కొనియాడారు. 36 గంటల పాటు మృదంగం వాయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారని గుర్తు చేశారు. 83 సంవత్సరాల వయసులోనూ తన మృదంగంతో ప్రేక్షకులను కనువిందు చేయడం ప్రశంసనీయమన్నారు. అంతకు ముందు చిన్నారుల సినీ గీతాలాపన ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సంగీత దర్శకుడు విశ్వనాథ్, ఏపీ సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెంచలయ్య, కిన్నెర కార్యదర్శి రఘురాం, బాలమురళి తదితరులు పాల్గొన్నారు. -
విద్యాబోధనలో ఏఐ వినియోగం
కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలసాక్షి, సిటీబ్యూరో : విద్యా బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించడంతోపాటు కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని ప్రోత్సహించాలని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యత పాటించడంతో పాటు మెనూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు అవసరమైన చోట తరగతి గదుల విస్తరణ, అభివృద్ధి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల పురోగతిని సమీక్షించేందుకు తరచూ పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా వసతులు కల్పిస్తున్నందున, ఫలితాలు కూడా అదే స్థాయిలో రావాలని ఆదేశించారు. విద్యాధికారులు, ఉప విద్యాధికారులు పాఠశాలలను నిరంతర తనిఖీలు నిర్వహించేలా చూడాలని సూచించారు. పర్యవేక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఏడీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈఓలు, సెక్టోరియల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మేయర్‌కు ఓటు!
క్యూర్‌లోని మూడు కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నికపై చర్చ ● నీతి ఆయోగ్ సంస్కరణల నేపథ్యంలో.. ● కార్పొరేటర్‌కు ఒకటి, మేయర్‌కు మరో ఓటు ● పొత్తులు, పదవీకాలం పంచుకోవడానికి చెక్ ● ప్రభుత్వంపై ఆధారపడకుండా.. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా.. ● 2002లో ఎంసీహెచ్ మేయర్ ఎన్కిక జరిగిందలాగే.. సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకమండళ్లకు జరగబోయే ఎన్నికల్లో మేయర్లను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారా? అంటే.. కాదనలేమనే సమాధానమే అధికారుల నుంచి వస్తోంది. పది లక్షల జనాభా దాటిన నగరాల కార్పొరేషన్ల మేయర్ల ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించడంతోపాటు వారికి కార్యనిర్వాహక అధికారాలు కల్పించాలని సూచిస్తూ నీతి ఆయోగ్ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ సాగుతోంది. ‘మూవింగ్ టువార్డ్స్ ఎఫెక్టివ్ సిటీ గవర్నమెంట్– ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ మిలియన్ ప్లస్ సిటీస్’పేరిట అందజేసిన ఈ నివేదికలో మేయర్‌కు అధికారాలుండాలని సూచించింది. మేయర్ పదవికి స్థిరమైన కాలపరిమితి నిర్ణయించడంతోపాటు ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని పేర్కొంది. పారిశుధ్యంతోపాటు నీటి సరఫరా, పబ్లిక్ రవాణా వంటి విభాగాలు కార్పొరేషన్ పరిధిలో ఉండాలని కూడా సూచించింది. పెద్ద నగరాల్లో నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండటంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌తోపాటు చాలా కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల ద్వారా మేయర్లను ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. తద్వారా కార్పొరేషన్లో బలం కోసం పార్టీల మధ్య పొత్తులు, పదవీకాలం పంచుకోవడం వంటివి నగర ఓటర్లకు అనుభవమే. ఇలాంటి ఇబ్బందులు లేని స్థిరమైన పదవీకాలం, స్వతంత్ర నిర్ణయాలు మేయర్‌కు ఉంటే జవాబుదారీతనంతోపాటు నగర పాలనలో స్థిరత్వం, వేగం కూడా ఉంటాయనేది నీతి ఆయోగ్ అభిప్రాయం. సిటీకి కొత్త కాదు.. హైదరాబాద్ నగరానికి ప్రత్యక్ష మేయర్ ఎన్నిక కొత్తకాదు. జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందకముందు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు 2002లో జరిగిన మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్‌కు ఒక ఓటు, మేయర్‌కు మరొక ఓటు చొప్పున ఓటర్లు రెండు ఓట్లు వేశారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి మేయర్‌గా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత 2009–14 పాలకమండలిలో కాంగ్రెస్ –ఎంఐఎం పొత్తులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని పంచుకున్నాయి. కాంగ్రెస్ తరఫున బండ కార్తీకరెడ్డి, ఎంఐఎం తరఫున మాజిద్ హుస్సేన్‌లు మేయర్లుగా పదవీకాలాన్ని కూడా పంచుకున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ పరిధిలోనే తాగునీరు, డ్రైనేజీ, రక్షణ తదితర విభాగాలుండాలనే ఆలోచనలు గతంలోనూ జరిగాయి. -
పట్టాల కింద పైప్‌లైన్ లీక్
అప్రమత్తమైన అధికారులు ● యుద్ధప్రాతిపదికన పనులు సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరి సర్కిల్ మిర్జాలగూడ వార్డు పరిధి దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ కింద భారీ నీటి లీకేజీ గమనించిన రైల్వే అధికారులు జల మండలికి సమాచారం ఇచ్చారు. దీంతో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు యంత్రాంగం గురువారం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. సరఫరా సమయంలోనే లీకేజీ బయటపడడంతో ప్రధాన పైప్‌లైన్ నుంచే జరుగుతోందని నిర్ధారించారు. లీకేజీ కొనసాగితే ట్రాక్ దెబ్బతినొచ్చని భావించి మరమ్మతులు పూర్తయ్యే వరకు సరఫరా నిలిపివేశారు. రైల్వే పరిధి వెలుపల రిసెప్షన్ పిట్ వద్ద తవ్వకాలు చేపట్టగా, 20 అడుగుల లోతులో 300 మి.మీ. ఎంఎస్ క్యారియర్ పైప్, 800 మి.మీ. కేసింగ్ పైప్ అమర్చినట్లు గుర్తించారు. భారీ ట్రస్ట్ బ్లాక్ ఉండడంతో పనులు క్లిష్టంగా మారాయి. అందుకని జేసీబీ, ఎయిర్ కంప్రెషర్లు, డీ–వాటరింగ్ పంపులు వాడుతూ పనులు చేపడుతున్నారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటు ప్రస్తుత 300 మి.మీ. ఎంఎస్ పైప్లైనన్ను పూర్తిగా తొలగించి కొత్తది ఏర్పాటు చేయడమే శాశ్వత పరిష్కారం అ జలమండలి అధికారులు నిర్ణయించారు. రూ.48 లక్షల వ్యయం అంచనా వేశారు. మరమ్మతులతో వాణీనగర్, భవానీనగర్‌కు సరఫరా అంతరాయం కలిగింది. దీంతో జలమండలి పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. వాణీనగర్‌లో దాదాపు 200 కనెక్షన్లకు పాక్షికంగా సరఫరాను పునరుద్ధరించారు. మిగతా ప్రాంతాలకు ఉచిత ట్యాంకర్లు పంపుతున్నారు. -
బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
హిమాయత్‌నగర్ : బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌న్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ బీసీల హామీలు తుంగలో తొక్కి, వారి ఆశల మీద నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ పాల్గొన్నారు. జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ పదవీ విరమణ సాక్షి, సిటీ బ్యూరో: జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్ పదవీ విరమణ చేశారు. గురువారం ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఎండీ అశోక్ రెడ్డి హాజరై ఘనంగా సన్మానించారు. డైరెక్టర్లు వినోద్ భార్గవ, నారాయణ, శ్రీనివాస రెడ్డి, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సదరన్ ట్రావెల్స్‌కు అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ప్రముఖ ట్రావెల్ సంస్థల్లో ఒకటైన సదరన్ ట్రావెల్స్.. వియన్ ఐకానిక్ ట్రావెల్– టూరిజం సమ్మిట్–2026లో ప్రతిష్టాత్మకమైన ‘‘ప్రిఫర్డ్ ఇంటర్నేషనల్ టూర్ ఆపరేటర్’’అవార్డు అందుకుంది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ డైరెక్టర్ అశ్వినీ లోహాని, టూరిజం–హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ చైర్పర్సన్ జ్యోతి మయాల్ ప్రదానం చేశారు. సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని, ఈ గుర్తింపు వినియోగదారుల నమ్మకానికి, సిబ్బంది అంకితభావానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. 56 ఏళ్లు 2 వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ హాలిడే ప్యాకేజీలు, కార్పొరేట్ ట్రావెల్ సొల్యూషన్లు, కస్టమైజ్డ్ హాలిడే అనుభవాలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
కల్తీనూనె వంటకాలు.. షాప్ సీజ్
మోతీనగర్: కల్తీనూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడి చేసి ఓ షాప్‌ను సీజ్ చేశారు. సీఐ ఎస్.వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కై త్లాపూర్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లోని నసీబ్ బైరిష్టా అనే షాపులో కొంతమంది వ్యక్తులు పాడైన, వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారిణి హృదయ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ నిర్వహించారు. వంద లీటర్ల మేర పాడైన వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు. షాపును సీజ్ చేశారు. ఈ కల్తీ నూనెతో ఉల్లిపాయలు వేయించి పెద్ద హోటల్స్‌కు సప్లై చేసి బిర్యాని వంటకంలో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి ఫిర్యాదుతో అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సగర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి
గన్‌ఫౌండ్రీ: సగర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ సగర కులస్తులను బీసీ– డి నుంచి మార్పు, జీఓ నెంబర్ 59 వంటి విషయాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బాల మాయాదేవి, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ఆత్మగౌరవ భవన వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మారుతీసాగర్తోపాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఫిర్యాదులు కుప్పలు.. అంతంతే చర్యలు
జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: మహా నగర పరిధిలో అనధికారిక నిర్మాణాలపై జీహెచ్ఎంసీకి కుప్పలుగా ఫిర్యాదులొస్తున్నా.. పరిష్కారం అంతంత మాత్రంగానే ఉందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులతో సరిపెడుతోందని, అత్యంత స్వల్పంగానే ఉత్తర్వులు జారీ చేస్తోందని అభిప్రాయపడింది. ఇంత పెద్ద నగరంలో ఎక్కడా అనధికారిక నిర్మాణాలపై పూర్తి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా వెబ్సైట్ వివరాలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. కోఠిలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి అనధికారిక నిర్మాణం చేపట్టినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాము అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని స్పందన లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుకు ఇది నిదర్శమన్నారు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేశారు. -
కొత్త రైళ్లకు నిధుల బ్రేక్
ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ ● పదేళ్లు గడిచినా ప్రతిపాదనలకే పరిమితం ● రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు రూ.491 కోట్లు సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్‌ను నిధుల కొరత వెంటాడుతోంది. రెండోదశ విస్తరణలో భాగంగా కొత్త రైళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన పదేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. నగరంలో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును దక్షిణమధ్యరైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టాయి. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేశారు. 2003లో రూ.630 కోట్లతో 42 కి.మీ.వరకు చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టు విజయవంతమైంది. అదే పద్ధతిలో 2012లో రెండో దశకు శ్రీకారం చుట్టారు. మొత్తం 6 మార్గాల్లో 86 కి.మీ వరకు రెండోదశ విస్తరణకు చర్యలు చేపట్టారు. రూ.860 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టినా ప్రాజె క్టు నిర్మాణంలో జాప్యం కారణంగా రూ.1,305 కోట్లకు పెరిగింది. ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభు త్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/4వంతు చొప్పున నిధులను అందజేయాలి. ఈ లెక్కన రాష్ట్ర వాటా రూ.870 కోట్లు అందజేయాలి. ఇప్పటి వరకు పలు దఫాలుగా కేవలం రూ.379 కోట్లు ముట్టజెపిపంది. మరో రూ.491 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు లభించకపోయినా దక్షిణమధ్య రైల్వే సొంత నిధులను వినియోగించి కొత్త లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులను పూర్తి చేసింది. సర్వీసులు పెంచాలి.. ప్రస్తుతం 80 ఎంఎంటీఎస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. కోవిడ్‌కు ముందుకు 121 సర్వీసుల్లో సుమారు 1.6 లక్షల మంది పయనించారు. ఇప్పుడు ఆ సంఖ్య 45 వేలకు పడిపోయింది. కొత్తగా విస్తరించిన మార్గాల్లో సర్వీసుల సంఖ్యను పెంచేందుకు రైళ్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత సదుపాయం అందజేయాలంటే ఏటా రూ.10 కోట్ల చొప్పున టిక్కెట్ చార్జీలు పెంచాలి. అన్ని రూట్లలో సర్వీసులను పెంచాలి. ఇందుకోసం కనీసం 10 కొత్త రైళ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రెండోదశ ఒప్పందం ప్రకారం రూ.491 కోట్ల పెండింగ్ బకాయీలను చెల్లిస్తే ఆ నిధులతో కొత్త రైళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. -
అక్రిడిటేషన్ కమిటీని మార్చకపోతే ఆందోళన
● ఐ అండ్ పీఆర్ కమిషనర్‌ను కలిసిన జర్నలిస్ట్ సంఘాల నేతలు సాక్షి,సిటీబ్యూరో: ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా సీనియారిటీని విస్మరించి ఏకపక్షంగా ప్రకటించిన హైదరాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని తక్షణమే రద్దు చేసి పునర్వ్యవస్థీకరించకుంటే ఆందోళన తప్పదని పలు జర్నలిస్టు యూని యన్లు హెచ్చరించాయి. గురువారం ఐఆండ్ పీఆర్ కార్యాలయంలో కమిషనర్ ప్రియాంకను కలిసి హైదరాబాద్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటులో జరిగిన అవకతవకలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన పత్రికల సీనియర్ జర్నలిస్టులను సైతం విస్మరించి తమకు అనుకూలంగా వ్యవహరించేవారికి స్థానం కల్పించారని ఆరోపించారు. అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో పనిచేసే వారికి కూడా కమిటీలో ప్రాధాన్యత కల్పించడంపై అను మానం వ్యక్తం చేశారు. ఫొటో, వీడియో, ఉర్దూ, ఎలక్ట్రానిక్, చిన్న పత్రికల యూని యన్లు ప్రతిపాదించిన అర్హులైన జర్నలిస్టుల పేర్లను పరిగణనలోకి తీసుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్య క్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజిద్, హెచ్ యూజే అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. -
కల్తీ టీ పౌడర్ గుట్టురట్టు
గన్ ఫౌండ్రి: నగరంలో మరో భారీ కల్తీ టీ ఫౌడర్ దందా వెలుగు చూసింది. గురువారం హెచ్–ఫాస్ట్ బృందాలు ఏకకాలంలో నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేసి సుమారు 3 వేల కిలోల కల్తీ టీ పొడి, 1,500 కిలోల గడువు ముగిసిన టీ పొడి, వంద కిలోల బెల్లంతోపాటు కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నాయి. పదిమంది నిందితులను అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా పాత బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ వివరాలు వెల్లడించారు. కొంపల్లికి చెందిన పరీష్ రాజన్, పేట్లబురుజుకు చెందిన సంజు అలియాస్ పతి, ముషీరాబాద్‌కు చెందిన సతీష్, బోయిన్‌పల్లికి చెందిన నవీన్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన నరసింహ, రాజేంద్రనగర్‌కు చెందిన చున్నీలాల్ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, బీదర్‌కు చెందిన రవీందర్, మల్లేపల్లికి చెందిన వసీం ముఠాగా ఏర్పడ్డారు. వీరు కోల్‌కతా, అస్సాం, కేరళ నుంచి నాసిరకం, వాడిన, గడువు తీరిన టీ పౌడర్లను సేకరిస్తున్నారు. వీటికి బెల్లంపాకంతోపాటు కొన్ని రసాయనాలను కలిపి బ్రాండెడ్ టీ పౌడర్ పేరిట రీ ప్యాకింగ్ చేసి రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లు, ఇతర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ దందా చేస్తున్నారు. కల్తీకి సంబంధించి ఏమైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా హెచ్ ఫాస్ట్ నెంబర్ 87126 61212 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. పదిమంది నిందితుల అరెస్ట్ మూడు వేల కిలోలసరుకు స్వాధీనం -
ఈ–వేస్ట్‌లో మరో ముందడుగు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సనత్‌నగర్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ–వేస్ట్) సరైన నిర్వహణలో జీహెచ్ఎంసీ మరో కీలక అడుగు పడింది. అమీర్‌పేటలోని హ్యాపీ, బిగ్‌సీ స్టోర్లలో ఈ–వేస్ట్ ఎకో సిస్టమ్ కార్యకమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. ఎర్త్ సెన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ–వేస్ట్ ఎకో సిస్టమ్ విధానాన్ని వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రజల నుంచి ఈ–వేస్ట్ సేకరణతో పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తుండగా, ఈ ప్రయత్నాలను దీర్ఘకాలికంగా కొనసాగించేందుకు ప్రత్యేకంగా ఈ–వేస్ట్ నిర్వహణ వ్యవస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ఈ కొత్త వ్యవస్థ ద్వారా పౌరులకు మూడు మార్గాల్లో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. -
ప్రయోగాల పేరుతో మూగజీవులను హింసించకండి
సాక్షి, సిటీబ్యూరో: ప్రయోగాల పేరుతో మూగజీవాలపై జరగుతున్న హింసను ఆపాలని జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా నినదించింది. ప్రధానంగా పాలమూరు బయోసైన్సెస్ సంస్థలో ప్రయోగాల పేరుతో నిర్బంధించిన 1200 జంతువులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తీవ్ర నిరన చేపట్టారు. కేబీఆర్ పార్క్ వద్ద పెటా ఇండియా సభ్యులు, వీగన్స్ ఆఫ్ తెలంగాణ మద్దతుదారులు గురువారం ఆందోళన చేపట్టారు. పాలమూరు బయోసైన్సెస్‌లో 1200కి పైగా కుక్కలు, కోతులు, గొర్రెలు, పందులు తదితర జంతువులను బ్రీడింగ్, ప్రయోగాల పేరుతో బందీగా ఉంచారని ఆరోపించారు. 73 బీగిల్ కుక్కలను పునరావాసానికి అనుకూలమని సంస్థే గుర్తించినప్పటికీ, వాటిని విడుదల చేయకుండా నిరాకరిస్తోందని పేర్కొంది. -
ఎప్పటికై నా గొప్ప నటి అవుతా..
‘ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026’ ఇందు ఫాల్గుణి పంజగుట్ట: గొప్ప నటి కావాలన్నదే తన ఆశయమని, ఎప్పటికై నా అనుష్కా షెట్టి అంతటి గొప్ప నటిని అవుతానని ‘ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026’ టైటిల్ కై వసం చేసుకున్న చిలకలపూడి ఇందు ఫల్గుణి తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మిస్ ఇండియా పోటీల విశేషాలు వెల్లడించారు. ఏప్రిల్ 18న జరిగిన పోటీల్లో ‘ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026’ విజేతగా తెలుగు రాష్ట్రాల నుండి మొట్టమొదటి సారి తాను నిలిచానన్నారు. సుష్మితాసేన్, ఐశ్వర్యారాయ్, లారాదత్త ఆదర్శమని, ఎప్పటికై నా ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నటి అనుష్కా షెట్టి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అంతటి నటి అవుతానని తెలిపారు. గుంటూరుకు చెందిన ఇందు ఫల్గుణి నగరంలో శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటూ ఎల్ఎల్బీ చదువుతోంది. మేజిస్ట్రేట్ కావాలన్నది తన కోరిక అన్నారు. -
నల్లాలపై విజిలెన్స్
గ్రేటర్లో అక్రమ మోటార్లకు అడ్డుకట్టసాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం విస్తరిస్తోంది.. జనాభా పెరుగుతోంది.. కానీ నగర దాహం తీర్చే జల వనరులు మాత్రం పదేళ్ల నాటి లెక్కలకే పరిమితమయ్యాయి. సుదూర జలాశయాల నుంచి తరలిస్తున్న నీటి కోటాలో మార్పు లేకపోవడంతో అందుబాటులో ఉన్న జలాలను అందరికీ సమంగా పంచడం జలమండలికి కత్తిమీద సాములా మారింది. దీంతో ప్రతి వేసవిలో నీటి వృథా నియంత్రణ, అక్రమ వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా నీటి కేటాయింపులు లేకపోవడంతో ఉన్న వనరులనే పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సరఫరాలో అసమానతలను తొలగించేందుకు మండలి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. అక్రమ మోటార్లపై ‘సర్జికల్ స్ట్రైక్’ నల్లా కనెక్షన్లకు నేరుగా విద్యుత్ మోటర్లు బిగించి నీటిని లాగేసే వారిపై జలమండలి కన్నెర్ర చేసింది. పొరుగున ఉన్న ఇతర వినియోగదారులకు లో ప్రెషర్‌తో నీరు అందకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. నీటి సరఫరా సమయాల్లో విజిలెన్స్ బృందాలను రంగంలోకి దింపింది. అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియను కొనసాగిస్తోంది. సీజ్ చేసిన ప్రతి మోటారుపై వినియోగదారుడికి రూ.2,000 నుంచి రూ.5,000 వరకు అధికారులు జరిమానా విధిస్తున్నారు. నీటి చౌర్యం కింద క్రిమినల్ కేసులూ నమోదు చేస్తున్నారు నీటివృథాపై జలమండలి కన్నెర్ర తెల్లవారుజామునే అధికారుల దాడులు నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు రంగంలోకి ‘వాటర్ వలంటీర్లు’ నీటిని వృథా చేస్తున్న సమాచారం అందించేందుకు జలమండలి ‘వాటర్ వలంటీర్ల’ను రంగంలోకి దింపుతోంది. పానీ యాప్ ద్వారా కచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేయాలని నిర్ణయించింది. వినియోగదారులు తాగునీటితో వాహనాలు కడగడం, గార్డెనింగ్‌కు వినియోగిస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానాలు విధిస్తోంది. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే ప్రతి వినియోగదారుడు స్వచ్ఛందంగా నీటిని పొదుపు చేసేలా అవగాహన కల్పిస్తోంది. నగరంలోని గాంధీనగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు తాగునీటి సరఫరా అవుతున్న నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నివాస సముదాయాల్లో నల్లాలకు అక్రమంగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని తోడటాన్ని గుర్తించారు. సుమారు 17 మోటార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్షం రోజులుగా ఇదే తరహాలో జలమండలి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తోంది. -
18వ అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య!
మణికొండ: తన బాబాయి ఇంటికి వచ్చిన ఓ యువకుడు 18వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరంచెరువు పీబీఎల్ సిటీలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు.. సాయి ఆశీష్రెడ్డి(30) తన బాబాయి నివసిస్తున్న పీఈబీఎల్ సిటీకి గురువారం వచ్చాడు. అంతలో ఏమి జరిగిందో 18వ అంతస్తునుంచి దూకాడు. దాంతో అతని తలకు బలమైన గాయాలై చిత్రమయ్యింది. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
మ్యూల్ ఖాతాలపై ఉక్కుపాదం
వినియోగదారుల భద్రతే లక్ష్యం ● కొత్వాల్ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులు కేవలం కొత్త ఖాతాలు తెరవడమే లక్ష్యంగా పెట్టుకోకుండా వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేయాలని నగర సీపీ సజ్జనర్ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో గురువారం ఆయన బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. రెండు దశల్లో నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన లోపాలకు వారి దృష్టికి తీసుకువచ్చారు. 45 బ్యాంకులకు చెందిన 75 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు ’సేఫ్ కస్టమర్ చాలెంజ్’ను బ్యాంకులు స్వీకరించాలన్నారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ ’జీరో మ్యూల్ అకౌంట్స్’ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ బ్యాంకు శాఖలోనూ సైబర్ బాధితులు ఉండకూడదని, నేషనల్ సైబర్ క్రైౖ మ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా బ్రాంచీల పనితీరును అంచనా వేసుకోవాలని స్పష్టం చేశారు. ’ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’లో 850 కేసుల్లో రూ. 150 కోట్ల మోసాలను గుర్తించామని, మ్యూల్ ఖాతాల ఓపెనింగ్‌లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. కంబోడియా, వియత్నాం, దుబాయ్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాలు దళారుల ద్వారా స్థానిక బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క ఈ నేరాలకు పాల్పడుతున్నాయని వివరించారు. మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు ‘మ్యూల్ హంటర్’ వంటి టెక్నాలజీని వాడాలని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్1930పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులు పాల్గొన్నారు. 7సజ్జనర్@సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌లో మరోసారి అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) హోదాలో ఉన్న అధికారి కొత్వాల్ పోస్టులో నగర పోలీసు విభాగానికి నేతృత్వం వహించనున్నారు. ఇంతకుముందు పేర్వారం రాములు, అనురాగ్ శర్మ, ఎం.మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్, ఆనంద్, కొత్తకోట శ్రీనివాసరెడ్డిలు ఇలానే వ్యవహరించారు. ఇప్పుడు కొత్వాల్ సజ్జనర్‌కు డీజీపీగా పదోన్నతి లభించింది. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో సజ్జనర్ గురువారం డీజీపీ హోదాలో నగర పోలీసు కమిషనర్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. -
నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి దారుణ హత్య
చిలకలగూడ: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన మేరకు.. ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు చెందిన బైక్ మెకానిక్ సయ్యద్ ఇలియాస్ (33), జమిస్తాన్‌పూర్‌కు చెందిన ఏసీ మెకానిక్ మహ్మద్ అలీమ్ (42), అదే ప్రాంతానికి చెందిన జహంగీర్ ముగ్గురు స్నేహితులు. మహ్మద్‌అలీమ్, జహంగీర్లు ఇతరులతో కలిసి నిత్యం పేకాట ఆడేవారు. జహంగీర్ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు మహ్మద్ అలీమ్ తిరిగి ఇవ్వలేదు. అడిగితే రేపు, మాపు అని తిప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు స్నేహితులు కలిసి గురువారం సాయంత్రం పద్మారావునగర్‌లోని కేవీకే వైన్స్ వద్ద మద్యం తాగారు. సిట్టింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోమారు వాగ్వాదం జరిగింది. జహంగీర్, ఇలియాస్‌లు పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో మహ్మద్ అలీమ్పై దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడున్న అలీమ్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహ్మద్‌అలీమ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భధ్రపరిచారు. చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ రామకృష్ణలు ఘటన స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
జలమండలికి అవార్డులు
సాక్షి,సిటీబ్యూరో: జలమండలి దక్కించుకున్న మూడు పీఆర్ఎస్ఐ అవార్డులను సోమవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డికి అందించారు. రాష్ట్రీయ స్థాయిలో బెస్ట్ బ్రోచర్, కార్పొరేట్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, బెస్ట్ లేఅవుట్, డిజైన్ కేటగిరీలో పోస్టర్ కేటగిరీల్లో జలమండలి బహుమతులను గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ద్వారా అందుకున్న అవార్డులను ఎండీకి అందజేశారు. కార్యక్రమంలో సీజీఎంలు కిరణ్ కుమార్, రాజ శేఖర్, పీఆర్వో సుభాష్, గ్రౌండ్ వాటర్ ఎక్స్ పర్ట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2న హైబిజ్ టీవీ మీడియా అవార్డులు సాక్షి, సిటీబ్యూరో: మీడియా రంగంలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ప్రతిష్టాత్మక హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2026 (6వ ఎడిషన్)ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం మే 2న హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నామన్నారు.ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, డిజిటల్ మీడియా విభాగాల్లో జర్నలిజం, అడ్వర్టైజ్మెంట్, సర్క్యులేషన్ వంటి కేటగిరీల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 50కి పైగా విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది నలుగురు ప్రముఖ జర్నలిస్టులకు లెజెండరీ పురస్కారాలు అందజేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏప్రిల్ 26లోపు 8096974747 వాట్సాప్ నంబర్‌కు పంపించాలన్నారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకు రూ.2.5లక్షల విలువైన స్కాలర్షిప్స్ అందజేస్తామన్నారు. దక్షిణమధ్య రైల్వేకు పీఆర్ఎస్ఐ పురస్కారాలుసాక్షి, సిటీబ్యూరో: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ అవార్డ్స్ – 2026 కార్యక్రమంలో, దక్షిణ మధ్య రైల్వే పబ్లిక్ రిలేషన్స్ విభాగానికి పురస్కారాలు లభించాయి. ‘‘తెలంగాణ రైజింగ్ 2047: కమ్యూనికేషన్, ఇన్నోవేషన్,ఎంపవర్మెంట్’’ అనే థీమ్‌తో నిర్వహించిన 4వ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డులను అందజేశారు. మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక పాల్గొన్నారు. -
నాటు తుపాకీ విక్రయించేందుకు యత్నం
● ఇద్దరి అరెస్ట్ కుత్బుల్లాపూర్: నాటు తుపాకీ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎస్ఓటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సవవవేశంలో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. నాటు తుపాకీ విక్రయిస్తుననారని పోలీసులకు సమాచారం అందింది. దూలపల్లిలోని వికాస్ గ్యాస్ గోదాము వద్ద నిఘా పెట్టగా అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని ఆదుపులోకి తీసుకొని విచారించగా తుపాకీ విక్రయం వ్యవహారం బయట పడింది. నిందితులు బీహార్‌కు చెందిన వికాస్కుమార్(22), వంశరాజ్(31) గా గుర్తించారు. వీరు స్థానికంగా కూలీలుగా పనిచేచేస్తున్నారు. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి సిటీలో విక్రయించాలని ప్లాన్ వేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.7.65 ఎంఎం నాటు తుపాకీతోపాటు 8 బుల్లెట్లు, రెండు ఖాళీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఎవరెవరికి ఆయుధాలను విక్రయించారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. పరీక్షలు రాస్తూ.. చోరీలు చేస్తూ.. ● ముగ్గురు టెన్త్ విద్యార్థుల అరెస్ట్ మూసాపేట: పదవ తరగతి పరీక్షలు రాస్తూనే బైక్ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు బాలురు కూకట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలోనే కూకట్పల్లి బాలాజీనగర్ ఫ్రీడమ్ పార్కు, సప్తగిరి కాలనీ, గాయత్రినగర్, బాలాజీనగర్‌లో పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను దొంగతనం చేశారు. కూకట్పల్లి బస్‌స్టాప్ వద్ద డిటెక్టివ్ ఎస్ఐ రవీందర్ రెడ్డి నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ద్విచక్రవాహనాలు మాయం చేసినట్లు ఒప్పుకున్నారు.వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకుని ముగ్గురినీ సోమవారం జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియాలో నటి అనసూయ భరద్వాజ్‌ను ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్లగొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దోరేపల్లి చంటిగా గుర్తించామని డీసీపీ టి.సాయి మనోహర్ సోమవారం ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి పలువురు వ్యక్తులు సోషల్‌మీడియా పేజీల్లో నటి అనసూయ భరద్వాజ్‌పై అనుచిత, అసభ్యకర పోస్టు చేస్తున్నారు. దీనిపై అనసూయ ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు చంటిని అరెస్టు చేశారు. ఇతడు తన ఇన్‌స్టా ఖాతాలో అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు గుర్తించారు. -
అండర్ గ్రౌండ్ కేబుల్స్ నుంచి మంటలు
అడ్డగుట్ట: ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో ఆదివారం రాత్రి అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో రెండు వారాల క్రితం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పది రోజులుగా రోడ్డు తవ్వకాలు జరుగుతున్నాయి. విద్యుత్ స్తంభం నుంచి స్థానికంగా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సరఫరా అయ్యే విద్యుత్‌కు సంబంధించి ప్యానల్ బోర్డుకు అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్ అమర్చారు. అయితే రోడ్డు తవ్వుతున్న సమయంలో ప్యానల్ బోర్డుకు సంబంధించిన కేబుల్స్ బయటకు వచ్చాయి. సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులకు రోడ్డు కాంట్రాక్టర్ సమాచారం ఇవ్వలేదు. ఆదివారం కురిసిన వర్షం కారణంగా వర్షపు నీరు సదరు కేబుల్స్‌లోకి వెళ్లడంతో రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.సకాలంలో విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంతో మంటలు ఆగిపోయాయి. ఆజాద్ చంద్రశేఖర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తప్పిన ప్రమాదం భయాందోళనకు గురైన నిర్వాసితులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం -
సైబర్ దొంగల బరితెగింపు..
ట్రేడింగ్ పేరిట రూ.12 లక్షలు స్వాహా కీసర: సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరిట ఓ వ్యక్తి నుంచి రూ.12.94 లక్షలు దోచేశారు. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. కీసర నాగారం సత్యనారాయణ కాలనీకి చెందిన మహేశ్వర్‌గౌడ్ ఫోన్నెంబరును సైబర నేరగాళ్లు రెండు వాట్సాప్ గ్రూప్స్‌లో చేర్చారు. నిరాలి సంఘీ, సుబ్రతా ముఖర్జీ పేరిట మాట్లాడారు. లాభాలు తెప్పిస్తామని..ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని నమ్మించారు.వారి మాటలు నమ్మిన బాధితుడు మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు.ఆ తరువాత రూ.40 వేలు జమ చేశాడు. అనంతరం రూ.15 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అది నమ్మిన మహేశ్వర్ గౌడ్ రూ.12.94 లక్షలు జమచేశాడు. ఆ తరువాత డ్రా చేసుకునేందుకు యత్నించగా మరింత డబ్బు జమచేయాలని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ ఉద్యోగం పేరిట మోసం.. సనత్‌నగర్: బేగంపేటకు చెందిన మంగళారపు శ్రీకాంత్‌కు టెలిగ్రామ్‌లో ఓ మెసేజ్ రావడంతో క్లిక్ చేశాడు. ఆరుషి మల్హోత్రాగా పరిచయం చేసుకున్న ఓ మహిళ.. సన్‌టెక్ ఇండియా, క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలలో పెట్టుబడితే 20 నుంచి 40 శాతం లాభాలు వస్తాయంటూ నమ్మబలికింది. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా శ్రీకాంత్‌ను సంప్రదించారు. ఆన్లైన్ ఉద్యోగం పేరిట చిన్న చిన్న టాస్క్‌లు చేయించారు. మొదట శ్రీకాంత్ ఖాతాలో రూ.4,265 జమ చేశారు. అనంతరం వీఐపీ టాస్క్‌లు, ట్విన్ మిషన్ల పేరిట ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరారు. మోసగాళ్లు ఇచ్చిన లింక్‌ల ద్వారా శ్రీకాంత్ 15 సార్లు రూ.3,82,626 డబ్బు చెల్లించాడు.అయితే కేవలం రూ.11,630 మాత్రమే తిరిగి వచ్చాయి. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింక్ క్లిక్ చేస్తే రూ.91వేలు మాయం నాంపల్లి: శాంతినగర్‌కు చెందిన ఓ యువతి ఇటీవల బీటెక్‌ను పూర్తి చేసింది. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జాబ్ కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో సెర్చ్ చేస్తోంది.ఈ క్రమంలో చేస్తుండగా వచ్చిన ఓ లింకుపై క్లిక్ చేయగా ఆమె అకౌంట్లో నుండి రూ.91,500 మాయం అయ్యాయి. దీంతో నాంపల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఐటీకే ఉద్యోగికి రూ.2.60 లక్షలు టోకరా ఉప్పల్: ఐటీ ఉద్యోగికి ఏపీకే ఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు అతని బ్యాంక్ అకౌంట్నుంచి స్వాహా చేశారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు.. సెవన్ హిల్స్ కాలనికి చెందిన సాయి కిరణ్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు క్రెడిట్ కార్డు విభాగం నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. కొత్త క్రెడిట్ కార్డు కోసం వివరాలను ఇవ్వాలని కోరాడు. ఏపీకే ఫైల్ పంపి యాప్ ద్వారా వివరాలు పూర్తి చేయాల్సిందిగా కోరాడు. యాప్‌ను ఓపెన్ చేయగానే అనుమానం వచ్చి కాల్ కట్ చేసినా కూడా బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2,60,000 ఫిర్యాదు దారునికి తెలియకుండానే ఓటీపీలు చెప్పకుండానే ఖాతా ఖాళీ చేశాడు. దీంతో బాధితుడు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు. నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ప్రతిరోజూ అవగాహనకార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులుపంపిన లింకులను ఓపెన్ చేసి.. తీరా డబ్బు పోయిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో నలుగురిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. -
అమ్మవారి విగ్రహం చోరీ
గంటలోపు నిందితుడి అరెస్ట్ బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీ పార్థివాడలోని శ్రీ అడవి మైసమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని చోరీ చేశాడు. దీంతో గాంధీనగర్ పోలీసు అధికారులు దేవాలయాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.అడిషినల్ డీసీపీ నర్సయ్య ఆలయాన్ని సందర్శించారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి గంటలోపే నిందితుడిని అరెస్టు చేసి విగ్రహాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. మంగళవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించన్నట్లు దేవాలయం ప్రతినిధులు చెప్పారు. నిందితుడు గోల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని..ఆటోలో వచ్చి చోరీ చేశాడని పోలీసులు గుర్తించారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురి బలవన్మరణం
సంతానం లేదని గృహిణి.. రాజేంద్రనగర్ : బండ్లగూడ ఎన్ఎఫ్సి కాలనీలో శివ, సుమలత (36) దంపతులు నివాసముంటున్నారు. అనారోగ్య సమస్యలతో పాటు సంతానం కలగలేదని తరచూ సుమలత బాధపడేది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరు సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పంచానామ నిర్వహించి బృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి.. మల్కాజిగిరి: న్యూ వెంకటేశ్వరనగర్‌కు చెందిన కోడాటి మధుమోహన్(41) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధుమోహన్ పై గృహహింస కేసు ఉండడంతో పెద్ద మనుషులు సర్దిచెప్పారు. ఈ నెల 19వ తేదీ మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగగా కవిత పిల్లలతో కలిసి తుకారాంగేట్‌లో పుట్టింటికి వెళ్లింది. 20న మధుమోహన్ పనిచేసే సంస్థలో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. కిటికీకి తాడుతో ఉరి వేసుకున్నట్లు గమనించి అతని సోదరుడు కనకేష్కు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఎన్బీటీనగర్లో విద్యార్థి.. బంజారాహిల్స్: బంజారాహిల్స్ ఎన్బీటీనగర్లో నివసించే దంతాల సంజయ్‌కుమార్ (23) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–4లోని జీవీకే మాల్ ఎదురుగా హెబిటట్ కేఫ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. కొంతకాలంగా ముభావంగా ఉంటూ కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడడం లేదు. సోమవారం మధ్యాహ్నం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ సెక్టార్ ఎస్ఐ శ్రీనివాస్ సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.కుటుంబసమస్యలు, వ్యక్తిగత కారణాలతో నగరంలో పలుచోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. రాజేంద్రనగర్, మల్కాజిగిరి,బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సంఘటనలు జరిగాయి. -
567 కేసులు.. రూ.1.1 కోట్ల సరుకు
సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయానికి చెక్ చెప్పడానికి నగర పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో తనిఖీలు చేశారు. శనివారం నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పాన్‌డబ్బాలు, కిరాణా దుకాణాల్లో సోదాలు చేసిన అధికారులు 567 కేసులు నమోదు చేసి, రూ.1.1 కోటి విలువైన పొగాకు ఉత్పత్తులు సీజ్ చేసినట్లు కొత్వాల్ వీసీ సజ్జనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి దిగడానికి విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలూ కారణమని అధికారులు గుర్తించారు. అనేక కేసుల దర్యాప్తులో భాగంగా గంజాయి, డ్రగ్స్ బానిసలు తాము సిగరెట్లతో మొదలుపెట్టే ఈ విషవలయంలో చిక్కుకున్నట్లు బయటపెట్టారు. దీంతో విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేసి, నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. అత్యధికంగా చార్మినార్ జోన్ పరిధిలో 119 కేసులు నమోదు కాగా, రాజేంద్రనగర్ పరిధిలో 102, గోల్కొండ పరిధిలో 98, ఖైరతాబాద్‌లో 78, సికింద్రాబాద్‌లో 64, జూబ్లీహిల్స్ లో 54, శంషాబాద్‌లో 52 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు వేల మందికి పైగా సిబ్బంది, అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు చేశారు. లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, రిజర్వ్ పోలీసులతో కూడిన బృందాలు తనిఖీలు చేశాయి. విద్యాసంస్థల సమీపంలోని దుకాణ యజమానులు అందరూ కోప్టా చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా సిగరెట్లు, గుట్కా, ఈ–సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే 100కు లేదా 8712661601కు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో పాల్గొన్న సీపీ నగర వ్యాప్తంగా పాఠశాలల వద్ద పొగాకు దందా విక్రేతల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వండి : కొత్వాల్ సజ్జనర్ -
‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్
ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్) డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా సిబ్బంది సంజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. నారాయణ స్కూల్ గేట్‌కు తాళం మేడిపల్లి: బోడుప్పల్‌లోని నారాయణ స్కూల్ ప్రధాన గేటుకు భవన యజమానులు సోమవారం తాళం వేశారు.ఒప్పందం ముగియడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు భవన యజమానులు చెబుతున్నారు.అయితే 2027 మార్చి వరకు ఒప్పందం ఉందని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇదే సమయంలో గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తాము పదేళ్ల లీజుకు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. -
పారిపోయి.. అంతలోనే పట్టుబడి..
ఎస్కార్ట్ వాహనం నుంచి దూకి రిమాండ్ ఖైదీ పరారీ● పెట్రోలింగ్ పోలీసుల సాయంతో నిందితుడి పట్టివేత ● కోర్టు విచారణ తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండగా ఘటన సైదాబాద్: సినీఫక్కీలో ఎస్కార్ట్ వాహనం నుంచి కిందికి దూకి పారిపోయిన ఓ రిమాండ్ ఖైదీ కొద్దిసేపటికే పెట్రోలింగ్ సిబ్బంది చేతికి చిక్కాడు. వివరాలు... బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనం కేసులో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన ఏ–1 సాదుల నరేష్(24), ఏ–2 భూక్యా వంశీ (23), ఏ–3 మల్లెం వంశీ(23)లు ఇటీవల అరెస్ట్ అయ్యారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిని సోమవారం పోలీసులు పీటీ వారెంట్‌పై పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం కోర్టుకు తరలించారు. విచారణ ముగిసిన తర్వాత ఎస్కార్ట్ పోలీసులు వారిని తిరిగి వాహనంలో జైలుకు తరలిస్తుండగా సైదాబాద్ క్రాస్‌రోడ్ సమీపంలోకి రాగానే నరేష్, మల్లెం వంశీ ఒక్కసారిగా ఎస్కార్ట్ పోలీసులను తోసేశారు. డోర్ తీసుకొని పారిపోయేందుకు యత్నించిన వంశీని అడ్డుకోగా, నరేష్ కిందికి దూకి పరారయ్యాడు. వెంటనే ఎస్కార్ట్ పోలీసులు డబీర్‌పురా పోలీసులను అప్రమత్తం చేశారు. కొద్దిసేపటికే నల్లగొండ చౌరస్తా సమీపంలో తమను చూసి దాచుకోవటానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని డబీర్‌పురా పెట్రోలింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎస్కార్ట్ వాహనం నుంచి పరారైన రిమాండ్ ఖైదీ నరేష్ అని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేజారిన ఖైదీ మళ్లీ చిక్కడంతో ఎస్కార్ట్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఖైదీల చేతులకు బేడీలు లేకపోవడమే వారు పారిపోయేందుకు అవకాశం ఏర్పడిందని తెలుస్తోంది. -
లో ప్రెషర్‌తో నగరవాసుల ఇక్కట్లు
సాక్షి,సిటీ బ్యూరో: మహా హైదరాబాద్ పరిధిలో తాగునీటి సరఫరాలో లోప్రెషర్’(తక్కువ పీడనం)పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వేసవి ఉష్ణతాపానికి తాగునీటి అవసరాలు పెరుగుతుండగా, మరోవైపు కొందరు నల్లాలకు అక్రమంగా వి ద్యుత్ మోటార్లు బిగిస్తున్నారు. నీటిని స్పీడ్‌గా లాగేయడం సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగునీటి డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యత దెబ్బతింటోంది. ప్రధాన ప్రాంతాల నుంచి శివారు కాలనీల వరకు ‘లోప్రెషర్’సమస్య వెంటాడుతోంది. ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న కాలనీల చివరి ఇళ్లకు నీరు అందని పరిస్థితి నెలకొంది. అంబర్పేట్, ఖైరతాబాద్, బాలానగర్, ఉప్పల్ కూకట్పల్లి, రాజేంద్రనగర్ పరిధిలోని కొన్ని కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. నీరు సరిగా అందక నగరవాసులు అల్లాడుతున్నారు. అక్రమ మోటార్ల వినియోగం.. నీటి సరఫరా సమయంలో నల్లాలకు నేరుగా ఎలక్ట్రిక్ మోటార్లు బిగించి నీటిని లాగేస్తుండటంతో పక్కన ఉన్న ఇళ్లకు ప్రెషర్ తగ్గి నీరు అందడం లేదు. నగరవ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటి వేల సంఖ్యలో బోర్లు ఎండిపోవడంతో నివాస సముదాయాలు నల్లా నీటి సరఫరాపైనే ఆధారపడుతున్నాయి. సాధారణ గృహ అవసరాలకు వాడే మోటార్లతోపాటు మరింత వేగంగా నీటిని తోడేసేందుకు హై–స్పీడ్, ఆటోమేటిక్ మోటార్లు, కొన్నిచోట్ల వ్యవసాయ రంగానికి చెందిన హై–హార్స్పవర్ (2 హెచ్‌పీ అంతకంటే ఎక్కువ) సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా అక్రమంగా అమర్చుతున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన విజిలెన్స్ జలమండలి విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అక్రమంగా పైపులకు మోటార్లు బిగించేవారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. గత పక్షం రోజుల్లో మెట్రో కస్టమర్ కేర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఽఆధారంగా దాడులు చేయగా పదుల సంఖ్యలో అక్రమ మోటార్ల వ్యవహారం బయటపడింది. రామంతాపూర్ ఉప్పల్, శివనగర్, ఉప్పర్‌పల్లి, ఎస్ఆర్నగర్ తదితర ప్రాంతాల్లో నల్లాలకు అక్రమంగా బిగించిన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో తాగునీటి సరఫరా ఇలా .. (ఎంజీడీల్లో) మొత్తం సరఫరా 582.86 కోర్ సిటీ 221.52 జీహెచ్ఎంసీ 203.33 ఓఆర్ఆర్ 86.74 ట్రాన్స్మిషన్ 49.27 ఆర్డబ్ల్యూఎస్ 22.00 ఎత్తైన ప్రాంతాలకు అందని నీరు మరోవైపు నల్లాలకు అక్రమంగా మోటార్లు రంగంలో దిగిన విజిలెన్స్ బృందాలు -
కథ.. కాంబోడియా నుంచే!
సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిన ఆ దేశం ● టెలిగ్రాం గ్రూపుల ద్వారా నగరంలోని దళారులకు ఎర ● వీరి సాయంతో బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో ప్రతి మూడు సైబర్‌నేరాల్లో రెండు.. కాంబోడియా కేంద్రంగానే సాగుతున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, గతవారం ఆక్టోపస్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కాలంలో నమోదైన సైబర్ నేరాల దర్యాప్తు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కీలక సూత్రధారులు అంతా ఆ దేశంతోపాటు మయన్మార్‌లో ఉంటుండగా.. టెలిగ్రాం గ్రూపుల ద్వారా పాత్రధారులను ఎంపిక చేసుకుని కథ నడిపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, బ్యాంకింగ్ విధానాల్లో లోపాలు సైతం వీరికి కలిసివస్తున్నాయి. ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన 52 మంది నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులే ఉండటం గమనార్హం. ఈ అంశాలను వివరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు హైదరాబాద్ పోలీసులు లేఖ రాస్తున్నారు. బుధవారం వివిధ బ్యాంకుల రీజినల్ హెడ్స్‌తో సమావేశం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే కార్డులు, కాలర్లు... కాంబోడియాలో ఉన్న సూత్రధారులు నగరం నుంచే సిమ్‌కార్డులు, కాల్ సెంటర్లో పనిచేసే టెలీకాలర్లను తీసుకువెళ్తున్నారు. ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుని, కాంబోడియా నుంచే టెలీకాలర్ల ద్వారా ఫోన్లు చేయించి బాధితుల నుంచి నగదు కాజేస్తున్నారు. వీరి నుంచి డబ్బు డిపాజిట్‌కు, ఆ మొత్తం విత్‌డ్రాకు, క్రిప్టో కరెన్సీగా మార్చడానికి వీరికి మ్యూల్ ఖాతాలు అనివార్యం. టెలిగ్రాం గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తూ కమీషన్ ఆశ చూపి ఎంపిక చేసుకుంటున్నారు. బాధితులు ఈ ఖాతాల్లో డిపాజిట్ చేసే డబ్బు నుంచి ఖాతాదారుడు, దళారి తమ కమీషన్లు తీసుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు తరలించేందుకు ప్రత్యేక నెట్వర్క్ పని చేస్తోందని పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ చెప్పడానికి ఇటీవల కాంబోడియాలో అమలులోకి వచ్చిన కొత్త చట్టం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తే పదేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధిస్తారు. అరెస్టు అయిన బ్యాంకు అధికారులు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లకు చెందిన మేనేజ ర్లు, కేవైసీ అప్రూవర్, క్లర్కులు, ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. వీరి పాత్రను వివరిస్తూ ఆయా బ్యాంకులకు పోలీసు అధికారులు లేఖలు రాశారు. -
‘నారీశక్తి వందన్’.. మోదీకి వందనం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చందానగర్: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. గురువారం చందానగర్‌లో నారీశక్తి వందన్ పాదయాత్రను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఓట్ల కోసం మాత్రమే కొన్ని పార్టీలు వాడుకున్నాయని, అమలు చేయడానికి ధైర్యం చూపిన ఏకై క నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. అనంతరం చందానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీహెచ్ఈఎల్ చౌరస్తా వరకు పాదయాత్రలో ఆయన ముందుకు సాగారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజిత్ కుమార్ సేనాపతి, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లంటూ మోసగించి రూ.కోటి కాజేశాడు..
పంజగుట్ట: నెల్లూరుకు చెందిన నవాజ్ అనే వ్యక్తి మతం మారినట్లు బోగస్ సర్టిఫికెట్ చూపించి తనను మోసగించి పెళ్లి చేసుకుని, కోటి రూపాయల వరకు కాజేశాడని ఓ బాధితురాలు (26) ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్‌పల్లికి చెందిన బాధితురాలు మాట్లాడుతూ తాను సాఫ్ట్వేర్ డవలపర్నని, కూకట్‌పల్లిలో తన ఇంటి కింద ఉన్న షాపులో నవాజ్ ట్రేడింగ్ సొల్యూషన్ ఆఫీస్ పెట్టుకుంటానని 2025 మే నెలలో వచ్చి పరిచయం చేసుకున్నాడని తెలిపింది. కొన్ని రోజులకే వివాహం చేసుకుంటానని తన వెంటపడ్డాడని పేర్కొంది. హిందువుగా మతం మారానని బోగస్ సర్టిఫికెట్ చూపించడంతో నమ్మి గత ఏడాది జూలైలో వివాహం చేసుకున్నట్లు చెప్పింది. వివాహమైనరోజే బేగంపేటకు తీసుకువెళ్లి తనకు జ్యూస్‌లో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయాక నవాజ్ సోదరులతో సామూహిక అత్యాచారం చేయించాడని తెలిపింది. శంషాబాద్‌లో ఉన్న తమ ఫ్లాట్ అమ్ముకున్నాడని, తమ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాడని, మొత్తం కోటి రూపాయల వరకు మోసం చేశాడని బాధితురాలు పేర్కొంది. అతనికి అంతకు ముందే రెండు వివాహాలైనట్లు, పిల్లలు కూడా ఉన్నట్లు ఆ తర్వాత తెలిసిందన్నారు. గట్టిగా ప్రశ్నించగా, తన చెల్లిని కూడా ఇలానే గ్యాంగ్ రేప్ చేయిస్తానని, అమ్మను చంపి సహజ మరణంగా చిత్రీకరిస్తానని బెదిరించాడని తెలిపింది. దీంతో తాను కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితునిపై కేసు నమోదైందని పేర్కొంది. సనత్‌నగర్: యువతిని మోసగించిన కేసులో నవాజ్‌తోపాటు అతని సోదరులు ఇస్మాయిల్, లీలాపుద్దీన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న స్నేహితులు షారూక్, మునావర్ల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నవాజ్ తల్లి, ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే రిమాండ్‌లో ఉన్న నవాజ్, ఇస్మాయిల్, లీలాపుద్దీన్‌లను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి తీసుకున్న అనంతరం అన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. బాధితురాలి తల్లి పేరుపై ఉన్న ఇంటిని నవాజ్ వేరొకరికి విక్రయించిన విషయంపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోలీసులు లేఖ రాసినట్లు తెలిసింది. విలేకరుల సమావేశంలోబాధితురాలి ఆవేదన -
వైద్యుల నిర్లక్ష్యమే కారణం
మన్సూరాబాద్: వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడంటూ అతడి బంధువులు, స్నేహితులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. రోగి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బలుపాల గ్రామానికి చెందిన చిక్కా నరేష్(38) కొంతకాలంగా కుంట్లూర్‌లోని నారాయణ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నరేష్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. గుండెలో నొప్పి వస్తోందంటూ అతడు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షించి గుండెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అతడు ఈ నెల 11న శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేరాడు. బుధవారం ఉదయం 8.30 గంటలకు వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించారు. అయితే బుధవారం రాత్రి 9.30 గంటలకు నరేష్ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. కాగా, అనుభవంలేని జూనియర్ డాక్టర్లు శస్త్రచికిత్స చేయడం వల్లే నరేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ అతడి బంధువులు, నారాయణ కాలేజీ సిబ్బంది పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు చేరుకుని ఆందోళన చేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో ఎల్బీనగర్ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని బందోబస్తు చేపట్టారు. అదుపులేని రక్తస్రావం వల్లే.. నరేష్‌కు బెంటాల్ సర్జరీ పూర్తయినప్పటికీ, అదుపులేని రక్తస్రావం తలెత్తడంతో విషాదం జరిగిందని, వైద్యపరంగా ఉత్తమ చికిత్సను అందించామని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం, జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించారనే ఆరోపణలో నిజం లేదని కామినేని హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన -
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మేడ్చల్ రూరల్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 252 జీవోలో..అవసరమైన మేరకు సవరణలు చేసి డీపీఆర్‌ఓలకు పంపిస్తామన్నారు. గురువారం శామీర్‌పేట్‌లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు జారీ చేసే అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, గతంలో కంటే మెరుగైన జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జర్నలిజంతో సంబంధం లేని వారికి అక్రెడిటేషన్లు జారీ కాకుండా యూనియన్ బాధ్యులు జాగ్రత్త వహించాలని సూచించారు. కమిటీ సభ్యులకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సంఘం సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ మాజీద్ పాల్గొన్నారు. -
మోయ‘బడి’...
నాంపల్లి: విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బడిలో పిల్లలు బరువుపనుల్లో నలిగిపోతున్నారు. ఆయాలు, సబార్డినేట్లు చేయాల్సిన పనులను విద్యార్థులకు అప్పగిస్తున్నారు రెడ్‌హిల్స్‌లోని సైఫాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో. ఉపాధ్యాయులే వీరి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వాహనాల్లో వచ్చే ఆహార పదార్థాలను పిల్లలే పాఠశాల లోపలికి మోసుకొస్తున్నారు. అన్నం, గుడ్లు, పప్పు వంటి వాటిని లోనికి తెచ్చుకుని, ఎవరికివారే వడ్డించుకుంటున్నారు.నల్లా దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారి వివరణ.. నాంపల్లి మండల డిప్యూటీ ఈవో వీరలక్ష్మిని వివరణ కోరగా.. ఆ విషయం తన దృష్టికి రాలేదని, త్వరలోనే పాఠశాలను సందర్శించి విచారణ చేపడతానని చెప్పారు. విద్యార్థులతో పాఠశాలలో పనిచేయించడం తప్పేనని, విచారణలో ఆ విషయం తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. -
న్యూరో సర్జరీలో రోబోటిక్ మైక్రోస్కోప్ ప్రారంభం
సనత్‌నగర్: బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ న్యూరో సర్జరీలో అత్యాధునిక జైస్ కినెవో 900 రోబోబోటిక్ మైక్రోస్కోప్‌ను గురువారం ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏవీ గురువారెడ్డి ప్రారంభించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక సాంకేతికతతో క్లిష్టమైన మెదడు, వెన్నెముక శస్త్ర చికిత్సల్లో భద్రత, ఖచ్చితత్వం, మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఇలాంటి ఆధునిక రోబోటిక్ మైక్రోస్కోప్ దేశవ్యాప్తంగా కొద్ది కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా వాస్క్యులర్ న్యూరో సర్జరీతోపాటు ట్యూమర్ ఫ్లోరసెన్స్ –ట్యూమర్ కణజాలాన్ని ఆరోగ్యకరమైన మెదడు కణజాలం నుంచి వేరు చేయడంలో సహాయపడుతుందన్నారు. సీనియర్ కన్సల్టెంట్, న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ నవీన్ మెహ్రోత్రా మాట్లాడుతూ 3డీ, 4కే విజువలైజేషన్‌తో శస్త్ర చికిత్స బృందం మొత్తం ప్రక్రియను అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తించగలదని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సీహెచ్ గోపాల్, మోహన శశాంక్ దివి, డాక్టర్ వినోద్‌కుమార్, డాక్టర్ నివేదిత సాయిచంద్ర తదితరులు పాల్గొన్నారు. బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గురువారెడ్డి -
ఉస్మానియా మెడికో ఆత్మహత్య
మోతాదుకు మించి ఇంజెక్షన్లు ఇచ్చుకుని.. మాత్రలు వేసుకుని..అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆస్పత్రి పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుమార్ (26) బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. సీనియర్లు పెట్టిన పని ఒత్తిడి తట్టుకోలేక తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. కోర్సుపై అతడికి ఆసక్తి లేకపోవడంతో ఒత్తిడికి గురై ప్రాణం తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జడ్చర్లకు చెందిన సురేష్‌కు పీజీ నీట్ ద్వారా ఉస్మానియాలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది. దాదాపు పది నెలల క్రితం కోర్సులో చేరిన అతను ఆఖరి కౌన్సెలింగ్ వరకు కోర్సు మార్చుకోవడానికి ప్రయత్నించారు. మూడు రౌండ్లలోనూ అది సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం కోర్సు మధ్యలో వదిలి వెళ్లాలంటే భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్ గదిలో అచేతనంగా.. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన సురేష్ బుధవారం రాత్రి ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్లు, మాత్రలు వేసుకుని తన హాస్టల్ గదిలో ఉన్నారు. గురువారం ఉదయం ఆయన తల్లి, కుటుంబీకులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఇక్కడ ఉన్న సురేష్ స్నేహితులకు కుటుంబీకులు విషయం తెలిపారు. వాళ్లు వెళ్లి సురేష్ గది తలుపులు తెరిచి చూడగా అచేతనంగా పడి ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సురేష్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. బంధువులు, సహచరుల ఆందోళన.. ఆస్పత్రి వద్ద సురేష్ కుటుంబీకులతో పాటు సహచర విద్యార్థులు నిరసనకు దిగారు. సీనియర్లు అతనితో ఎక్కువ పని గంటలు పని చేయించారని, సుదీర్ఘంగా డ్యూటీలు వేశారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. అతడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు చేయనీయమని అడ్డుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి, పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందించారు. సురేష్ ఆత్మహత్యపై కుటుంబీకులు చేస్తున్న ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకున్నామని, కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు. -
అంతారాలు
ఒకవైపు ఉన్నత వర్గాలు.. మరోవైపు పేదలు సాక్షి, సిటీబ్యూరో నగరం విభిన్న అంశాల సమాహారం. ఏ రంగంలో చూసినా, ఏ అంశంలో చూసినా ఈ విషయమే తేటతెల్లమవుతుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ‘సోషియో– ఎకనమిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే–2024’ సైతం ఇదే అంశాన్ని వెల్లడించింది. నగరంలోని అసమానతలు, ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవని స్పష్టం చేసింది. సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కులాలు, ఆదాయ స్థాయి, నివాస సదుపాయాల విషయంలో స్పష్టమైన అసమానతలు ఉన్నట్టు బయటపడింది. ఒకవైపు అధిక ఆదాయ వర్గాలు, మరోవైపు మౌలిక వసతుల కోసం పోరాడే వర్గాలున్న నగర భిన్న రూపం వెల్లడైంది. సర్వే మేరకు పట్టణ గృహాలు 20,17,409. బీసీల్లో ముస్లిం మైనార్టీలను, మైనార్టీయేతరుల వారీగానూ వివరాలు పొందుపర్చారు. ఎస్సీల గృహాలు 2,19,587, ఎస్టీల గృహాలు 55,017, ముస్లిం మైనార్టీలో బీసీల గృహాలు 3,65,578 ఉన్నాయి. కులాల వారీగా విభజన కులాల వారీగా చూస్తే బీసీలే అధికం. గృహాల పరంగా చూస్తే బీసీలు గృహాలు దాదాపు 29.58% ఉండగా, ఓసీ వర్గాలవి 38.68% ఉన్నాయి. ముస్లిం మైనారిటీలవి 25.40% వాటా కలిగి ఉండటం నగర ప్రత్యేకతను చూపుతోంది. ఎస్సీలు, ఎస్టీల గృహాలు వీరికంటే తక్కుగా ఉన్నాయి. కొన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లలో నివసిస్తుండగా, మరికొన్ని వర్గాలు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నాయి. ఉన్నత వర్గాల్లో ఎక్కువ గదులతో విశాలమైన ఇళ్లు కనిపిస్తుండగా.. వెనుకబడిన వర్గాల్లో ఒకటి లేదా రెండు గదుల ఇళ్లలోనే జీవిస్తున్నాయి. పిల్లలు తక్కువే.. 0–5 ఏళ్ల చిన్నారులు జీహెచ్ఎంసీ జనాభాలో 6.8% మాత్రమే. దీనిని జనన రేటు తగ్గుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నగరంలో పక్కా ఇళ్ల సంఖ్య పెరిగినా, అద్దె ఇళ్లపై ఆధారపడే కుటుంబాలు కూడా గణనీయంగా ఉన్నట్టు సర్వే నివేదిక సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి ఉన్నప్పటికీ, సమాన అవకాశాల విషయంలో ఇంకా పెద్ద సవాళ్లు ఉన్నాయని నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని కులాల యువతలో ఆంగ్ల మాధ్యమ విద్య ఎక్కువగా ఉండగా, మరికొన్ని వర్గాల్లో అది చాలా తక్కువగా ఉంది. కొందరికి సమకూరుతున్న సకల వసతులు మరికొందరి పరిస్థితి జీవన పోరాటం అభివృద్ధితో పాటు అసమానతలు సైతం.. కులాల వారీగా బీసీ జనాభే అధికం నగర పరిస్థితులపై సమగ్ర సర్వేలో వెల్లడి -
శభాష్ రాముడు
అంబర్‌పేట: అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన కరుడుగట్టిన నేరస్తుడు అబ్దుల్ మన్నన్‌ను పట్టించిన ఆర్మీ మాజీ జవాన్ రాముడిని కొత్వాల్ వీసీ సజ్జనర్ గురువారం సన్మానించారు. అంబర్‌పేట ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద మంగళవారం రాముడు బస్సు దిగుతున్నారు. ఆ సమయంలో ఆయన మెడలోని బంగారు గొలుసు లాక్కుపోవడానికి మన్నన్ ప్రయత్నించగా రాముడు ప్రతిఘటించారు. తన వయస్సును కూడా లెక్కచేయకుండా అతడిని ఒడిసిపట్టుకున్నారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న అంబర్‌పేట పెట్రోలింగ్ సిబ్బంది నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని మన్నన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మల్లేపల్లికి చెందిన ఇతడిపై 31 పాత కేసులు ఉన్నాయి. అబ్దుల్ మన్నన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఇతడి అనుచరులు కోటేష్, మల్లేష్ కోసం గాలిస్తున్నారు. రాముడితోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు దినేష్‌రెడ్డి, భరత్ కుమార్‌లను కొత్వాల్ గురువారం బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌కు పిలిపించి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీ సెల్ డీసీపీ సీహెచ్ రూపేష్ పాల్గొన్నారు. కరుడుగట్టిన నేరస్తుడినిపట్టించిన రిటైర్డ్ ఆర్మీ జవాను అభినందించిన సీపీ సజ్జనర్ -
క్రైమ్ కథా చిత్రమ్!
సిటీలో బెంగళూరు పోలీసుల ఆపరేషన్ సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు పోలీసులు నగరంలోని మాదాపూర్, కొండాపూర్‌ల్లో నిర్వహించిన ఆపరేషన్ ఓ ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చింది. అక్కడి సేగెహళ్లికి చెందిన వివాహితను మోసం చేసిన మహేష్ అనే వ్యక్తి దాదాపు కిలో బంగారం కాజేశాడు. ఏడాదిన్నర పాటు సాగిన ఈ క్రైమ్ కథలో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి కూడా నిందితుడు. అతడినీ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్‌లోని పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌పై దాడి చేసిన ప్రత్యేక బృందం మహేష్‌ను అరెస్టు చేసి, రెండు బ్యాంకులు, మరో ఫైనాన్స్ దుకాణం నుంచి రూ.85.6 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది. ఇటీవల జరిగిన ఈ అరెస్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను వదిలి.. మహిళల్ని టార్గెట్ చేసి... నిజామాబాద్‌కు చెందిన పి.మహేష్ వివాహితుడు. కొన్నేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. నగరానికి వచ్చి మాదాపూర్‌లోని ఓ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌లో నివసిస్తూ.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వివాహిత మహిళల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నాడు. వారిని బ్లాక్మెయిల్ చేసి అందినకాడికి దండుకుని విలాసాలకు ఖర్చు చేస్తాడు. ఏడాదిన్నర క్రితం ఇతడికి స్నాప్‌చాట్ ద్వారా బెంగళూరులోని సేగెహళ్లికి చెందిన మహిళతో (32) పరిచయమైంది. ఈమెతో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తనను పూర్తిగా నమ్మిన ఆ వివాహిత నమ్మకాన్ని మహేష్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. బెంగళూరులోని పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లాడు. స్థిరాస్తి వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, నమ్మించి.. ఆమె నుంచి పలు దఫాల్లో దాదాపు కిలో బంగారం తీసుకున్నాడు. ఇందులో కొంత అమ్మేయగా 571 గ్రాముల్ని మాదాపూర్, కొండాపూర్ల్లోని రెండు బ్యాంకులు, ఓ ఫైనాన్స్ దుకాణంలో తాకట్టు పెట్టి జల్సాలకు వినియోగించాడు. భర్త నిలదీయడంతో.. ఇంట్లోని బంగారం కనిపించకపోయేసరికి భర్త నిలదీయడంతో బాధితురాలు మహేష్‌పై ఒత్తిడి చేసింది. వెంటనే ప్లేట్ ఫిరాయించిన అతగాడు తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ విషయాన్ని భర్తకు చెప్పడంతో పాటు మార్ఫింగ్ ఫొటోలు పంపిస్తానని బెదిరించడం మొదలెట్టాడు. ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకువెళ్లింది. ఫిబ్రవరి 10న బెంగళూరులోని ఆర్కేపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఓ ప్రత్యేక బృందం నగరానికి వచ్చిన మహేష్‌ను అరెస్టు చేసి, సొత్తు రికవరీ చేసుకువెళ్లింది. దర్యాప్తులో భాగంగా సదరు మహిళను అనంతపురానికి చెందిన స్వామి అనే యువకుడు ఇలాగే మోసం చేసినట్లు తేలింది. అతడిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు పది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జైలుకు చేరే వరకు మహేష్, స్వామిలకు ఒకరి విషయం మరొకరికి తెలియకపోవడం విశేషం. మాదాపూర్‌లోని పీజీ అకామిడేషన్‌పై దాడి సేగెహళ్లి మహిళను ముంచిన మహేష్ మోసగాడిని అరెస్టు చేసిన ప్రత్యేక బృందం అనంతపురం వాసీ.. కటకటాల్లోకి.. -
ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దాలి
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో నిర్వహిస్తున్న ‘అరైవ్ – అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా బుధవారం టీజీఐసీసీసీ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదంలో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుందని, అలా జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వాహనదారులు భద్రతా నియమాలను ఒక పవిత్రమైన క్రతువులా పాటించాలని సూచించారు. ప్రతి కాలనీ, అపార్ట్మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో ’నో హెల్మెట్ – నో ఎంట్రీ’ బోర్డులను ఏర్పాటు చేసి కఠినంగా అమలు చేయాలన్నారు. స్థానిక ట్రాఫిక్ సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పిస్తోందని, కాబట్టి భయపడకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ రోడ్డు భద్రత పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరితో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అదనపు డీసీపీ రాములు, ఏసీపీలు, ఎస్.హెచ్.ఓలు పెద్ద సంఖ్యలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 400 మంది కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చిన్నారులకు హెల్మెట్ల పంపిణీ అంతకుముందు, ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ’బాలల రహదారి భద్రతా దినం’ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అగ్రసేన్ కూడలిలో సీపీ సజ్జనర్ చిన్నారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే 4 ఏళ్లు పైబడిన పిల్లలందరికీ తప్పనిసరిగా హెల్మెట్ ధరింపజేయాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ -
వారసత్వ సంపదకు నిలయం తెలంగాణ
మంత్రి జూపల్లి కృష్ణారావు గోల్కొండ: అద్భుతమైన చారిత్రక కట్టడాలు వారసత్వ సంపదకు తెలంగాణ నిలయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన గోల్కొండ సమీపంలోని కుతుబ్‌షాహీ టూమ్స్, కఠొరా హౌస్‌తో పాటు ఖజానా బిల్డింగ్, గోల్కొండ కోట బస్టాప్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం గోల్కొండ బడాబజార్లోని ఖజానా బిల్డింగ్ మ్యూజియంను సందర్శించారు. ఖజానా బిల్డింగ్‌లో ఉన్న విలువైన కళాఖండాలను పరిశీలించారు. హైదరాబాద్‌ను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మోహియుద్దీన్, టీజీడీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యాలయ డైరెక్టర్ కె.గణేష్‌రెడ్డి తదితరులున్నారు. కాగా.. మంత్రి జూపల్లి పర్యటనలో చిన్న అపశ్రుతి దొర్లింది. మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. కార్ల వేగం అంతగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. -
రూ.కోట్లల్లో సర్కారు సొమ్ము స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏజన్సీల మాయాజాలం ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. లేని ఉద్యోగులను ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ● ఉస్మానియా ఆసుపత్రిలో ప్రభుత్వం అధికారికంగా నెలకు 787 మంది కార్మికులకు వేతనం చెల్లిస్తోందని, వాస్తవంగా పనిచేస్తున్నది సుమారుగా 400 మంది మాత్రమే ఉంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ● ఆరు నెలల క్రితం సిబ్బంది ఎంత మంది పనిచేస్తున్నారు. వారి వివరాలపై ఆరా తీయగా కొంత మంది ఏక కాలంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిల్లో పనిచేస్తున్నట్లు వెలుగుచూసింది. దీంతో ఏజన్సీలను మందలించి, మరో మారు అలా జరగకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ● అయితే ఈదందా ఇక్కడితో ఆగలేదని తాజాగా మరోమారు తేటతెల్లమైపోయింది. రాష్త్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికుల ఆధార్ కార్డులను శాలరీతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించనపుడు వేలాది మంది రెండు అంత కంటే ఎక్కువ చోట్ల వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ● పేషెంట్ కేర్ కోసం ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మ్యాన్ పవర్‌ను తీసుకుంటున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం ఒక్కో బెడ్‌కు రూ.7,500 చెల్లిస్తోంది. వంద పడకలు ఉన్న ఆసుపత్రిలో 45 మంది సిబ్బందిని నియమించాలని నిబంధనలు పెట్టింది. ● ఇందులో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ విభాగాల్లో సిబ్బంది పనిచేస్తారు. అయితే ఏజన్సీలు ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నట్లు సమాచారం. తప్పుడు నివేదికలతో రూ.కోట్లలో సొమ్ము స్వాహా చేస్తున్నాయన్న ఆరపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమ బాగోతాలు వెలుగు చూస్తాయని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ● పనిచేస్తున్న కార్మికులకు సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని, వేతన చెల్లింపుల్లోనూ కోతలు విధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏజెన్సీల మాయాజాలం ఒకే వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ చోట్ల పని చేస్తున్నట్లు లెక్కలు అక్రమాలపైప్రభుత్వానికి ఫిర్యాదులు -
‘ఏరోస్పేస్’ రంగంలో గత పదేళ్ళలో ఎంతో పురోగతి
చందానగర్: ఏరో స్పేస్ రంగం గత పదేళ్ళ కాలంలో ఎంతో పురోగతి సాధించిందని డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్, ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా(ఏఈఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజబాబు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో రెండు రోజులపాటు నిర్వహించే 74వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సు సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ..ఏరో స్పేస్ రంగంలో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఉత్పత్తి, సర్టిఫికేషన్ అనేవన్నారు. ఈ నెల 17,18 తేదీలలో ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 74వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సును ఎస్కీ క్యాంపస్‌లో నిర్వహిస్తామన్నారు. సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, నీతిఆయోగ్‌కు చెందిన డాక్టర్ వికె సారస్వత్, సీఎస్ఐఆర్ ప్రతినిధి డాక్టర్ ఎన్ కళైసెల్వి, డీఆర్డీఓ మాజీ చైర్మన్డాక్టర్ జి సతీష్‌రెడ్డి, డాక్టర్ ఎస్ సోమనాథ్ వంటి నిష్ణాతులు పాల్గొంటారని ఆయన వివరించారు. – డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్, ఏఈఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజాబాబు -
‘గాంధీ’లో అమర్నాథ్ యాత్ర మెడికల్ సర్టిఫికెట్ల జారీ
ఈ నెల 18న ప్రారంభం.. ప్రతి శుక్రవారం వైద్యపరీక్షలు గాంధీ ఆస్పత్రి: అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా సర్టిఫికెట్లు అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి తెలిపారు. జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు అమర్నాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. యాత్రికులు నిర్దేశిత మెడికల్ బోర్డు నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఫల్మనాలజీ, కార్డియాలజీ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, హారిక, గోపికృష్ణ, శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ యోగేందర్లతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. వివరాలకు గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డు సెక్షన్ (ఎంఆర్డీ)ను సంప్రదించాలి. -
మామూళ్లు వసూలు చేస్తే కఠిన చర్యలు
చార్మినార్: చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ బుధవారం సాయంత్రం చార్మినార్ నడిరోడ్డులో దుకాణదారులు, వీధి వ్యాపారుల సమక్షంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చార్మినార్ కట్టడం ప్రాంగణంలో రోడ్డుపై కూర్చోబెట్టి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. చార్మినార్ పరిసరాల్లో మామూళ్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వారిని పిలిపించి.. ఎలాంటి బెదిరింపులకు పాల్పడవద్దని కఠినంగా హెచ్చరించారు. తమ హెచ్చరికలను లెక్కచేయని వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నామన్నారు. ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపామమన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని.. వినకపోతే..రౌడీ షీట్లు తెరవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు తమతో పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్, చార్మినార్ ఎస్హెచ్ఓ రాంబాబు పాల్గొన్నారు. రౌడీషీటర్లతో చార్మినార్ జోన్ డీసీపీ -
ఇంటర్లో మైనారిటీ గురుకుల విద్యార్థుల ప్రతిభ భేష్
సాక్షి,సిటీబ్యూరో: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గురుకులాల విద్యాసంస్థల సొసైటీల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారని తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల సొసైటీ (టెమ్రీస్) వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ, కార్యదర్శి షఫీ ఉల్లా వెల్లడించారు. బుధవారం టెమ్రీస్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 90 శాతం మంది, ప్రథమ సంవత్సరంలో 81 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో షమీమ్ నిఖత్ (జడ్చర్ల) 470 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో అయేషా బేగం (అసిఫ్ నగర్) 996 మార్కులు, సాధించారన్నారు. టెమ్రీస్ వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ -
నాలుగేళ్లు నిండితే హెల్మెట్ తప్పనిసరి
నగరంలో ‘అరైవ్–అలైవ్’ నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో/విజయ్‌నగర్‌కాలనీ: ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నగర పోలీసు విభాగం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బుధవారం చిన్నారుల భద్రత, దానికి సంబంధించిన నిబంధనలపై నగర వ్యాప్తంగా అవగాహన కల్పించింది. వివిధ పాఠశాలలతో పాటు కూడళ్లలో శిబిరాలు నిర్వహించిన పోలీసులు చిన్నారులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారూ (పిలియన్ రైడర్) కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. తొమ్మిది నెలల నుంచి నాలుగేళ్ల మధ్య ఉన్న చిన్నారులను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాలంటే వారికి సేఫ్టీ హార్నెస్గా పిలిచే బెల్ట్ కచ్చితంగా ఉండాలి. నాలుగేళ్ల పై బడిన వారూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ‘అరైవ్–అలైవ్’లో భాగంగా ఈ విషయాన్ని నగర పోలీసులు ప్రచారం చేశారు. బుధవారం విజయ్‌నగర్‌కాలనీలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్, కలెక్టర్ హరిచందన దాసరి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు 30 హెల్మెట్లు, 200 వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులతో పోలీసులు అరైవ్–అలైవ్ ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లు అందజేశారు. -
తేమంటలు
ఉష్ణ తీవ్రత కంటే తేమ శాతంతోనే ఉక్కపోతసాక్షి, సిటీబ్యూరో గాలిలో తేమశాతం పెరిగితే.. అది ఉష్ణ తీవ్రత కంటే ఎక్కువ ప్రభావం చూపనుందా? ఉక్కపోతకు అసలు ప్రధాన కారణం తేమ శాతమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననే వస్తున్నాయి. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో గాలిలో పెరుగుతున్న తేమశాతంతో అసలు ఉష్ణోగ్రతల కంటే మన శరీరానికి తగిలే వేడి 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉంటోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణతాపానికి ‘ఉక్కపోత’ భరించలేని స్థాయికి చేరుకుంది. బుధవారం గరిష్టంగా 40.6, కనిష్టంగా 27.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా గరిష్ట 40 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ.. పెరిగిన తేమశాతం కారణంగా అది 45 డిగ్రీల పైన ఉన్నట్లు ప్రభావం చూపుతోంది. చెమట పట్టినా అది గాలిలోకి ఆవిరి కాకపోవడంతో శరీరం చల్లబడటం లేదు. దీంతో నగర వాసులు నీరసం, విపరీతమైన ఉక్కపోతకు గురవుతున్నారు. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే నగరంలో ఉష్ణోగ్రతల తీవ్రతతో పాటు ’ఉక్కపోత’ రికార్డు స్థాయిలో 60 నుంచి 70 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడానికి సూర్యరశ్మి మాత్రమే కారణం కాదని, మానవ నిర్మితాలే ప్రధానమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పచ్చదనం కరువై.. వాస్తవంగా నగరం వేగంగా విస్తరించడంతో పచ్చదనం కరువైంది. ఎత్తయిన భవనాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని పీల్చుకుని రాత్రివేళల్లో ఆ వేడిని వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఉపశమనం లభించడం లేదు. మరోవైపు పెరిగిన వాహనాల సంఖ్యతో విడుదలయ్యే కార్బన్ డయాకై ్సడ్ వంటి వాయువులు వేడిని వాతావరణంలోనే బంధిస్తున్నాయి. గదుల లోపల చల్లదనం కోసం వాడే ఏసీలు, బయట వాతావరణంలోకి భారీగా వేడి గాలిని విడుదల చేస్తున్నాయి. ఇది చుట్టుపక్కల ప్రాంతాలను మరింత వేడెక్కిస్తోంది. ఉక్కపోత ఇలా.. మానవ శరీరం అనుభవించే అసలైన వేడిని రెండు పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు. హీట్ ఇండెక్స్ అంటే అనిపించే ఉష్ణోగ్రత (అప్పరెంట్ టెంపరేచర్) అని కూడా అంటారు. గాలి ఉష్ణోగ్రత, గాలిలోని సాపేక్ష ఆర్ద్రత (రిలేటివ్ హ్యూమిడిటీ) రెండింటినీ కలిపి దీనిని లెక్కిస్తారు. ఉదాహరణకు బయట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు ఉండి తేమ 60 శాతం ఉంటే హీట్ ఇండెక్స్ ప్రకారం మన శరీరానికి అది 47 డిగ్రీలుగా అనిపిస్తుంది. గాలిలో తేమశాతం ఇలా ఉంటే.. ఉష్ణోగ్రతల కంటే హీట్ ఇండెక్స్ అధికం అదనంగా 4 నుంచి 5 డిగ్రీల ఎక్కువ వేడి చెమట పట్టినా అది గాలిలోకి ఆవిరి కాని వైనం కాంక్రీట్ జంగిల్ ప్రభావం నిప్పుల కొలిమిని తలపిస్తున్న మహానగరం నగరంలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో) ప్రాంతం గరిష్టం కనిష్టం హైదరాబాద్ 40.6 27.4 హకీంపేట 40.8 25.2 దుండిగల్ 40.6 26.1 హయత్‌నగర్ 40.0 24.6 రాజేంద్రనగర్ 40.0 23.5 పటాన్చెరు 39.4 23.0 -
ఐఎఫ్ఎస్ వర్సెస్ ఐఆర్ఎస్
ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం ● బంజారాహిల్స్ పోలీసుల దర్యాప్తు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో కుక్క పంచాయితీ చివరికి ఠాణాకు చేరింది. బాధిత మహిళా ఐఆర్ఎస్, పోలీసుల మాటల్లోనే పూర్తి వివరాలు.. ‘2016 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి ఎస్పీ సుతన్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్లో విధులు నిర్వర్తిస్తూ.. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఇదే క్వార్టర్స్‌లో ఐఆర్ఎస్ అధికారి నితికాసింగ్ సైతం నివసిస్తున్నారు. సుతన్ క్వార్టర్స్‌లో న్యూసెన్స్ చేసేవారు. రెండు రోజుల క్రితం నితికాసింగ్ క్వార్టర్ వద్దకు వచ్చి హంగామా చేశారు. ఆమె పెంపుడు కుక్క తన ఇంటి వద్ద అపరిశుభ్రతకు కారణమైందని మండిపడ్డాడు. ఇంటి సిబ్బందితో పాటు పెంపుడు కుక్కపై దురుసుగా ప్రవర్తించారు. నితికాసింగ్ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో ఆమె ఇంటి వద్ద పూల కుండీని పగులగొట్టారు. సుతన్ న్యూసెన్స్‌ను తట్టుకోలేక బాధిత ఐఆర్ఎస్ అధికారిణి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుతన్‌పై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 75, 79, 324 (4), 351 (2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం బుధవారం సుతన్ను ఠాణాకు పిలిపించారు. ఆయనకు డ్రగ్ టెస్ట్ చేసి ఇంటి వద్ద విచారణ చేపట్టారు. సుతన్ ప్రవర్తన అసహజంగా ఉండటంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు గతంలో ఆయనను సెలవుపై పంపించినట్లు గుర్తించారు. ఇటీవల చికిత్స చేయించుకుని మళ్లీ విధుల్లో చేరారు. తాజాగా ఆయన మీద కేసు నమోదు కావడంతో అరణ్య భవన్ నుంచి దూలపల్లి అటవీ ప్రాంతానికి మంగళవారం బదిలీ చేశారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన సుతన్ (33) అవివాహితుడని తేలింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు. -
హాయ్ బ్రదర్.. ఎట్లుంది మా హైదరాబాద్?
● విదేశీ పర్యాటకునితో మంత్రి జూపల్లి ముచ్చట ● చౌమొహల్లా ప్యాలెస్‌లో ఆసక్తికర సన్నివేశం సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్‌లో బుధవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్యాలెస్ సందర్శనకు వచ్చిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బ్రిటన్ నుంచి వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు తారసపడ్డారు. దీంతో మంత్రి అతడితో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్ పర్యటన ఎలా సాగుతోందని మంత్రి ఆయనను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఇంకా ఏయే ప్రదేశాలు చూశారని వాకబు చేయగా.. ఇప్పటికే తాము కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించినట్టు ఆ పర్యాటకుడు బదులిచ్చారు. భాగ్యనగర ఆతిథ్యం ఎలా ఉంది? ఇక్కడి వంటకాలు నచ్చాయా? అని మంత్రి వాకబు చేశారు. పర్యాటకుల నుంచి లభించే సలహాలు, సూచనల ఆధారంగా రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల వద్ద సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పేర్కొన్నారు. -
వజ్రాభరణాలు దోచాడు.. చెత్తకుప్పలో దాచాడు
● వాటి ఆచూకీ దొరకవద్దని ఇంటి పని మనిషి పన్నాగం ● రూ.14 లక్షల విలువైన డైమండ్ రింగ్, మరో నగ స్వాధీనం బంజారాహిల్స్: తాను పని చేస్తున్న ఇంట్లో రూ.14 లక్షల విలువైన వజ్రాభరణాలను అపహరించి.. వాటి ఆచూకీ దొరకవద్దనే ఉద్దేశంతో చెత్తకుప్పలో దాచిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డునెంబర్–25లో నివసించే అమీదుల్లాఖాన్, బేగం దంపతుల ఇంట్లో బోరబండ సైట్–3లో ఉంటున్న బిహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్ ముక్యా (32) ఆరు నెలల క్రితం పనిలో చేరాడు. గత నెల 23న యజమాని ఇంట్లోని డైమండ్ రింగ్‌తో పాటు వజ్రాభరణాలు తస్కరించి పరారయ్యాడు. ఆనంద్‌కుమార్‌తో పాటు గుడ్డు అనే ఇద్దరు పని మనుషులపై బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు అనుమానితులను తమదైన శైలిలో విచారించి.. బోరబండలోని ఆనంద్‌కుమార్ గదిలో సోదాలు చేయగా.. ఓ మూలకున్న చెత్త కుప్పలో రూ.14 లక్ష విలువైన డైమండ్ రింగ్‌తో పాటు మరో ఆభరణం పోలీసులకు లభించాయి. వజ్రాభరణాలను తానే చోరీ చేశానని.. తనపై అనుమానంతో పోలీసులు సోదాలు చేస్తే ఆభరణాలు దొరకవద్దనే ఉపాయంతో చెత్త కుప్పలో దాచినట్లు నిందితుడు వెల్లడించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆనంద్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీ బండి.. ఇదిగోనండి
30 జంక్షన్లలో ఏఎన్పీఆర్ కెమెరాలు సాక్షి, సిటీబ్యూరో సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మూడు నెలల క్రితం చోరీ అయింది. బాధితుడి ఫిర్యాదుతో ఠాణాలో కేసు నమోదైంది. చోరీ చేసిన వ్యక్తి ఈ వాహనంపై గోల్కొండలో సంచరించాడు. విషయం పోలీసులకు తెలియకపోవడంతో వాహనం, చోరుడు చిక్కడం అరుదు.. నగరంలో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. చోరీ వాహనాలకు, చోరులకు చెక్ చెప్పడం కోసం నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదేశాల మేరకు ఐటీ సెల్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాజధానిలోని 30 జంక్షన్లలో ఉన్న ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) పరిజ్ఞానంతో పని చేసే సీసీ కెమెరాలను వాడుతున్నారు. ఫలితంగా గడచిన రెండు నెలల్లో 12 చోరీ వాహనాలు దొరికాయి. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటే ఫలితాలు ఉండే అవకాశం ఉంది. నేరగాళ్లకు చెక్ చెప్పడానికే డీసీపీ సీహెచ్ రూపేష్ నేతృత్వంలోని ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంను సిద్ధం చేసింది. దీనికోసం కంట్రోల్ రూమ్‌లో సర్వర్ ఏర్పాటు చేసింది. సీసీటీఎన్ఎస్ డేటాతో అనుసంధానం.. ● సిటీలోని ఠాణాల్లో నమోదైన ఇతర కేసుల మాదిరిగానే వాహన చోరీల వివరాలూ ఎప్పటికప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) అప్డేట్ అవుతాయి. ● ఈ వివరాలను సేకరిస్తున్న ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంతో పని చేసే కెమెరాలు అనుసంధానించి ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఆ చోరీ వాహనంలో సదరు 30 జంక్షన్లలోని ఏ కెమెరా నుంచి ముందుకు వెళ్లినా సర్వర్‌లోని సాఫ్ట్వేర్ తక్షణం గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని పాప్అప్ రూపంలో కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి అందిస్తుంది. ఆ రెండు ఠాణాలకు సమాచారం... ఇలా పాప్అప్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆ వివరాలను వాహనం చోరీపై కేసు నమోదైన, అది సంచరిస్తున్న పరిధిలోని ఠాణాలకు అందిస్తున్నారు. ఈ పోలీసుస్టేషన్లకు చెందిన బృందాలు ఆ వాహనం పదేపదే సంచరిస్తున్న ప్రాంతాల్లో మాటు వేసి పట్టుకుంటున్నారు. ఇలా గడిచిన రెండు నెలల్లో 12 వాహనాలు పట్టుకున్నారు. ఇక్కడ ఓ సమస్య ఉందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో చోరీ వాహనంలో ఓ ప్రాంతంలో సంచరించిన చోరుడు మరోసారి రావడానికి సమయం పట్టవచ్చు. అప్పటికి నిఘా తగ్గి వాహనం దొరికే అవకాశాలు తగ్గుతాయని వివరిస్తున్నారు. ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో.. ఈ సమస్యను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని తీర్చవచ్చని సూచిస్తున్నారు. రోడ్డుపై సంచరిస్తున్న వాహనం ఓ జంక్షన్ దాటిన తర్వాత ముందుకు వెళ్లి మరో జంక్షన్ దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఠాణాలతో పాటు వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో ముందు ఉన్న జంక్షన్లలోని ట్రాఫిక్ సిబ్బందికీ సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో తక్షణం వాహనాన్ని పట్టుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. చోరీ వాహనాలను చోరులు అమాయకులకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు దొరికినా అత్యధిక కేసుల్లో చోరులు మాత్రం చిక్కట్లేదు. ఏఐ ద్వారా జనరేట్ చేసిన వాహనం 2 నెలల్లో దొరికిన 12 తస్కరణ వాహనాలు వీటి సర్వర్‌తో సీసీటీఎన్ఎస్ డేటా అనుసంధానం ‘అపహరణ వాహనాన్ని’ గుర్తించిన వెంటనే పాప్అప్ స్థానిక పోలీసులకు సమాచారమిస్తున్న ఐటీ సెల్ -
గోదాముల్లో అగ్ని కీలలు
జీడిమెట్ల, బహదూర్‌పల్లిలో భారీ ప్రమాదాలు జీడిమెట్ల/జగద్గిరిగుట్ట: నగరంలో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జీడిమెట్లలోని రసాయన గోదాములో ఫ్యాబ్రికేషన్ పరిశ్రమతో పాటు మరో మూడు గోదాముల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జగద్గిరిగుట్ట పరిధిలోని బహదూర్‌పల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామగ్రితో పాటు రెండు వాహనాలు బుగ్గి పాలయ్యాయి. సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని ఏస్వీకో ఆపరేటివ్ సొసైటీలో రాజేష్ అనే వ్యక్తి రసాయన గోదామును నడుపుతున్నాడు. గురువారం ఉదయం 7 గంటలకు గోదాములో రసాయనాలు, సాల్వెంట్లను కలుపుతుండగా మంటలు అంటుకున్నాయి. డ్రమ్ముల్లో రసాయనాలు ఉండటం, దానికి ఆనుకుని ఉన్న మరో రసాయన గోదాములో రసాయనాల నిల్వలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల తాకిడికి రెండు రసాయన గోదాములతో పాటు ఠాగూర్ కెమికల్స్‌కు చెందిన ఆర్ అండ్ డీ ల్యాబ్, ఇస్మాయిల్ అనే వ్యక్తికి చెందిన మెడికల్ వేస్ట్ గోదాము, హనుమాన్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమకు మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న జీడిమెట్ల, సనత్‌నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలిని కుత్బుల్లాపూర్ ఏసీపి బాలగంగిరెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నితిన్‌లు పర్యవేక్షించారు. ప్రమాదం చోటు చేసుకున్న గోదాముల వ్యూ రసాయనాల గోడౌన్లో ఎగిసిపడిన మంటలు కాలిపోయిన డెకరేషన్ ఈవెంట్స్ సామగ్రి దగ్ధమైన ఐదు వాహనాలు బహదూర్‌పల్లిలో రూ.కోటి, జీడిమెట్లలో రూ 30 లక్షల ఆస్తి నష్టం -
నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం..
మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. హెచ్ఐవీ నివారణకు ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా టెస్టులు, స్క్రీనింగ్ నిర్వహిస్తోందన్నారు. ఎయిడ్స్ అంటే ఏమిటి? హెచ్ఐవీ అంటే ఏమిటి? విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. – మాదాపూర్ -
మీటరుకే ముచ్చెమటలు!
గ్రేటర్లో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ కొరత తలెత్తి ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగం పెరిగింది. మరోవైపు బయట ఎండలు భగ్గుమంటున్నాయి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు గిరగిరా తిరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ పరిధి జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే... రోజుకు సగటున 250 మెగావాట్ల పైగా అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా పగటి వేళ ఉండే ఈ పరిస్థితి.. ఉదయం 8 గంటలకే కనిపిస్తుండడం గమనార్హం. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలతో అందరూ ఎలక్ట్రిక్ కుక్కర్లను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు గ్రేటర్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగి 1,86,369కు చేరుకుంది. రికార్డు స్థాయి డిమాండ్‌కు ఇది మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా ఒక్కసారిగా జరగడంతో సబ్స్టేషన్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, వీధుల్లోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో సరఫరాలో తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. డీటీఆర్లు పేలుతున్న ఘటనలూ లేకపోలేదు. తేదీ 2025 2026 01 3563 3919 02 3574 3867 03 3523 3866 04 3469 3826 05 3202 3517 06 3753 3944 07 3768 3933 08 3768 3989 -
ప్రాణాలతో బయటపడిన 45 మంది..
బహదూర్‌పల్లిలోని డెకరేషన్ ఈవెంట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయగిరి కాలనీలో వెంకటేష్ అనే వ్యక్తి ఎస్వీఎన్ పేరిట డెకరేషన్ ఈవెంట్ గోదాం నడుపుతున్నాడు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో గోదాం పక్కనే ఉన్న విద్యుత్ వైర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగాయి. డెకరేషన్ సామగ్రితో పాటు, కారు, టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా.. గోదాముకు ఆనుకొని ఉన్న గోకులం రెసిడెన్సీ భవనం రెండంతస్తుల వరకు మంటలు వ్యాపించి డోర్లు, కిటికీలు కాలి బూడిద అయ్యాయి. భవనంలోని 45 మంది వెనక నుంచి గ్రిల్స్ తొలగించుకొని బయటపడ్డారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాముకు ఎవరో కావాలనే నిప్పు పెట్టారని యజమాని వెంకటేష్ ఆరోపించారు. మంటల్లో డెకరేషన్ ఈవెంట్స్ గోదాం -
ట్రాఫికర్‌కు చెక్
మాసబ్‌ట్యాంక్– షేక్‌పేట్ మధ్య మోడల్ కారిడార్ సాక్షి, సిటీబ్యూరో/గోల్కొండ: మాసబ్‌ట్యాంక్– మెహిదీపట్నం– షేక్‌పేట్ ప్రధాన రహదారిని మోడల్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర సీపీ సజ్జనర్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీరి వెంట ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఉన్నారు. అధికారులంతా బస్సులో ప్రయాణిస్తూ మార్గంమధ్యలోని బాటిల్ నెక్స్, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. ఈ మార్గంలో రోడ్డు దాటే పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తూ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, బృందావన్ కాలనీ రోడ్ నెం.1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్ఓబీ) నిర్మించాలని, షేక్‌పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నానల్ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రేతిబౌలి నుంచి నానల్ నగర్ వరకు ఉన్న సెంట్రల్ మీడియన్‌ను, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఎన్ఎండీసీ, డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్, బొడ్రాయి, షేక్‌పేట్ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు అధికారులను ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేయనున్నారు. మెహిదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ప్రతి జోన్‌కూ రూ.20 కోట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్ పనుల నిమిత్తం ప్రతి జోన్‌కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కేబీఆర్ పార్క్ వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జోనల్ కమిషనర్లు జి.ముకుందరెడ్డి, ప్రియాంక ఆలా, ట్రాఫిక్ డీసీపీ కాజల్, చీఫ్ సిటీ ప్లానర్ కె.శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, అదనపు డీసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి పాల్గొన్నారు. షేక్‌పేట్ బృందావన్ కాలనీ వద్ద మ్యాన్‌హోల్‌ను పరిశీలిస్తున్న సజ్జనర్, కర్ణన్ రోడ్డుతో పాటు అవసరమైన ఐల్యాండ్స్ సైతం విస్తరణ రెండో చోట్ల ఎఫ్‌ఓబీలు, ఒక ప్రాంతంలో పెలికాన్ సిగ్నల్ పోచమ్మబస్తీ నుంచి రోడ్ నెం.12కు స్లిప్ రోడ్డు నిర్మాణం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పోలీసు, బల్దియా కమిషనర్లు -
మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల విజేత అమూల్య
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో జరిగిన మిస్ తెలుగు యూఎస్ఏ–2026 అందాల పోటీల్లో తెలుగు యువతులు సందడిచేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ చార్లెస్ డబ్ల్యూఎస్సీమాన్ సెంటర్లో ఈ పోటీలు సందడిగా జరిగాయి. అల్వాల్‌కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది. తమ కూతురు విజేతగా నిలవడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు శ్రీనివాస్‌రావు, రమలు తెలిపారు. ఇక మహిమ రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ప్రముఖ నటి లయ చేతులమీదుగా టైటిల్ అందుకున్నారు. గతంలో మిస్ ఫ్లోరిడా మెజెస్టిక్, ప్యూర్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో కూడా మహిమ గుర్తింపు పొందారు. కిమ్స్ సన్‌షైన్‌లో స్పైన్ సూట్ టెక్నాలజీ సనత్‌నగర్: స్సైన్ సర్జరీలో అధునాత స్పైన్ నావిగేషన్, హైస్పీడ్ డ్రిల్స్, ఖచ్చితత్వంతో కూడిన సర్జరీ టెక్నాలజీని కిమ్స్ సైన్‌షైన్ హాస్పటల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఏవీ గురువారెడ్డి తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్లో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడుం నొప్పితో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ చేస్తారనే అపోహ వద్దని..అవసరమైన వారికి మాత్రమే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆపరేషన్ చేస్తామన్నారు. వచ్చే వారం నుంచి బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్లో ఉచిత స్కోలియోసిస్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పైన్ సర్జన్ డాక్టర్ ఆంజనేయులురెడ్డి, డాక్టర్ అనాగ్ చక్రవర్తి, డాక్టర్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం సుల్తాన్‌బజార్: హైదరాబాద్ నగరం ఎంతో మంది కుస్తీవీరులను తయారుచేసి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపిందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం కోఠిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్లో అండర్–17 డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒక ప్రణాళిక రూపొందించి కుస్తీ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. అనంతరం అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంతోష్ పహిల్వాన్లు మాట్లాడుతూ... ఈ పోటీల్లో దాదాపు 200 మంది పాల్గొంటున్నారన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 13న జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రెజ్లింగ్ డిస్ట్రిక్ట్ సభ్యులు అస్లాం పహిల్వాన్, ఖాలీద్ పహిల్వాన్ పాల్గొన్నారు. వినూత్న మార్పులకు సదస్సులు దోహదం అంతర్జాతీయ కాంక్రీట్ పేవ్మెంట్ సదస్సు ప్రారంభం సాక్షి,సిటీబ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న మార్పులకు అంతర్జాతీయ సదస్సులు దోహదపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం నగరంలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో 13వ అంతర్జాతీయ కాంక్రీట్ బ్లాక్ పేవ్మెంట్ సదస్సు నరెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాల రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంక్రీట్ బ్లాక్ టెక్నాలజీ కేవలం సౌందర్యం కోసమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.. నిర్మాణ వ్యర్థాల నుంచి సేకరించిన కాంక్రీట్ అగ్రిగేట్లను 50 శాతం వరకు వినియోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను 30 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు వెల్లడించారు. జర్మనీ, ఆస్ట్రియా, బ్రిటన్, కెనడా, అమెరికా వంటి దేశాల ఇంజనీర్లు, పరిశోధకులు, నిపుణులు పాల్గొన్నారు. -
‘నారాయణ అంటేనేచంద్రబాబు బినామీ’
● ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు పంజగుట్ట: తెలంగాణ ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్టులను కొందరు తమ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ఆగ్రహంవ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు ఆంధ్రా కార్పొరేట్లకు బలికావొద్దు అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, సినీ దర్శకుడు సయ్యద్ రఫీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ .. తెలంగాణ వచ్చినా ఇంకా ఆంధ్రా పెత్తనమే నడుస్తోందన్నారు. కురుమ ఆత్మగౌవర భవనాన్ని నారాయణ కాలేజీ యాజమాన్యం లీజుకు తీసుకోవడం దారుణమైన చర్య అన్నారు. నారాయణ అంటేనే చంద్రబాబు బినామీ.. నారాయణ కాలేజీ చేసే అక్రమాలు అన్నీ..ఇన్నీ కాదని, ఈ కాలేజీలను తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో లేకుండా చెయ్యాలని పిలుపునిచ్చారు. నారాయణ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ నుండి తరిమి కొట్టాలని కోరారు. వివిధ కుల సంఘాల నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్, గురునాధ్ కురుమ, శారదగౌడ్, పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్‌లు మాట్లాడారు. -
రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం
గచ్చిబౌలి: కొండాపూర్ ఆస్పత్రిని వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ పేర్కొన్నారు. కొండాపూర్‌లోని జిల్లా స్థాయి ఆస్పత్రిలో గురువారం కూ.40.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణానికి, డయాగ్నస్టిక్స్హబ్కు శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుతో నగరానికి వెళ్ళాల్సిన పనిలేకుండా ఇక్కడే అందుబాటులో వైద్య సేవలు వస్తాయన్నారు. ఈ ఆస్పత్రిలోని 16 విభాగాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సకు అవసరమయ్యే నాణ్యమైన వైద్యం అందించే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రిని పరిశీలించి వైద్యసౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ కొండాపూర్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్‌కు శంకుస్థాపన -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, సిటీబ్యూరో: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, కలెక్టర్ హరి చందన దాసరితో కలిసి కలెక్టరేట్లో సమత కిచెన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా అయన ఆభివర్ణించారు.సమాజంలోని వృద్ధులు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లను ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆర్థిక చేయూత తో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ● రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు సమాజంలో అంతర్భాగమని, వారి గౌరవప్రద జీవనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమత కిచెన్ కు ఎంపీ ల్యాడ్స్ నిధులను తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ● ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో 10 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఈబీసీ, దివ్యాంగుల కోటాను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ నిరంతర సహాయక చర్యలతో పాటు, సమతా కిచెన్ వంటి ఉపాధి ఆధారిత కార్యక్రమాల ద్వారా స్థిరమైన జీవనోపాధిని కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
చైన్ స్నాచర్‌గా మారిన మాజీ సైనికుడు
సికింద్రాబాద్: మాజీ సైనికుడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయీశ్వర్‌గౌడ్ తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా గుడిమెట్టకు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (51) మాజీ సైనికుడు. శ్రీనివాస్‌రెడ్డి నాగారంలో నివాసం ఉంటూ ఘట్కేసర్లోని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. షేర్మార్కెట్లో పెట్టుబడుల ఫలితంగా నష్టపోయాడు. బెట్టింగ్‌లను ఆశ్రయించినా ఆశించిన ఫలితం దక్కలేదు. చివరకు రైలు ప్రయాణాల్లో మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈనెల 2, 3 తేదీల్లో ఉదయం వేళల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే కాకతీయ ఎక్స్‌ప్రెస్‌రైలులో రెండు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఇద్దరు మహిళల మెడలోంచి మంగళసూత్రాలు, బంగారు గొలుసులను లాక్కొని లాలాగూడ, చర్లపల్లి ప్రాంతాల్లో రైలునుంచి దూకి పరారయ్యాడు. ఈనెల 9న మళ్లీ రైలు ఎక్కేందుకు వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు -
అగ్నిప్రమాదంలో షాపింగ్‌మాల్ బుగ్గి
కిస్మత్పూర్ కాళీమందిర్ ప్రాంతంలో ఘటన రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్పూర్ కాళీమందిర్ ప్రాంతంలోని సిద్ధి వినాయక షాపింగ్ మాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు అంతస్తులోని షాపింగ్ మాల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న అత్తాపూర్, లంగర్ హౌస్ ఫైర్‌స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు మూడు గంటలపాటు శ్రమించారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అర్ధరాత్రి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం, ఆ సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదంలో మాల్లోని వస్త్రాలన్నీ బుగ్గి అయ్యాయి. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపారు. సైనికులు, గూఢాచారుల త్యాగాలను ప్రతిబింబించిన దురంధర్: రాంచందర్‌రావు సాక్షి, సిటీబ్యూరో: దేశ రక్షణకు సరిహద్దుల్లో పోరాడే సైనికులే కాకుండా, గూఢచారులు ఎంతటి త్యాగాలు చేస్తారో ధురంధర్–2 సినిమా స్పష్టంగా ప్రతిబింబించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమాను వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, దేశ భద్రత కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటున్న గూఢచారుల నిజ జీవితాన్ని ఈ సినిమా మన కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుందని తెలిపారు. ఈ చిత్రంలో డీమానిటైజేషన్ వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాకుండా, అప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందన్నారు. ఇన్‌స్టాలో పరిచయం.. బాలిక అదృశ్యం మేడిపల్లి: మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ ఫ్రెండ్స్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి బాలిక ఉంటోంది. తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన రాత్రి విధులకు వెళ్లారు. తెల్లవారుజామున వారు ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మణి అనే ఓ వ్యక్తితో తరచూ చాట్ చేస్తున్నట్లు గుర్తించామని, అదృశ్యం వెనుక అతడు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆటో ఢీ కొని వృద్ధురాలి మృతి టిఫిన్ చేసి చెట్టు కింద కూర్చున్న కాసేపటికే ఘటన అల్వాల్: ఆటో ఢీ కొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్‌కు చెందిన కందూరి కనకమ్మ(80) అల్వాల్ వెస్ట్ వెంకటాపురం బ్రిడ్జి వద్ద టిఫిన్ చేసి అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చుంది. కాసేపటికే అటుగా వచ్చిన ఓ ఆటో ఆమెను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 180 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్లో మంగళవారం న్యూ టౌన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 180 మంది ఉద్యోగులు రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకటాచారి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జ్యోతి, లా ఆఫీసర్ శ్రీధర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయలక్ష్మి, డా. చల్లా దేవి పాల్గొన్నారు. కల్తీ నిరోధంపై సీఎం నిర్ణయం హర్షణీయం పంజగుట్ట: ఆహార కల్తీని నియంత్రించేందుకు హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయమని, ఆ పని త్వరగా చేయాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి చైర్మన్ డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణితో కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక విభాగం లేకపోవడం వల్లే ఆహార కల్తీని నియంత్రించలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రతిరోజు ఏదోఒకచోట కుళ్లిన మాంసం, కల్తీ పాలు, సీసంతో ఉన్న పసుపు లాంటివి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విజయ పాలను రైతుల వద్ద సరైన రేటు ఇచ్చి కొనుగోలు చేసి ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. ఆహార కల్తీ అరికట్టేందుకు పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు మామిడి భీమిరెడ్డి, ఎ.వి.రావ్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. మంటల్లో సిద్ధి వినాయక షాపింగ్ మాల్ -
రూ.1,200 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
ఖానామెట్‌లో హైడ్రా స్వాధీనం చేసుకున్న స్థలం గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని సర్వే నంబర్ 55లోని 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. ఐటీ హబ్‌కి అత్యంత చేరువలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలైన మీనాక్షి, వాసవి అధీనంలో ఉన్న 4.20 ఎకరాలతో కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్లను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేశారు. భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1,200 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. -
తెలంగాణ ఉద్యమకారుడు సుల్తాన్ ఆత్మహత్య
– డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో కొంతకాలంగా మనస్తాపం బన్సీలాల్‌పేట్: బన్సీలాల్‌పేట్ బండమైసమ్మనగర్ నివాసి, తెలంగాణ ఉద్యమకారుడు అబ్దుల్ సుల్తాన్(65) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్ కథనం ప్రకారం... సుల్తాన్ భార్య రేష్మా రేషన్ బియ్యం తేవడానికి షాపునకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చి చూసే వరకు ఆయన ఉరేసుకొని ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మంగళవారం రాత్రి బన్సీలాల్‌పేట్‌లో సుల్తాన్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించండి – ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాలు సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణం, టీడీఆర్ దరఖాస్తులకు సంబంధించి జాప్యం లేకుండా నిర్ణీత వ్యవధుల్లో అనుమతులు జారీ చేయాలని ఎంఎంసీ కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశిచారు. మంగళవారం టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమ నిర్మాణాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్‌ఫాత్‌లు, నాలాలపై ఆక్రమణలను వెంటనే తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వీటితోపాటు నివాస కాలనీల్లోని అక్రమ నిర్మాణాలు, సెల్లార్లు, రోడ్లను ఆక్రమించిన ర్యాంపులు, మొక్కలు లేని ప్లాంటర్ బాక్స్‌లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. -
ఎయిర్‌పోర్టులో 14 కిలోల గంజాయి పట్టివేత
శంషాబాద్: బ్యాంకాక్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 14 కిలోల గంజాయిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... థాయ్ ఎయిర్వేస్ టీజీ–329 విమానంలో సోమవారం రాత్రి 12 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సొదా మోసిన్ బహదూర్ అనే ప్రయాణికుడు చేరుకున్నాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 14 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎయిర్పోర్ట్ ఇంటలిజెన్స్, కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం – ఇద్దరి అరెస్ట్.. రెస్క్యూహోమ్‌కు నలుగురు మహిళలు మలక్‌పేట: స్పా సెంటర్ ముసుగులో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రంపై మలక్‌పేట పోలీసులు సోమవారంరాత్రి దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. మలక్‌పేట ఏసీపీ సుబ్బారామిరెడ్డి తెలిపిన వివరాలు.. దిల్సుఖ్నగర్ విద్యుత్‌నగర్‌లో నివాసముంటున్న నిఖిలేష్(27) మూసారంబాగ్ డివిజన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ సర్వీస్ రోడ్లో కొంతకాలంగా డైమాండ్ స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ పోలీస్ సిబ్బందితో దాడి చేసి చిలుకలగూడకు చెందిన పవన్(29), నలుగురు మహిళలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిఖిలేష్, పవన్‌ను అరెస్ట్ చేయగా, మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఎస్ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలు ఛేదించి.. రూ.1.59 కోట్లు రిఫండ్ సాక్షి, సిటీబ్యూరో: నగర సైబర్‌క్రైమ్ పోలీసులు మార్చిలో వివిధ కేసులను ఛేదించి బాధితులకు రూ.1.59 కోట్లు రిఫండ్ చేశారు. దీనికి అదనంగా జోనల్ సైబర్ సెల్స్ మరో రూ.95.99 లక్షలు రిఫండ్ చేశాయి. గత నెలలో సైబర్ ఠాణాలో 54 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, రాజస్థాన్‌ల్లో దాడులు చేసి 20 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, గేమింగ్, జాబ్ తదితర ఫ్రాడ్స్‌లో నిందితులు. గత నెలలో బాధితులు 23 ఆర్థిక సంబంధిత సైబర్ నేరాల్లో రూ.4.40 కోట్లు కోల్పోయారు. సాయిబాబాకు సనాతన ధర్మానికి సంబంధం లేదు – స్వచ్ఛ సనాతన వేదిక పంజగుట్ట: షిరిడీ సాయిబాబాకు సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదని స్వచ్ఛ సనాతన వేదిక పేర్కొంది. శ్రీ షిరిడీ సంస్థాన్ వారు రాసిన సాయిబాబా సత్య చరిత్ర పుస్తకంలోని కొన్ని అంశాలపై ప్రశ్నలు అడిగిన తమపై అక్రమ కేసులు బనాయించి, పరువునష్టం దావా వేయడం ఎంతవరకు సబబని స్వచ్ఛ సనాతన వేదికలోని హిందూ జనశక్తి ప్రతినిధి లలిత్ కుమార్, శివశక్తి ప్రతినిధి కరుణాకర్ సుగుణ, భరత వర్ష ప్రతినిధి శివ, హైందవీ స్వరాజ్ భాస్కర్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చర్చకు తాము సిద్ధమని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ఫొటోలతో షిరిడీ, మహారాష్ట్రల్లో పోస్టర్లు వేయించారని, దాడులు చేయిస్తామని హెచ్చరించారని, ఇది భావప్రకటన స్వేచ్చపై దాడి చెయ్యడమేనని అన్నారు. తల్లి మందలించిందని బాలుడి అదృశ్యం శంషాబాద్ రూరల్: పాఠశాలకు వెళ్లని కొడుకును తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పాల్మాకులకు చెందిన వరికుప్పల అరుణ కొడుకు అనిల్‌కుమార్ స్థానికంగా జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వారం రోజులుగా బడి మానేసి వేరే పిల్లలతో కలిసి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్తున్నాడు. విషయం తెలియడంతో తల్లి అతడిని మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 5న ఉదయం అరుణ పనికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూడగా కొడుకు కనిపించలేదు. అతని కోసం అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘కల్తీ’ కేంద్రాలపై దాడి
మైలార్‌దేవ్‌పల్లి: కల్తీ మసాలాలు, ఉత్పత్తులు తయారు చేస్తున్న రెండు పరిశ్రమలపై హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం, పుడ్ సేఫ్టీ అధికారులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. టాటానగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ఫైన్ ట్రేడర్స్ పేరుతో స్నాక్స్‌ను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నారు. కెమికల్స్ వాడుతున్నారు. గడువు తేదీ ముగిసిన మిర్చి పౌడర్, కలర్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 వేల విలువ చేసే ముడి సరుకును స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో హెచ్పాస్ట్ ఎస్ఐ అఖిల్, మైలార్‌దేవ్‌పల్లి ఎస్ఐ విశ్వనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. కాటేదాన్‌లో... కాటేదాన్ పారిశ్రామికవాడలో సిల్వర్ మసాలా ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమపై దాడులు నిర్వహించారు. ఇక్కడ హానికరమైన రసాయన పదార్ధాలు, నాణ్యతలేని, అపరిశుభ్రమైన పదార్థాలతో మసాలాలు తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి 40 వేల విలువ చేసే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
మ్యాచ్ ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఉచ్చు
ఐపీఎల్ వేళ అప్రమత్తంగా ఉండండి: కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్లో మ్యాచ్ ప్రిడిక్షన్ పేరుతో వల వేస్తున్న కొన్ని సంస్థలు సామాన్యులను ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నాయని నగర సీపీ సజ్జనర్ హెచ్చరించారు. మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఐపీఎల్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో ఆకర్షిస్తున్నారని తెలిపారు. కేవలం డబ్బు కోసం కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? అని ముందే చెబుతామంటూ చానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేయించుకుని, బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారని, ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ చానెళ్ల మాటలు నమ్మవద్దని సజ్జనర్ హితవు పలికారు. నెల రోజుల్లో 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను హైదరాబాద్ సైబర్ క్రైౖ మ్ విభాగం బ్లాక్ చేయించిందని వివరించారు. నిఘా నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
గ్రంథాలయాలకు పూర్వవైభవం రావాలి
– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ గన్‌ఫౌండ్రీ: ప్రస్తుత సాంకేతిక యుగంలో గ్రంథాలయాలకు వెళ్లే పాఠకుల సంఖ్య తగ్గుతోందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో సమాజసేవలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న ప్రముఖ గ్రంథాలయాల అధ్యక్షులను ఘనంగా సత్కరించారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం (రాజమహేంద్రవరం) అధ్యక్షుడు డాక్టర్ ఎ. నారాయణరావు, శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం కార్యదర్శి పి.ఉడయవర్లు, సారస్వత నికేతనం అధ్యక్షుడు మల్లికార్జున్‌రావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, కిన్నెర కార్యదర్శి మద్దాలి రఘురాం తదితరులు పాల్గొన్నారు. -
టీడీఆర్‌లు స్వీకరించండి
– జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సాక్షి, సిటీబ్యూరో: కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించనున్న ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలతో ఆస్తులు కోల్పోయే వారు నష్టపరిహారంగా నగదుకు బదులు టీడీఆర్‌లను స్వచ్ఛందంగా స్వీకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. కేబీఆర్ పరిసరాల్లో చేపడుతున్న ప్రాజెక్టులతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్, ముగ్ధ జంక్షన్లు తదితర ప్రాంతాల్లో ఆస్తులు కోల్పోనున్న వారితో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి సదరు ప్రాజెక్టులు అవసరమని వారికి వివరించారు. రహదారుల విస్తరణ పనుల గురించి సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తులు కోల్పోయేవారు టీడీఆర్‌లను స్వీకరించాల్సిందిగా కోరారు. నగరాభివృద్ధి దృష్ట్యా ప్రజల సహకారం కావాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టూర్ ఠారెత్తే
పశ్చిమాసియా యుద్ధంతో నిలిచిపోయిన పర్యటనలు గ్రేటర్లో 75 శాతం బుకింగ్‌లు రద్దు సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియా యుద్ధం కారణంగా పర్యాటక రంగం కుదేలైంది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులు, విదేశాల నుంచి నగర సందర్శనకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని అనిశ్చితి దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణాలు భారీగా నిలిచిపోయాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 75 శాతం బుకింగ్‌లు రద్దయినట్లు గ్రేటర్‌లోని ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగంలో కోవిడ్ నాటి పరిస్థితులు పునరావృతమైనట్లు చెబుతున్నారు. 3 వేల సంస్థలపై యుద్ధ ప్రభావం.. సాధారణంగా వేసవిలో ఏప్రిల్, మే నెలల్లో నగరం నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సైతం సందర్శిస్తారు. ఈ వేసవి ఆరంభంతోనే యుద్ధం ప్రారంభం కావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పర్యాటక రంగంపై ఆధారపడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 3 వేల సంస్థలపై యుద్ధం ప్రభావం చూపినట్లు సికింద్రాబాద్‌కు చెందిన వాల్మీకి పర్యాటక సంస్థ ప్రతినిధి హరికిషన్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాధారణ రోజుల్లో 20,000 మందికి పైగా విదేశాలకు రాకపోకలు సాగిస్తుండగా, గత నెల రోజులుగా ఆ సంఖ్య 50 శాతానికి పడిపోయినట్లు అంచనా. ఫ్లైట్స్ రద్దయితేనే రీఫండ్.. ప్రస్తుత పరిణాల దృష్ట్యా పశ్చిమాసియా వైపే కాకుండా ఇతర దేశాలకు వెళ్లే వాళ్లు సైతం తమ ప్రయాణాలను రద్దు చేసుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్లు ట్రావెల్స్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ స్వయంగా ఫ్లైట్లను రద్దు చేసినప్పుడు మాత్రమే 100 శాతం టికెట్ డబ్బులు రీఫండ్ అవుతున్నాయి. ప్రయాణికులే టూర్‌ను రద్దు చేసుకుంటే టికెట్ చార్జీల్లో 5 శాతం నుంచి 50 శాతం వరకు పెనాల్టీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు విమానయాన రంగంలో నెలకొన్న అనిశ్చితి వాతావరణాన్ని సొమ్ము చేసుకొనేందుకు ఎయిర్‌లైన్స్ పోటీపడుతున్నాయి. -
ఏసీబీ వలలో ఏజీ వర్సిటీ డీన్
సీడ్స్ కంపెనీ లైసెన్స్ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్ రాజేంద్రనగర్: సీడ్స్ కంపెనీ లైసెన్స్ పేరిట లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డీన్ గోవర్ధన్ మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... సీడ్స్ కంపెనీ అనుమతి కోసం ఓ వ్యక్తి 2025 మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఏప్రిల్‌లో అనుమతులను అందిస్తానని వర్సిటీ డీన్, అసోసియేట్ ప్రొఫెసర్ జి.గోవర్ధన్ ఆ వ్యక్తితో సంప్రదింపులు జరిపాడు. లక్ష రూపాయలు అందిస్తే అనుమతులు మంజూరు చేయిస్తానని చెప్పగా, ఆ వ్యక్తి 25 వేల రూపాయలను ఆన్ లైన్ పేమెంట్ చేశాడు. అనుమతులు మంజూరైన అనంతరం గోవర్ధన్ మిగిలిన డబ్బులు ఇవ్వాలని వేధిస్తుండటంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం సాయంత్రం గోవర్ధన్ తన కార్యాలయంలో డబ్బులను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
‘బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్’ నగరంగా గుర్తింపు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చందానగర్: దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్’ నగరంగా గుర్తింపు పొందిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో ఈపీటీఆర్ఐ, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (హెచ్ఎంఎస్డబ్ల్యూ) సంయుక్తాధ్వర్యంలో ‘అర్బన్ సాలిడ్ వేస్ట్ గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్ అండర్ ఎస్డబ్ల్యూఎం రూల్స్–2026’ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నగరంలో సేకరించే చెత్తను జవహర్‌నగర్‌లో డంపింగ్ చేస్తూ వచ్చామన్నారు. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో కొత్తగా చెత్త డంపింగ్ కోసం ప్రభుత్వం కొత్త ప్రాంతాలను పరిశీలిస్తోందన్నారు. కార్యక్రమంలో రాంకీ సంస్థ చైర్మన్ గౌతం రెడ్డి పాల్గొన్నారు. -
హైదరాబాద్
జేఎన్టీయూకు బాంబు బెదిరింపు – క్షుణ్నంగా తనిఖీ.. ఏమీ లేదని తేల్చిన పోలీసులు బాలానగర్: జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంగళవారం బాంబు బెదిరింపు ఇ–మెయిల్ వచ్చింది. వర్సిటీ అధికారుల సమాచారం మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు, బాంబుస్క్వాడ్ వచ్చి వర్సిటీ పరిపాలన భవనం, హాస్టల్స్, క్యాంపస్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లభించకపోవడంతో ఆచార్యులు, విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు వర్సిటీలో కొంత ఆందోళన వాతావరణం కనిపించింది. అనంతరం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ డీఐ కేఎస్ రవి సైబర్ భద్రత, సైబర్ ముప్పుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ బాంబు బెదిరింపు వదంతిని సృష్టించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరవ్యాప్తంగా హెచ్–న్యూ స్పెషల్ డ్రైవ్ మూడు ఠాణాల పరిధిలో మాటేసి దాడులు ఐదుగురు పెడ్లర్, సబ్ పెడ్లర్ల పట్టివేత రూ.63.65 లక్షల సరుకు స్వాధీనం -
వృత్తులేవైనా.. ప్రవృత్తి ‘డ్రగ్స్’ విక్రయం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్–న్యూ) రెండు రోజులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఐదుగురు డ్రగ్స్ పెడ్లర్లు చిక్కారు. వీరి వృత్తులేమైనా డ్రగ్స్ విక్రయమే ప్రవృత్తిగా మారింది. వీరిని అరెస్టు చేసి రూ.63.65 లక్షల విలువైన ఐదు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ఇన్స్పెక్టర్లు బి.వెంకట్, ఎస్.బాలస్వామిలతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యార్థిపై మూడు కేసులు... బాలానగర్‌కు చెందిన సాయినిఖిల్ యాదవ్ బ్యాక్‌లాగ్స్ ఉండటంతో కొన్నాళ్లుగా ఇంటర్‌లోనే ఉండిపోయాడు. కాలేజీ రోజుల్లో చెడు స్నేహాల వల్ల సరదాగా డ్రగ్స్ వాడటం మొదలెట్టి బానిసగా మారాడు. ఆ ఖర్చుల కోసం తన కాలేజీలో సీనియర్, పెడ్లర్ అయిన ఆదిత్యకు సబ్–పెడ్లర్‌గా మారాడు. ఆరు నెలలుగా ఈ దందా చేస్తున్న ఇతడిపై ఇప్పటికే సనత్‌నగర్, జీడిమెట్లలో రెండు కేసులు ఉన్నాయి. సాయిని చిలకలగూడ పోలీసులతో కలిసి హెచ్–న్యూ బృందం అరెస్టు చేసి, 115 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న ఆదిత్య కోసం గాలిస్తోంది. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి టెలిగ్రాం యాప్ ద్వారా సంప్రదింపులు జరిపే సాయి.. సరుకు డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు తన ఫోన్ కాకుండా వేరే వారిది తీసుకెళ్లేవాడు. ట్రాన్స్పోర్టర్ టు అంతర్రాష్ట్ర పెడ్లర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింహాచలానికి సాయి, సైబు, సిద్ధార్థ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. సూరారంలో ఉంటూ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో గంజాయి, హష్ ఆయిల్‌ను ఒడిశా నుంచి ఆంధ్రాకు చేర్చే ట్రాన్స్‌పోర్టర్‌గా పనిచేశాడు. ఆపై అంతర్రాష్ట్ర పెడ్లర్‌గా మారి రెండు రాష్ట్రాల్లో సబ్–పెడ్లర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫోన్ వాడకుండా నేరుగా హష్ ఆయిల్ తయారీదారులను సంప్రదించి ఖరీదు చేస్తాడు. సంప్రదింపులకు ఇన్‌స్ట్రాగామ్, లావాదేవీలకు యూపీఐ వాడతాడు. ఇతడిపై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన వాలెట్ పార్కింగ్ డ్రైవర్ వేణు ఇదివరకు ఓ కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడ సింహాచలంతో పరిచయమై సబ్–పెడ్లర్‌గా మారాడు. సింహాచల్, వేణులను పోలీసులు అరెస్టు చేసి 1.05 కేజీల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిదీ అదే తరహా కథ... ఇంజాపూర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అక్షయ్ పటేల్ గ్రాడ్యుయేషన్ తర్వాత శానిటరీ వ్యాపారం చేసి నష్టపోయాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి పలు సోషల్‌మీడియా యాప్స్ ద్వారా ఎక్స్టసీ, ఓజీ, ఎల్ఎస్డీ వంటి డ్రగ్స్ ఖరీదు చేస్తాడు. కొరియర్ ద్వారా వచ్చే వీటిని స్థానికంగా ఉన్న సబ్–పెడ్లర్స్‌కు విక్రయిస్తాడు. బైరామల్‌గూడకు చెందిన వ్యాపారి బి.ఆదిత్య వర్థన్ డ్రగ్స్‌కు బానిసగా మారి, డబ్బు కోసం అక్షయ్‌కు సబ్–పెడ్లర్ అవతారమెత్తాడు. ఈ ద్వయాన్ని అరెస్టు చేసిన పోలీసులు 363 ఎక్స్టసీ పిల్స్, 41 గ్రాముల ఓజీ, నాలుగు ఎల్ఎస్డీ బోల్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు ముఠాలకు సంబంధించి ఇప్పటి వరకు 15 మంది కస్టమర్లను గుర్తించారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. -
ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే..
పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకొని.. ● కత్తితో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్య ● ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు గచ్చిబౌలి: ప్రేమించిన యువతితో 16 రోజుల క్రితమే నిశ్చితార్థమైంది. మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మెట్ల వెంకటకృష్ణ శ్రీసాయి (30) నగరంలోని కొండాపూర్‌లో ఉన్న మై హోం మంగళ ‘బి’ బ్లాక్‌లోని 301 ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. స్థానికంగా యానిమేషన్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. మై హోం మంగళలోనే మరో బ్లాక్‌లో ఉండే యువతిని ప్రేమించాడు. మార్చి 22న వైజాగ్‌లో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 12న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో వెంకటకృష్ణ శ్రీసాయి.. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ్ముడు సాయి పవన్‌కల్యాణ్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు మెసేజ్ పెట్టాడు. విషయం తెలిసి.. కాబోయే భార్య వచ్చి ఎంత పిలిచినా డోర్ తెరవలేదు. మరో బ్లాక్‌లో నివాసం ఉంటున్న వెంకటకృష్ణ శ్రీసాయి సోదరుడు పవన్‌తో రూమ్మేట్ విజయ్ కలిసి గది తలుపు పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న యువతి గుండెలవిసేలా విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఫైనాన్స్‌లో రుణం తీసుకొని తిరిగి చెల్లించక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడినట్లు, పెళ్లి ఖర్చులకు ఇబ్బందులెదురయ్యాయని, ఈ క్రమంలోనే వెంకటకృష్ణ శ్రీసాయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
వాటర్ ప్లాంట్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు
● అనుమతులు లేకుండా ప్యాకెట్ల తయారీ ● నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని గుర్తింపుఅంబర్పేట: నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న మూడు వాటర్ ప్లాంట్లపై మంగళవారం సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. అంబర్‌పేట బాపూనగర్‌లో సయ్యద్ జబ్బార్ జేఎన్ ఎంటర్ప్రైజెస్ పేరిట నిర్వహిస్తున్న ప్లాంట్‌లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్యాకెట్లు తయారు చేస్తునట్లు గుర్తించారు. రూ.3 లక్షల విలువైన యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ నయీముద్దీన్ ఆక్వా ఓమెగా వాటర్ ప్లాంట్‌ను కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షలు విలువ చేసే యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంబర్‌పేట ప్రధాన రహదారిలో సయ్యద్ జునైద్ టీఏఐఏ ప్లస్ పేరుతో నీటి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద రూ.3.50 లక్షలు విలువ చేసే ప్యాకింగ్ యంత్రాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్లాంట్ల నుంచి నీటి నమూనాలను సేకరించారు. -
సీఎం ప్రజావాణికి మొర.. డబుల్ బెడ్రూం మంజూరు
లబ్ధిదారులకు పట్టా అందజేసిన చిన్నారెడ్డి లక్డీకాపూల్: సీఎం ప్రజావాణి చొరవతో జనార్దన్–పద్మజ దంపతులకు డబుల్ బెడ్రూమ్ మంజూరైంది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ వేదికగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ ఇంటి పట్టాను సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్స్ సెల్ అధ్యక్షుడు శ్యాంమోహన్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి జిల్లా మద్దూంపల్లికి చెందిన జనార్దన్ నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఖైరతాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల డబుల్ బెడ్రూమ్ కోసం సీఎం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా కూకట్‌పల్లిలోని కై త్లాపూర్‌లో కేటాయిస్తూ మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టర్ మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మంగళవారం జరిగిన 212వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 505 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ సూర్యప్రకాష్, ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రవాసీ ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఫ్లైఓవర్ పనులు వేగిరం
జయేష్ రంజన్ బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు ఫ్లైఓవర్ పనులు మరింత వేగిరం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ ఆదేశించారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డునెంబర్–45 వరకు క్షేత్రస్థాయిలో ఫ్లైఓవర్ పనుల పురోగతిని జయేష్ రంజన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ గురువారం పరిశీలించారు. ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. ఎంఈఐఎల్ (మేఘా) సంస్థ అదనంగా మెషిన్, మ్యాన్‌పవర్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించారు. -
హనుమహాన్
రామ్ లక్ష్మణ్ జానకి.. జై బోలో హనుమాన్‌కీ.. జై.. జై వీరమాన్.. జై బజరంగ్ దళ్.. నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. కాషాయ జెండాలతో కళకళలాడాయి. గురువారం బజరంగ్దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ విజయయాత్ర కన్నుల పండువగా సాగింది. గౌలిగూడ రామమందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో వేలాది మంది భక్తులు సామూహిక హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. కోఠి ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా, సుల్తాన్‌బజార్ చౌరస్తా, రామ్‌కోఠి, కాచిగూడ క్రాస్‌రోడ్, నారాయణగూడ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, బైబిల్ హౌస్, ప్యారడైజ్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయానికి శోభాయాత్ర చేరుకుంది. గౌలిగూడ రాంమందిర్‌లో పోలీస్ కమిషనర్ సజ్జనార్ పూజలు చేశారు. – సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్ -
సింగిల్ రైడర్
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు కారణం వీరేసాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఐటీ హబ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్‌లో చేపట్టిన ఈ సర్వేలో పలు వాస్తవాలు వెల్లడయ్యాయి. అనర్థాలెన్నో.. కేవలం గంట వ్యవధిలోనే రోడ్డుకు నాలుగు వైపులా కలిపి 10,138 మంది సింగిల్ రైడర్లు (వాహనంలో ఒక్కరే ప్రయాణించేవారు) ప్రయాణించగా, డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. డబుల్ రైడర్ల కంటే సింగిల్ రైడర్లు 6,554 అధికంగా ఉండటంతో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగి తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లకు దారితీస్తోంది. సమయం వృథా కావడంతో పాటు అదనపు ఇంధన ఖర్చులు, ప్రమాదాల రిస్క్, శారీరక అలసట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలిసీ.. అధిక శాతం మంది ఒంటరిగా ప్రయాణించడానికే మొగ్గు చూపడం ఆశ్చర్యకరమని, ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, పౌరులు తమ ప్రయాణాల్లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే.. ట్రాఫిక్ రహిత సైబరాబాద్‌ను నిర్మించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసుల ముఖ్య సూచనలివీ ● సాధ్యమైనంత వరకు రైడ్ షేరింగ్ పద్ధతిని పాటించాలి ● సహోద్యోగులు లేదా స్నేహితులతో కలిసి కార్ పూలింగ్ చేయాలి. ● పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని పెంచాలి. ● పీక్ అవర్స్‌లో అత్యవసరమైతే తప్ప వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలి. ● పాఠశాల, కళాశాల వాహనాలు నడిచే రద్దీ సమయాల్లో ప్రయాణించకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి. గంటలో 10,138 వాహనాలపై సింగిల్ రైడర్లు డబుల్ రైడర్లవి 3,584 సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సర్వేలో వెల్లడి -
ఐపీఎల్ డిజిటల్ టికెట్
● 13న రెండోమ్యాచ్ నుంచి అందుబాటు ● భద్రత కట్టుదిట్టం.. సీసీ కెమెరాలతో నిఘా ఉప్పల్: ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌లకు 2 వేల మందిపైగా బలగాలు, 430 సీసీ కెమెరాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీసీపీ కె.సురేష్‌కుమార్ తెలిపారు. హెచ్‌సీఏ, ఎస్ఆర్హెచ్, సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశమై నిబంధనలను వివరించినట్లు పేర్కొన్నారు. డీసీపీ (ట్రాఫిక్) శ్రీనివాసులు, హెచ్‌సీఏ జాయింట్ సెక్రటరీ బస్వరాజ్, ట్రెజరర్ డా.అనిల్‌కుమార్‌తో కలిసి స్టేడియంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండోమ్యాచ్ (ఏప్రిల్ 13) నుంచి డిజిటల్ టికెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఒకరు 4 టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. 5 అంబులెన్స్‌లు, 4 ఫైరింజన్లను సిద్ధం చేశామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని వివరించారు. మహిళల భద్రతకు షీ టీంలను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. బ్లాక్‌లో టికెట్ల అమ్మకం, బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మ్యాచ్ తేదీల్లో మెట్రో రైల్, అర్టీసీ సర్వీసుల సమయాలను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్యాలరీలో ప్రతి సీటుకు నంబరు వేసినట్లు హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. కాగా, ప్రతి సీట్‌కు నంబర్, రెండో మ్యాచ్ నుంచి డిజిటల్ టికెట్లు ఈసారి ప్రత్యేకత. గతంలో 2,800 మంది పోలీస్‌లను కేటాయించగా, ఈసారి 2 వేలకు కుదించారు. 360 సీసీ కెమెరాల సంఖ్యను 430కు పెంచారు. మ్యాచ్ తేదీల్లో ఉప్పల్, సికింద్రాబాద్ నుంచి స్టేడియం వైపు వచ్చే అన్ని దారులను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. -
గ్రిడ్ వైపు అడుగులు
వంద శాతం పైపులైన్ గ్యాస్ సిటీకి సన్నాహాలునగరంలో ప్రస్తుతం పైపులైన్ గ్యాస్ ఇలా..సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ పరిధిలో సిలిండర్ల కొరత, డెలివరీ నిరీక్షణ పెరుగుతుండటంతో పైపులైన్ గ్యాస్ (పీఎన్జీ) వైపు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల విస్తరణతో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు గ్యాస్ గ్రిడ్‌గా మారేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పైపులైన్ వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో ప్రధాన నివాస ప్రాంతాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు చమురు సంస్థలు చర్యలు చేపట్టాయి. తాజాగా వంట గ్యాస్ సంక్షోభంతో పైపులైన్ గ్యాస్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లయింది. స్విచ్ వేస్తే చాలు అన్నంత సులభంగా అందే వంట గ్యాస్‌వైపు నివాసితుల ఆసక్తి పెరిగింది. ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలను అధిగమించడానికి ప్రభుత్వాలు కూడా ‘గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే వందశాతం పైపులైన్ గ్యాస్ సిటీగా మార్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. 250కిపైగా భారీ నివాస సముదాయాల్లో.. నగరంలో పైపులైన్‌న్ గ్యాస్ సరఫరా బాధ్యతలను ప్రధానంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇది గెయిల్, హెచ్‌పీసీఎల్ సంయుక్త భాగస్వామ్యంతో కార్యకలాపాలు సాగిస్తోంది. దీంతో పాటు ఇండియా ఆయిల్ సైతం తన పరిధిని విస్తరిస్తోంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నగరంలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి, మణికొండ వంటి ఐటీ కారిడార్లతో పాటు శంషాబాద్ పరిసరాల్లో సుమారు 250కి పైగా పెద్ద నివాస సముదాయాల్లో పూర్తిస్థాయి గ్రిడ్ నెట్వర్క్ ఉంది. ఇండియన్ ఆయిల్ నగర శివార్లలోని కొత్త వెంచర్లు, అపార్ట్మెంట్లలో వేగంగా ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, మేడ్చల్ కారిడార్ విస్తరిస్తూ కనెక్షన్ల ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. మరికొన్ని ప్రైవేట్ సంస్థలు కొత్తగా వెలుస్తున్న టౌన్‌షిప్‌ల్లో సమీకృత గ్యాస్ గ్రిడ్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. విలాసం కాదు.. అత్యవసరం.. ప్రస్తుతం 80 శాతం కొత్త ప్రాజెక్టులు నేరుగా గ్యాస్ పైపులైన్ సౌకర్యంతోనే నిర్మాణాలు చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ‘నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఆర్డర్ 2026’ ప్రకారం పైపులైన్ పనులకు అనుమతులను సులభతరం చేసింది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు శివారులో కొత్తగా వెలుస్తున్న వెంచర్ల వరకు గ్యాస్ పైపులైన్ గ్రిడ్ విస్తరిస్తోంది. దీంతో హైదరాబాద్ వంటి గ్లోబల్ సిటీలో ’పైప్ గ్యాస్’ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరంగా మారింది. పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో ’సెంట్రలైజ్డ్ గ్యాస్ బ్యాంక్’ల నుంచి నేరుగా పైపులైన్ మోడ్‌కు మారే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. సిలిండర్ల వేట దాటి పీఎన్జీ వైపు మొగ్గు వంటగదికి ‘పైపు ద్వారా గ్యాస్’కు భరోసా విస్తరణకు చమురు సంస్థల సన్నాహాలు సిద్ధమవుతున్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు -
ఐదుగురు యువకుల అరెస్టు
నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై ప్రయాణంలక్డీకాపూల్: ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి అత్యంత ప్రమాదకర రీతిలో ఒకే బైక్‌పై ఐదుగురు ప్రయాణించిన ఘటనలో ఐదుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సైఫాబాద్ ఎస్హెచ్ఓ సీతయ్య తెలిపారు. గత నెల 29 అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు పల్సర్ బైక్‌పై ఐదుగురు వ్యక్తులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. దీంతో వడ్డీ అర్జున్, అరుపు రోహిత్, చింతకుంట అంజన్ కుమార్, సిద్ధం కౌశిక్, వల్లపు మురళిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆహార అలవాట్ల వల్లే పోషకలోపాలు
రాయదుర్గం: మారుతున్న ఆహారపు అలవాట్లు పోషక లోపాలకు దారితీస్తున్నాయని సినీ నిటీ శ్రియా శరణ్ పేర్కొన్నారు. నగరంలోని నాలెడ్జి సిటీలో ఐటీసీ కోహినూర్‌లో శ్రియా శరణ్ గురువారం సందడి చేశారు. భారతదేశపు తొలి పోర్టిఫైడ్ ప్రోటీన్ ప్లస్ మల్టిగ్రేన్ ఆటా ‘మినార్’ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఫోర్టిఫైడ్ ఆహారం ఈ లోపాలను తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలంతా నాణ్యమైన వస్తువులను వినియోగించు కోవాలని సూచించారు. చెఫ్ సంజయ్తుమ్మ, డాక్టర్ ప్రభా అగర్వాల్,సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సినీనటి శ్రియా శరణ్ -
భార్యను హత్య చేసిన మనస్తాపంతో భర్త ఆత్మహత్య
గచ్చిబౌలి: భార్యను హత్య చేసిన ఓ భర్త రిమాండ్ నుంచి వచ్చిన మూడు రోజులకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బావమరిదికి లొకేషన్ షేర్ చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఎస్ఐ జగదీష్ తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కొరిదెనకు చెందిన రారాజు(33) ఇసుక, ఇటుక వ్యాపారం చేస్తున్నాడు. భార్య విజయ లక్ష్మీతో కలిసి మియాపూర్ పీఎస్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్‌లో నివాసం ఉండేవారు. కుటంబ కలహాల నేపథ్యంలో రారాజు మద్యానికి బానిసగా మారి తరచూ భార్యతో గొడవపడేవాడు. గత డిసెంబర్ 23న గొడవ జరగడంతో విజయ లక్ష్మీ మెడ పట్టుకొని ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. విజయ లక్ష్మీ స్పృహతప్పి పడిపోవడంతో కేపీహెచ్‌బీలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. భార్య హత్య కేసులో రిమాండ్‌కు తరలించడంతో కంది జైలులో ఉన్నాడు. బెయిల్‌పై మార్చి 29న జైలు నుంచి విడుదల అయ్యాడు. భార్యను హత్య చేసిన ఘటనలో తీవ్ర మనస్తాపానికి గురైన రారాజు గురువారం సాయంత్రం బావమరిది శ్రీనివాస్ రావుకు ఫోన్ చేసి మీ నాన్న శివరావును తీసుకొని రావాలని ఫొటోలు, లొకేషన్ షేర్చేశాడు. నానక్‌రాంగూడ రోటరీ సమీపంలోని శ్మశానవాటికలో వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించడంతో మృత దేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బావమరిదికి లొకేషన్ షేర్ చేసి బలవన్మరణం రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు -
భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య
చాంద్రాయణగుట్ట: జీవితాంతం కలిసి ఉంటానంటూ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసిన ఆ ఇల్లాలు భర్త చితికి తలకొరివి పెట్టింది. పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన పోకాల్కర్ ప్రకాష్ రాజు గుండెపోటుతో మృతి చెందారు. వారికి నలుగురు కుమార్తెలు. వారికి వివాహాలు కూడా పూర్తయ్యాయి. కుమారులు లేకపోవడంతో నల్లవాగు హిందూ శ్మశాన వాటికలో భార్య పద్మ గురువారం భర్త అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించింది. శంషాబాద్లోపేలిన సిలిండర్లు శంషాబాద్: శంషాబాద్ సర్కిల్లోని సాయినగర్ కాలనీలో కార్మికులు నివాసముంటున్న రేకుల గదుల్లోని మూడు సిలిండర్లు పేలి భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గురువారం కార్మికులంతా రోజువారీలాగే పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఎండవేడిమికి నిప్పంటుకుని ఓ గదిలో సిలిండర్ పేలింది. దాని ప్రభావం పక్కనే ఉన్న గదుల్లోని సిలిండర్లకు వ్యాపించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆర్జీఐఏ పోలీసులు ఫైరింజన్ రప్పించి మంటలు ఆర్పివేయించారు. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మణికొండ: తల్లి పక్కనే నిద్రిస్తున్న ఓ చిన్నారి..తల్లి నిద్రలేచే సరికిఇంటి ముందే ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిపేటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. మహారాష్ట్రకు చెందిన తేజస్ శ్రీకాంత్‌జాదవ్ తన తమ్ముడు, తల్లి, భార్య, 8 నెలల కుమారుడు సౌరబ్ జాదవ్‌తో కలిసి గండిపేట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నారు. బుధవారం శంకర్, తల్లి ఉషతో కలిసి కూలీ పనికి వెల్లాడు. ఇంట్లో ఉన్న భార్య రాధిక.. కుమారుడితో కలిసి మధ్యాహ్నం ఇంట్లో నిద్రించింది. మధ్యాహ్నం 2గంటలకు శంకర్ ఇంటికి వచ్చి అన్నం పెట్టుకుంటుండటంతో శబ్దంతో నిద్ర మేల్కొన్న రాధిక.. కుమారుడు కనిపించకపోవటంతో చుట్టు పక్కల వెతికారు. ఇంటి ముందు నీటి సంప్ తెరచి ఉండటంతో అందులో చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
పారా క్రీడలకు ప్రభుత్వ ప్రాధాన్యత
● తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గన్‌ఫౌండ్రీ: క్రీడల్లో వివక్షకు చోటు లేకుండా దివ్యాంగులు, బధిరుల క్రీడలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. గురువారం ఎల్బీస్టేడియంలో 27వ జాతీయ సీనియర్ డెఫ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబర్చిన బ్యాడ్మింటన్ విజేతలను సన్మానించారు. ఇటీవల చండీఘఢ్లో నిర్వహించిన ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఆఫ్ డెఫ్ అండ్ డంబ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చారు. బ్యాడ్మింటన్ విభాగంలో బి.గోపి అండర్–18 కేటగిరీలో రజత, కాంస్య పతకాలు సాధించగా, అండర్–16 విభాగంలో హాసిని రెడ్డి స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. జీతాలు మీరే చెల్లించండి● ప్రభుత్వాన్ని కోరనున్న కమిషనర్లు ! సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ లోని మూడు కార్పొరేషన్లలో సీఎంసీ పరిస్థితి ఓ మేరకు బాగున్నా, మిగతా రెండు కార్పొరేషన్ల పరిస్థితి దారుణంగా మారింది. ఇక, అన్ని కార్పొరేషన్లకూ మాతృక అయిన జీహెచ్ఎంసీ నెత్తిన వేల కోట్ల అప్పుల భారం ఉంది. ఆ అప్పులు తాము చెల్లించలేమని, ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి వివిధ రూపాల్లో నిధులు రావాల్సి ఉన్నందున వాటిని జీహెచ్ఎంసీకి ఇచ్చే బదులు వాటితో జీహెచ్ఎంసీ అప్పులు చెల్లించాలని ఇప్పటికే కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు మూడు కార్పొరేషన్లకు ఆస్తులు, అప్పుల పంపకాలు పూర్తికాలేదు. ఇదిలా ఉండగా, కార్పొరేషన్ల విభజనతో జీహెచ్ఎంసీకి ఆదాయం వచ్చే సర్కిళ్లు తక్కువ..పనులు చేయాల్సిన సర్కిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎంఎంసీ పరిస్థితి మరోలా ఉంది. ఉన్న మూడు కార్పొరేషన్లలో అత్యల్ప ఆదాయం ఉన్నది దానికే. ఏరియా ఎక్కువే ఉంది. చేయాల్సిన పనులు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి చేసినా చేయకున్నా సిబ్బంది జీతాలు చెల్లింపులు తప్పవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మిగతా స్థానిక సంస్థల మాదిరిగానే మూడు కార్పొరేషన్లలోని సిబ్బందికి కూడా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తే మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. గతంలో జీహెచ్ఎంసీకి ఎక్కువ ఆదాయం ఉన్నందున సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించేది. అదే విధానం కొనసాగుతోంది. అంతే కాదు, వివిధ ప్రాజెక్టులు కూడా పూర్తిచేసింది. కానీ..ప్రస్తుతం పరిస్థితి మారడంతో సిబ్బంది జీతాలు ప్రభుత్వమేచెల్లిస్తే మేలని కమిషనర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. -
నేటి సీఎం ప్రజావాణి వాయిదా
లక్డికాపూల్ : మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం జరగాల్సిన సీఎం ప్రజావాణి కార్యక్రమం 7వ తేదీకి వాయిదా పడింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం ప్రజావాణి నిర్వహించడం లేదని దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఏడవ తేదీ మంగళవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు ‘ఆటిజం’పై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలి ● స్పెషల్ చీఫ్ సెక్రటరి జయేష్ రంజన్ బంజారాహిల్స్: ఆటిజం ఉన్న చిన్నారులను ప్రాథమిక స్థాయిలోనే తల్లిదండ్రులు గుర్తించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర స్పెషల్ చీఫ్‌సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్ఎంసీ కలిసి.. ఆటిజం చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ బోర్డును ఆయన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ప్రారంభించారు. జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఆటిజం చిన్నారులకు అర్థమయ్యేవిధంగా కమ్యూనికేషన్ బోర్డులను పర్యాటక ప్రాంతాలు, పార్కులు, మాల్స్, బహిరంగ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. గ్రేటర్ కమిషనర్ కర్ణన్, కోర్ కిడ్స్ ఫౌండర్స్ డాక్టర్ నవీన, డాక్టర్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. ● ట్యాంక్‌బండ్ శివ దంపతులనుసన్మానించిన జిల్లా కలెక్టర్ సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్ బండ్ శివ సేవా దక్పథం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో శివ దంపతులు మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు.ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పురుషులు, మహిళలు , వృద్ధులు, దాదాపు 140 మందికి పైగా ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన వారిని కాపాడామని.. వారికి జీవిత విలువను చెబుతున్నామని వివరించారు. పలువురి మృతదేహాలు కూడా వెలికితీసి కుటుంబ సభ్యులకు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని సత్కరించారు. -
నెలాఖరులోగా పెండింగ్ పనులు పూర్తి
సాక్షి,సిటీ బ్యూరో : తాగునీరు, సీవరేజీ పనుల నాణ్యతలో జవాబుదారీతనం అవసరమని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో వివిధ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. ప్రతీ రీజియన్ లో ఇద్దరు క్వాలిటీ కంట్రోల్ అధికారులను నియమించి తనీఖీ చేసి, పనుల నాణ్యతపై సర్టిఫికేషన్ అందించే విధంగా నూతన పద్ధతిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో అనుమతులు పొందిన పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. పెండెన్సీ లేకుండా ట్యాంకర్ల డెలివరీ ఈ వేసవిలో ట్యాంకర్ డెలివరీలో పెండెన్సీ లేకుండా చూసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అదేశించారు. మంచినీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. జేఎండీ మయాంక్ మిట్టల్, రీజియన్ల ఈడీలు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్ పాల్గొన్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి -
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
● రూ. 3.61 లక్షల విలువైన సరుకు స్వాధీనం నాగోలు: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎల్బీనగర్ డీసీపీ డాక్టర్ అనురాధ తెలిపిన మేరకు.. టోలిచౌకి చెందిన జునైద్ రజా సిద్ధిఖీ(36), కోల్‌కతాకు చెందిన సునీల్ సుబ్బ అలియస్ జానీ(29)లు స్నేహతులు. వీరికి సన్‌సిటీకి చెందిన అన్నారీకి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ అన్నారీకి సహాయం చేస్తూ డ్రగ్స్ విక్రయించేవారు. బుధవారం సాయంత్రం నాగోలు చౌరస్తాలో ఈ ఇద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, నాగోలు పోలీసులు ఇద్దరినీ అందుపులోకి తీసుకుని వారి ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా 25.65 గ్రాముల నిషేధిత ఎండిఎంఏ డ్రగ్‌ను వారిని నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యకేసులో ఐదుగురి అరెస్ట్
మూసాపేట: తల్లి, ఇద్దరు పిల్లలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు అయిదుమందిని రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన బోడ స్రవంతి (30), బోడ ప్రవీణ్ (32)లు మూసాపేటలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తిక్ (12) కౌశిక్ (10). అయితే స్రవంతిని ప్రవీణ్ చాలాకాలంనుంచి వేధిస్తున్నాడు.ఈ క్రమంలో ప్రవీణ్ తన మేనత్త కూతురు మహేశ్వరిని 2024లో రెండవ వివాహం చేసుకున్నాడు. ఇందుకు ప్రవీణ్ తల్లిదండ్రులు కూడా సహకరించారు. ఇది భరించలేనిస్రవంతి పిల్లలను తీసుకుని తల్లి ఇంటికి వెళ్లి పంచాయితీ పెట్టింది. ఆ తరువాత ప్రవీణ్ పద్ధతిగా ఉంటానని చెప్పడంతో గత నెల 30న మూసాపేటకు వచ్చారు. అదే రోజు రాత్రి ఇద్దరికీ గొడవ జరిగింది. భర్త కొడుతున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడంటూ వాయిస్ రికార్డు చేసి బంధువులకు, అన్నదమ్ములకు మెసేజ్ పంపింది. పిల్లలు కూడా మెసేజ్ పంపారు. అనంతరం స్రవంతి, ఇద్దరు కుమారులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి భర్త ప్రవీణ్, తండ్రి శంకర్ (64), తల్లి మణెమ్మ (48), రెండవ భార్య మహేశ్వరి (23), స్నేహితుడు అనిల్ (28)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకుందా లేదా అందరూ ఒకేసారి వేసుకున్నారా పోస్టుమార్టంలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులు
విజయనగర్‌కాలనీ: అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఓ కేంద్రంపై టప్పాచబుత్ర పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేశారు. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన మేరకు.. సయ్యద్ ఖదీర్ జిర్రాలో చాంద్ బేకరీ నిర్వహిస్తున్నాడు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ..... అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్న బేకరి ఉత్పత్తులు రూ.2.77 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గోల్కొండ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేష్, ఎస్ఐలు అమ్జద్ షరీఫ్, కె.వెంకటరమణ పాల్గొన్నారు. -
పాతకక్షలతో యువకుడిపై దాడి
మైలార్‌దేవ్‌పల్లి: పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై ముగ్గురు కలిసి కత్తులు, గొడ్డలితో దాడిచేశారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన మేరకు.. శాసీ్త్రపురం అదీబా హోటల్ సమీపంలో మహ్మద్ ఫహాద్ (19) కార్మికుడిగా పని చేస్తూ నివాసం ఉంటున్నాడు. శాసీ్త్రపురం బీకేపురానికి చెందిన సయ్యద్ షాబాజ్‌తో ఫహాద్‌కు గొడవ జరిగి ఉంది. ఈ నేపఽఽథ్యంలో షాబాజ్ ఎలాగైనా ఫహాద్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన షానవాజ్ ఖాన్, రిజ్వాన్‌కు తెలిపాడు. గురువారం తెల్లవారుజామున అదీబా హోటల్ సమీపంలో మహ్మద్ ఫహద్ కోసం మాట వేసి ఉన్నారు. ఫహాద్ రాగానే అతడిపై కత్తితో పొడిచి, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బాధితుడి తల వెనుక భాగం భుజంపై గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడికి ఉపయోగించిన గొడ్డలి, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దాడికి పాల్పడ్డ నిందితులు -
రాష్ట్ర బడ్జెట్లో గ్రేటర్ నగరానికి కేటాయింపులు
మహా నగరంపై ‘కోట్ల’ జల్లు కురిసింది. బహుశా.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపించినట్లుగా కనిపించింది శుక్రవారం నాటి పద్దు. ఉపముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ‘రాజధాని’ నగరానికి ప్రాధాన్యమిచ్చారనే చెప్పవచ్చు. అన్ని శాఖలకూ నిధులు నిరాశపర్చని రీతిలోనే పద్దులో పొందుపర్చినట్లు కనిపిస్తోంది. కాకపోతే.. మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనా.. అందుకునుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం గమనించదగిన అంశం. కాగా.. అటు మూసీ నుంచి మొదలుకొంటే.. ఇటు ఫోర్త్ సిటీ.. జలమండలి, మెట్రో, ఎంఎంటీఎస్ రెండో దశ, జలమండలి, ఉస్మానియా, టిమ్స్ ఆస్పత్రులు, నాలుగు పోలీస్ కమిషనరేట్లు, హెచ్ఎండీఏ తదితర శాఖలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కినట్లుగానే అర్థమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో టీ క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) వరకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనా.. అందుకునుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. పూర్వ జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల పరిధితో 150 వార్డులుగా ఉన్నప్పుడు క్యూర్ వరకు కేటాయించిన రూ. 2,654 కోట్లనే ఒక్క రూపాయి కూడా పెంచకుండా.. తగ్గించకుండా పద్దులో ప్రతిపాదించారు. అవే నిధుల కేటాయింపులు వరుసగా ఇది మూడో సంవత్సరం. వాస్తవానికి ఆ మేరకు పనులు కూడా జరగలేదు. బహుశా, అందుకే ఈసారి కూడా అన్ని నిధుల్నే కేటాయించారు. కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఏర్పాటు కావడంతో ప్రభుత్వం వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని కార్పొరేషన్లు భావించాయి. వాటికి కానీ, జీహెచ్ఎంసీకి కానీ ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. క్యూర్ పరిధి వరకు హెచ్–సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కింద మొత్తం రూ.2,654 కోట్లు కేటాయించారు. అంటే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలన్నింటికీ కలిపిన కేటాయింపులు. హెచ్–సిటీ కింద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో పాటు నాలాల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఆర్ఓబీ, ఆర్యూబీ, తదితర పనులుంటాయి. గత సంవత్సరం బడ్జెట్లో హెచ్–సిటీ పనుల కింద రూ.2,654 కోట్లతోపాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ.419 కోట్లు కేటాయించారు. ఈసారి ఎలాంటి గ్రాంట్లు లేవు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు రూ.500 కోట్లను రుణాల రూపంలో కేటాయించింది. వివిధ అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్– శామీర్‌పేట్ వరకు త్వరలో ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 12 నుంచి శిల్పా లేఅవుట్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. పలు చోట్ల రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వీటి కోసం ఈ నిధులను విని యోగించనున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ కోసం జైకా సంస్థ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల దృష్ట్యా మరో రూ.200 కోట్లు కేటాయించారు. మూసీ మురిసేలా.. సీఎం రేవంత్ కలల ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం రూ.1,500 కోట్ల పద్దును ప్రతిపాదించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.400 కోట్లు ఎక్కువ. కొత్త బడ్జెట్లో కేటాయింపులను భూ సమీకరణ, నది చుట్టూ మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ), ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నారు. తొలి దశలో నగరంలో మూసీ ప్రవహించే 55 కి.మీ. మేర నదిని సుందరీకరించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో జోన్–1 కింద మొత్తం 21 కి.మీ. మేర సుందరీకరించనున్నారు. జోన్–1ఏలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ 9.8 కి.మీ., జోన్–1బీ కింద ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.2 కి.మీ వరకు నదికి పునరుజ్జీవం కల్పించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ.. నాలుగు పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.387 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీసు విభాగానికి రూ.310 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ఇటీవల కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు రూ.40 కోట్ల పద్దును ప్రతిపాదించారు. ఇక, సైబరాబాద్‌కు రూ.20 కోట్లు, మల్కాజిగిరికి రూ.17 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కాగా.. గ్రేటర్లో హైదరాబాద్, సైబరాబాద్‌లకు శాశ్వత కమిషనరేట్ భవనాలు ఉండగా.. మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీలకు లేవు. మల్కాజిగిరి కమిషనరేట్ భవనానికి ప్రభుత్వం కేవలం రూ.లక్ష కేటాయించి చేతులు దులుపుకొంది. ఫోర్త్ సిటీ కమిషనరేట్ బిల్డింగ్‌కు రూ.25 కోట్లను ప్రతిపాదించారు. ‘క్యూర్’ పరిధిలో పోలీసులకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చేందుకు ఈ– వెహికిల్స్ కోసం రూ.25 కోట్లు కేటాయించడం గమనార్హం ఎల్బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్‌లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఆస్పత్రులను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించి 5 వేల బెడ్స్ అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫలితంగా లక్షలాది మంది సామాన్య, పేద కుటుంబాలకు ప్రభుత్వ వైద్యం చేరువకానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకంతో హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అత్యధిక శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి నిర్వహణకు భారీగా నిధులు కేటాయించారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి రూ.100 కోట్లు కేటార్చుుంచింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం రూ.600 కోట్లు అందజేయనున్నారు. రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర అవసరాల కోసం హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)కు మరో రూ,500 కోట్లు రుణాల రూపంలో ఇవ్వనున్నారు. ప్రస్తుతం మెట్రో రెండో దశలో భాగంగా పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ.మార్గంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టారు. 850 ఆస్తులకు రూ.600 కోట్లలో మరి కొంతమందికి పరిహారం అందజేయనున్నారు. మెట్రో టేకోవర్ చెల్లింపులపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. రెండో దశలో నగర శివారు ప్రాంతాలను కలుపుతూ ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టారు. అప్పట్లో రూ.850 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ప్రాజెక్టు జాప్యంతో ఇది రూ.1,150 కోట్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం 1/3, రైల్వేశాఖ 1/4 చొప్పున నిధులు అందజేయాలి. ఈ మేరకు ఏటా బడ్జెట్లో ఎంఎంటీఎస్ కోసం కేటాయిస్తున్నారు. నగర శివారులో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్‌సిటీని నేరుగా ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్ పీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ లైన్లు, పర్యవరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలవనుందని ప్రకటించింది. జలమండలి అభివద్ధి పనులు, సుంకిశాల ప్రాజెక్టుకు రూ.3,305 కోట్లు కేటాయించారు. అభివృద్ధి పనులకు తీసుకున్న రుణాల చెల్లింపునకు రూ.1,450 కోట్లు, సుంకిశాల ప్రాజెక్టు రుణం కింద రూ.1000 కోట్లు, నీటి రీయింబర్స్‌మెంట్‌కు రూ. 300 కోట్లు కేటాయించింది. రెండేళ్లుగా బడ్జెట్లో రూ.3,385 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.380 కోట్లు తగ్గించింది. నిధుల కొరతతో సతమతమవుతున్న జలమండలికి కేటాయింపులు నిరాశ కలిగించగా.. మూసీ పునరుజ్జీవానికి కేటాయించిన రూ.1,500 కోట్లు పరోక్షంగా జలమండలి పరిధిలోని సివరేజ్ పనులకు తోడ్పడనుండటం కొంత ఉపశమనం. గ్రేటర్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల ప్రస్తావన తీసుకురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన రహదారుల వెంట గజిబిజిగా, ప్రమాదకరంగా మారిన ఓవర్ హెడ్లైన్ల స్థానంలో కొత్తగా భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేయాలని భావించింది. ఆ మేరకు రూ.1,5000 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచాన వేసింది. మూడు దశల్లో ఈ పనులు చేపట్టాలని భావించినప్పటికీ.. తాజా బడ్జెట్లో పైసా కూడా కేటాయించకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాగా.. గృహజ్యోతి పథకానికి రూ.2080 కోట్లు కేటాయించడంతో గ్రేటర్ జిల్లాల్లో 11.5 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. 3 కార్పొరేషన్లకు రూ.2,654 కోట్లు ‘హెచ్–సిటీ’ సహా క్యూర్ వరకూ.. గత రెండేళ్లుగా ఇదే మాదిరిగా.. మూసీ ః రూ.1,500 కోట్లు మెట్రో రెండో దశకు రూ.600 కోట్లు రుణాల రూపంలో మరో రూ.500 కోట్లు హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు పోలీసులకు రూ.387 కోట్లు ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.50 కోట్లు ఉస్మానియా ఆస్పత్రి భవనానికి రూ.100 కోట్లు జలమండలికి రూ.3,305 కోట్లు ఎఫ్సీడీఏకు రూ.300 కోట్లు -
ఈద్ నమాజ్‌కు వేళాయే
విద్యుద్దీపాల వెలుగులో మక్కా మసీదు.. ప్రార్థనలు చేస్తున్న ముస్లింలునగరంలో ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ముస్లింలు ఈద్ నమాజ్ చేసేందుకు పాతబస్తీ మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదు, మాదన్నపేట ఈద్గా, ఈద్గా ఉజాలే షా, కుత్బుల్లాపూర్, నార్సింగి, ఫస్ట్ లాన్సర్, పహాడీషరీఫ్ ఈద్గాలతో పాటు వివిధ మైదానాలు సిద్ధమయ్యాయి. పాతబస్తీతో పాటు ప్రధాన ఈద్గాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మీర్ ఆలం ఈద్గాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమ్మతుల్ విదా) సందర్బంగా మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ సామూహిక ప్రార్థనలు జరిగాయి. – సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్ -
24 నుంచి ఓయూలో అంతర్జాతీయ సదస్సు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొ.కుమార్, సదస్సు కన్వీనర్ ప్రొ.విజ్జులత తెలిపారు. సదస్సుకు ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు గౌతమి తడిమల్ల హాజరవుతారన్నారు. శుక్రవారం ఓయూ అతిథి గృహాంలో సదస్సు వివరాలను వెల్లడించారు. వర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో 24న ప్రారంభ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. మహిళా శక్తి–సుస్థిరత అనే అంశం జరిగే సదస్సులో దేశ విదేశాలకు చెందిన 250 మంది పరిశోధన పత్రాలను సమర్పిస్తుండగా, 1200 మంది మహిళా ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. రూ.1000 కోట్ల కేటాయింపుపై వీసీ హర్షం ఓయూకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ.1000 కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం పట్ల ఉస్మానియా వీసీ ప్రొ.కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను మంజురు చేశారన్నారు. -
అనుమానంతో వేధించి.. ఆత్మహత్యకు ప్రేరేపించి..
చిలకలగూడ : యువతిని అనుమానంతో వేధించి ఆత్మహత్యకు కారణమైన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితకృష్ణమూర్తి తెలిపిన మేరకు.. కోటేశ్వరరావు కుటుంబం సికింద్రాబాద్ శ్రీనివాసనగర్‌లో నివాసముంటోంది. ఈయన కూతురు జెనిమా (19) ఇంటర్ చదువుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జగదీష్ (22) రాంనగర్‌లోని ఓ బుక్‌షాప్‌లో పనిచేస్తున్నాడు.సోషల్ మీడియా ద్వారా యువతికి పరిచయమయ్యాడు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల జెనిమా ప్రవర్తనపై అనుమానం పెంచుకొని మానసికంగా వేధించసాగాడు. బెదిరించేందుకు యువకుడి ఆత్మహత్యాయత్నం యువతిని బెదిరించేందుకు జగదీష్ ఈనెల 14న కొద్ది మోతాదులో పురుగుల మందు తాగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. మార్చి 17న ఉదయం జెనిమా ఇంటికి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగి వెళ్లిపోయాడు. దీంతో జెనిమా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఉరి వేసుకునేందుకు సీలింగ్ ఫ్యానుకు కట్టిన చున్నీ ఫొటోను జగదీష్ స్నేహితుడు శ్యామ్‌కు వాట్సప్ ద్వారా పంపించింది. శ్యామ్ అందించిన సమాచారం మేరకు జగదీష్‌తోపాటు కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది.గాంధీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో జగదీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నిందితుడు జగదీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతురాలి కాళ్లకు అయితే గాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా అయ్యాయని పోలీసులు తెలిపారు.యువతి ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్ -
ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి
● హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: ‘ఎంతో కష్టపడి చదువుకుని గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పలు శాఖల్లో అధికారులుగా మీరు విధులు నిర్వహించనున్నారు. మీరే మీ విభాగాల్లో ప్రత్యేకతను చాటాలి. అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మీ చర్యలుండాలి. ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పనిచేయాలి. మీ విభాగాల్లో ఎవరికి వారు కొత్త చరిత్రను సృష్టించాలి’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. గ్రూప్–1 కేడర్‌కు ఎంపికై న ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు. సమాజ ప్రయోజనాలు కోరి మంచి చట్టాలు రూపొందించుకున్నాం. అవి పేపరు మీద అన్నీ ఉంటాయి. కానీ, వాటిని అమలు చేయకపోతే ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. -
16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
● రూ.3,200 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ గచ్చిబౌలి: శేరిలింగంపల్లి టీఎన్జీఓకాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హెచ్ఎండీఏ లే అవుట్లో 10 ఎకరాల ముసాయికుంట, నాలుగు ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏరియా, ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన రెండు ఎకరాలు.. ఇలా మొత్తం 16 ఎకరాలు కబ్జా అవుతోందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా.. భూమి విలువ రూ.3,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం భూమిని కాపాడి ఫెన్సింగ్ వేశారు. అనంతరం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. -
‘గాంధీ’కి మరో నాలుగు ఫ్రీజర్ బాక్సులు
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి అదనంగా మరో నాలుగు ఫ్రీజర్ బాక్సులు వచ్చాయి. తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) నుంచి ఇవి గాంధీ మార్చురీకి శుక్రవారం చేరుకున్నాయి. గాంధీ’లో పనిచేయని ఫ్రీజర్లు శీర్షికతో ఇటీవల ‘సాక్షి’ ప్రచురించిన కఽథనానికి వైద్యమంత్రితోపాటు ఉన్నతాధికారులు స్పందించారు. గాంధీ మార్చురీలో 70 మృతదేహాలను భద్రపర్చేందుకు ఫ్రీజరు బాక్సులు ఉండగా, వీటిలో 44 పనిచేయకపోవడంతో కుళ్లిన మృతదేహాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీజర్ల కాల పరిమితి ముగిసిందని, మరమ్మత్తులకు కూడా పనికిరావని ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది.దీంతో స్పందించిన ప్రభుత్వం అదనపు ఫ్రీజర్ బాక్సులు గాంధీ ఆస్పత్రికి పంపింది. -
కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఆక్రమణకు యత్నం
సాక్షి, సిటీబ్యూరో: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ అతిక్రమణ, ఆస్తి నష్టం, ప్రాణహాని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శ్రీనాథ్ స్పిన్నర్స్ మేనేజర్ నగేష్ సుతారి మేడ్చల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నమోదైన ఎఫ్ఐఆర్లోని అంశాల ప్రకారం. మేడ్చల్ ఐడీఏలోని సర్వే నంబరు 859లో 3 ఎకరాలు స్థలం ఉంది. సదరు ఆస్తిపై మేడ్చల్ న్యాయస్థానంలో కేసు ఉంది. ఈ స్థలంలో 2001 నుంచి శ్రీనాథ్ స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలను సాగిస్తున్నామని, ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి 11.40 గంటలకు మంతెన రవి వర్మ రాజు, మంతెన నాగజ్యోతి, రాములు గౌడ్, ఈ సాంబయ్య, ఈ సందీప్ రాజ్, వారి అనుచరులు పథకం ప్రకారం తమ ప్రాంగణంలోకి చొరబడ్డారని నగేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లతో వచ్చి ఫ్యాక్టరీ గేట్లను, ప్రహారీ గోడలను పగులగొట్టి ప్రాంగణంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్నారు. ఆస్తికి నష్టం కలిగించడంతో పాటు మిల్లులో ఉన్న కార్మికులపై దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడిలోకార్మికుడు రంజన్ మల్లిక్‌కు తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత సదరు దుండగులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారన్నారు. జేసీబీ (ఏపీ01పీ131), టిప్పర్ (టీఎస్08యూఎల్2449), ద్విచక్ర వాహనాలు (టీఎస్07ఎఫ్యూ4486, టీజీ153200)లను ఘటనా స్థలంలోనే వదిలేసి వెళ్లారన్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో అగ్ని ప్రమాదం సృష్టించాలనే దురుద్దేశంతో వచ్చినట్లు కనిపిస్తోందని నగేష్ ఆరోపించారు. 2001, 2021, 2022 సంవత్సరాలలో కూడా రాములు గౌడ్, సాంబయ్య, సందీప్ రాజ్‌లు అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశారన్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు తమకు రక్షణకల్పించాలని నగేష్ కోరారు. జేసీబీలు, టిప్పర్లతో అర్ధరాత్రి చొరబడిన దుండగులు మేడ్చల్ ఠాణాలో ఫిర్యాదు చేసిన శ్రీనాథ్ స్పిన్సర్స్ మేనేజర్ నగేష్ -
భూ వివాదంతో మంత్రికి సంబంధం లేదు
మణికొండ: తమ ఉమ్మడి కుటుంబ భూ తగాదాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, ఆయన కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డికి, వారి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. తమకు రావాల్సిన పొలాన్ని కలుపుకుని తమ చిన్నాన్న కుటుంబీకులు ప్రహరీ నిర్మాణం చేసుకుంటూ వివాదం పెద్దది చేస్తున్నారని గండిపేట మండలం వట్టినాగుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 259 యజమానులు అవినవ్షా, అక్షయ్షాలు పేర్కొన్నారు. తమ పొలంలో తిరిగి ప్రహరీ నిర్మిస్తున్నారన్నారని వివరించారు. శుక్రవారం వారు పొలం వద్దే మీడియాతో మాట్లాడారు. వట్టినాగులపల్లి సర్వేనెంబర్ 245, 259,260లలో షా కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములకు 300 ఎకరాల భూమి ఉండేదని, అందులో కొంత భూమి విక్రయించారని.. 40 ఎకరాలు ఓఆర్ఆర్, కోకాపేట ట్రంపెట్ నిర్మాణానికి తీసుకున్నారన్నారు. మిగిలిన 160 ఎకరాల భూమిని అందరం కలిసి 2006లో దక్షిణ్ షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డెవలప్మెంట్కు ఇచ్చామన్నారు. వారు జీవో 111 కారణంతో ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో 2025లో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సర్వేనెంబర్ 260లో ఉన్న 10 ఎకరాలతో పాటు 259లో ఉన్న 3.20 ఎకరాలను న్యూజెమ్ సంస్థకు డెవలప్మెంట్కు ఇచ్చామన్నారు. 259 సర్వే నెంబర్లోని 3.20 ఎకరాల భూమి విషయంలోనే వివాదం ఉందని, అందులో తమకు భూమి ఉందని తాము, లేదని తమ చిన్నాన్న సతీష్షాల మధ్య వివాదం నడుస్తోందన్నారు. తమ భూమిని 2025లో ఏడీ సర్వే నిర్వహించి వారు చూపించిన హద్దులను తమ చిన్నాన్న సతీష్షా అంగీకరించటం లేద న్నారు. ఈ వివాదంలోకి మంత్రిని ఎందుకు లాగుతున్నారనే విషయం తమకు తెలియద న్నారు. ఇదిలా ఉండగా మొత్తం భూమి తమ పేర్లపై 40 సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్ అయిందని, అయినా తమకు భూమి ఉందని తమ దాయాదులు వస్తున్నారని మరో భూ యజమాని పల్లవిషా అన్నారు. రెవెన్యూ అధికారులే పరిష్కరించాలి వట్టినాగులపల్లి భూ యజమానులు అవినవ్ షా, అక్షయషా -
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
గన్‌ఫౌండ్రీ: కూచిపూడి, భరతనాట్య, జానపద నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా మాట్లాడుతూ.. పండుగల ప్రాముఖ్యత, విలువలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు నాట్య గురువులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సినీ నటుడు పృథ్వీ, వ్యాపారవేత్త ఎస్. రాజా, సంస్థ వ్యవస్థాపకులు లయన్ కేవీ రమణారావు పాల్గొన్నారు. -
అక్రమ సిలిండర్
● 1,073కు పైగా సిలిండర్లు సీజ్ ● ఒక వినియోగదారుకు ఒకటే కనెక్షన్ ● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● రంగంలోకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ గ్రేటర్లో ‘ఎల్పీజీ’పై మెరుపు దాడులు సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో గ్యాస్ సిలిండర్ల అక్రమ చలామణిపై పౌరసరఫరాల శాఖ సీరియస్‌గా దృష్టి పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో కొన్ని రోజులుగా తనిఖీలు ముమ్మరం చేసింది. గృహావసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్న ముఠాల గుట్టు రట్టు చేస్తోంది. మరోవైపు హోటళ్లలో సరైన పత్రాలు లేని అక్రమ ఖాళీ వాణిజ్య సిలిండర్లపై సైతం కొరడా ఝుళిపిస్తోంది. శ్రీనగర్ కాలనీ, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, చార్మినార్, జియాగూడ, అబిడ్స్, నార్సింగి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, బాలానగర్, షాపూర్‌నగర్, సూరారం, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై దాడులు జరిపి సుమారు 1,073కుపైగా సిలిండర్లను సీజ్ చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద 308కి పైగా కేసులు నమోదు చేసింది. రీఫిల్లింగ్ చేస్తున్న కమర్శియల్, చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకుంది. నిబంధనలు కఠినతరం.. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. ఒక వినియోగదారుడికిఒకే కనెక్షన్్ మాత్రమే ఉండాలి. ఒకే పేరు మీద వేర్వేరు కంపెనీల కనెక్షన్లు ఉండటం నిబంధనలకు విరుద్ధం. అలాంటి కనెక్షన్లను తక్షణమే గుర్తించి బ్లాక్ చేస్తున్నారు. మరోవైపు పైపులైన్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు పాత ఎల్పీజీ కనెక్షన్‌ను వెంటనే సరెండర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే (పైప్డ్ గ్యాస్) వాడుతున్న వారు సుమారు 20 వేలకు పైగా తమ పాత కనెక్షన్లను సరెండర్ చేయలేదని గుర్తించారు. అక్రమ ఖాళీ సిలిండర్లున్నా సీజ్ హోటళ్లు, హాస్టళ్లలో గృహ వినియోగ సిలిండర్ల వినియోగం చట్టరీత్యా నేరం. తనిఖీ సమయంలో ఇతర కంపెనీలకు చెందిన ఖాళీ సిలిండర్లు కనిపించినా, వాటికి సరైన ఆధారాలు చూపకపోతే అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. హోటల్ కిచెన్లలో కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఉండాలని, డొమెస్టిక్ సిలిండర్లు లభ్యమైతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? హోటల్ యజమానులు ప్రభుత్వ చర్యలపై హోటల్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని వారు వాపోతున్నారు. ఈ తరుణంలో అధికారులు దాడులు చేస్తూ సిలిండర్లను సీజ్ చేయడం వల్ల వ్యాపారాలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో సిలిండర్ల దందాను అరికట్టేందుకు, సామాన్య గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో దాడులు ఇలా.. జిల్లా సిలిండర్ల కేసులు సీజ్ హైదరాబాద్ 643 233 రంగారెడ్డి 250 45 మేడ్చల్–మల్కాజిగిరి 180 30 -
ఆర్జీఐఏ సిబ్బంది ఉత్తమ సేవలకు మరోసారి అవార్డు
శంషాబాద్: విమానాశ్రయంలో సిబ్బంది అందించే ఉత్తమ సేవలకు గాను ఆర్జీఐఏ మరోసారి అవార్డును దక్కించుకుంది. ‘స్కైట్రాక్’ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల ద్వారా చెక్ ఇన్, భద్రత, ఇమిగ్రేషన్ తదితర అంశాల్లో ప్రయాణికుల అనుభవాన్ని క్రోడీకరించి ఈ అవార్డును అందజేస్తారు. ఈ మేరకు 2026 ‘బెస్ట్ ఎయిర్‌పోర్టు స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఏషియా ’ అవార్డును లండన్‌లో నిర్వహించిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పోలో అందజేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆర్జీఐఏ ప్రయాణంలో ఈ అవార్డును అందుకోవడం ఐదోసారి అని తెలిపారు. -
ఊహల పల్లకిలో..
● రాష్ట్ర బడ్జెట్‌పై జలమండలి భారీ ఆశలు ● క్యూర్ వాటర్, సీవరేజీ మాస్టర్ ప్లాన్ ● కేటాయింపులు సరే.. నిధుల విడుదల అంతంతే ఇస్తారా రూ.6,500 కోట్లు! మురిపించేనా.. ఉసూరుమనిపించేనా? రాష్ట్ర ప్రభుత్వం కరుణిస్తేనే మూడు కార్పొరేషన్ల మనుగడ సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీర్చే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు (జలమండలి) రాష్ట్ర బడ్జెట్– 2026–2027పై ఆశలు పెట్టుకుంది. జలమండలి పరిధి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్ )వరకు విస్తరించడంతో బాధ్యతలు రెట్టింపయ్యాయి. దీంతో ఈసారి అవసరమైన నిధుల కోసం బడ్జెట్లో ప్రధానంగా నాలుగైదు అంశాలపై దృష్టి సారించి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. క్యూర్ వాటర్, సీవరేజ్ మాస్టర్ ప్లాన్లు, గోదావరి ఫేజ్–2, 3, సుంకిశాల ఇన్‌టెక్ వెల్, ఎస్టీపీల నిర్మాణ పనులకు నిధులు అవశ్యమని భావిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జలమండలి రూ.6,500 కోట్ల వరకు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అందులో ప్రస్తుతం పెరిగిన అవసరాల దృష్ట్యా ఈసారి రూ.5వేల కోట్ల వరకు నిధులు కేటాయింపు ఉండవచ్చని జలమండలి భావిస్తోంది. సీవరేజ్ పనులకు ‘బూస్ట్‘ లభించేనా? సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవ పథకానికి అనుబంధంగా సీవరేజ్ పనులకు ఈ బడ్జెట్లో ‘బూస్ట్‘ లభించే అవకాశం ఉనట్లు తెలుస్తోంది, నగరం చుట్టూ మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మూసీ ప్రక్షాళనకు ఊతమివ్వచ్చని జలమండలి ఆశిస్తోంది. గత మూడేళ్లలో బడ్జెట్ కేటాయింపులు భారీగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో నిధుల విడుదల ఆశించిన స్థాయిలో లేకుండాపోయింది. గతంలో కేటాయించిన నిధుల్లో దాదాపు 40 నుంచి 50 శాతం వరకే సకాలంలో విడుదలవుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌పై క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు భారీ ఆశలే పెట్టుకున్నాయి. క్యూర్ పరిధిలోని 27 స్థానిక సంస్థల్నీ దృష్టిలో ఉంచుకొని గత జనవరి 31 జరిగిన పాలకమండలి సమావేశంలో రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు ఇస్తారనే నమ్మకంతోనే ఆమోదం తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల అంచనాతోనే ఆ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. పాత జీహెచ్ఎంసీ పరిధి వరకు రూ.9,200 కోట్లు, విలీనమైన 27 స్థానిక సంస్థల పరిధిలో పనులకు రూ.2,260 కోట్లతో, మొత్తం రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. హెచ్– సిటీ ప్రాజెక్ట్ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు తదితర నిర్మాణాల కోసం, రూ.7,032 కోట్లు.. 7.60 లక్షల వీధిదీపాలకు రూ.1,341.60 కోట్లు, సీఆర్ఎంపీ కింద 1045 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణకు రూ.3,145 కోట్ల పనులకు ప్రభుత్వం పాలనపరమైన ఆమోదం తెలిపినప్పటికీ నిధులు కావాల్సి ఉంది. ఇవి దీర్ఘకాలిక పనులు కావడంతో ఏడాది కాలానికై నా రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.3,100 కోట్లు అందవచ్చనే ఆశతోనే బడ్జెట్‌ను ఆమోదించారు. మారిన నగర ముఖ చిత్రం.. మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కాకముందే, విలీనమైన 27 స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని, ఒకే కార్పొరేషన్‌గా ఆ బడ్జెట్‌ను ఆమోదించారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైనందున మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులవసరం. రెండు కొత్త కార్పొరేషన్లు తమకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను రూపొందించుకోవాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధి మారినందున దాని బడ్జెట్‌నూ సవరించాల్సి ఉంటుంది మూడు కార్పొరేషన్లుగా రూపాంతరం చెందకముందు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.400 కోట్లు గ్రాంట్స్, క్యాపిటల్ గ్రాంట్స్‌గా రూ.3,100 కోట్లు ఇవ్వగలదని భావించారు. కానీ కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో నగర ముఖచిత్రమే మారినందున మరిన్ని నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందన్నది చూడాలి. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించనిదే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు మనుగడ సాగించలేని పరిస్థితి. గత మూడేళ్లలో ఇలా.. ఆర్థిక సంవత్సరం ప్రతిపాదన బడ్జెట్ కేటాయింపు (రూ. కోట్లలో) 2025-2026 5,500 3,385 2024-2025 5,650 3,385 2023-2024 5,937 1,960 -
మూగబంధం.. ప్రాణప్రదం
పెంపుడు జంతువులపై ఎనలేని మమకారంనగర శివారు మీర్పేట్ పరిధి వెంకటాద్రి కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని హిమబిందుకు పెట్స్ అంటే ప్రాణం. బంధువుల నుంచి మూడు పిల్లులను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. కుటుంబ సభ్యుల కంటే ఆమెకు మార్జాలంపైనే మక్కువ. అంతలా ప్రేమించే పిల్లి ఇటీవల రోడ్డుపై మృతి చెంది కనిపించింది. షాక్‌కు గురైన హిమబిందు మానసిక ఒత్తిడికి గురైంది. గురువారం బెడ్రూంలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది ● వనస్థలిపురానికి చెందిన శాంభవి దేవి మగ పెర్షియన్ పిల్లిని పెంచుకుంటోంది. ఇటీవల అది అనారోగ్యం బారిన పడటంతో పెట్ క్లినిక్‌కు తీసుకెళ్లింది. డాక్టర్ పరీక్షించి మూడుసార్లు సర్జరీలు చేశాడు. అయినా.. పిల్లి ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో శాంభవి కుంగిపోయింది. మళ్లీ డాక్టర్ సంప్రదించగా.. అసభ్యకర పదజాలంతో దూషించాడని చైతన్యపురి ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది. ఇలా.. పిల్లులు, శునకాలు, కుందేళ్లు, పావురాలు, చిలుకలు.. కావేవీ అనుబంధాలకు అనర్హం అన్నట్టుగా మారింది నగరంలోని ప్రస్తుతం పెట్ లవర్స్ పరిస్థితి. మానవ సంబంధాల కంటే పెంపుడు జంతువుల పైనే మమకారం పెంచుకుంటున్నారు. జంతువుల మీద ప్రేమలు, ఆప్యాయతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రేమగా పెంచుకునే పెట్స్ అనారోగ్యానికి గురైనా హైరానా పడిపోతున్నారు. మానసిక ఒత్తిడి, భావోద్వేగాలకు గురవుతున్నారు. ఇక, అల్లారుముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు మరణిస్తే.. తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్య చేసుకునే స్థాయికి బంధాలు చేరాయి. – సాక్షి, సిటీబ్యూరో బంధాల కోసం వెతుకులాట.. మానవ సంబంధాలు దారి మళ్లుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ప్రైవసీ.. కారణాలమైనా మహా నగరంలో అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. ఆప్యాయంగా పలకరించే వాళ్లే కరువైపోయారు. దీంతో అనుబంధాలను ఎతుక్కునే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే పెంపుడు జంతువులతోనే మమకారం పెనవేసుకుంటోంది. ఇంట్లో మాట్లాడేవాళ్లే లేకపోవడంతో పెట్స్‌తోనే జీవితం గడిపే పరిస్థితి ఏర్పడింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న అరుదైన ఆఫ్రికన్ గ్రే చిలుక తప్పిపోవడంతో హైరానా పడిపోయిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫైర్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు.. మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి తప్పిపోయిన చిలుకను క్షేమంగా యజమానికి అప్పగించిన సంఘటన ఇటీవల బంజారాహిల్స్‌లో జరిగింది. మానసిక ఒత్తిడి దూరం.. మానసిక అలసట, దుఃఖం లేదా ఒంటరితనంతో ఉండే వ్యక్తులు జంతువులతో ఎక్కువగా మమేకమవుతున్నారు. మానసిక స్థితిని నియంత్రించుకోవడానికి, బంధాలపై నమ్మకాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి పెంపుడు జంతువులు సహాయపడతాయని పలు అధ్యయనాల్లోనూ తేలింది. పెట్స్ ఓ స్టేటస్ సింబల్ మారంది. స్థానిక జాతులు కాకుండా ప్రపంచ దేశాల నుంచి అరుదైన జంతువులను తీసుకొచ్చి పెంచుకోవడం కొత్త ఫ్యాషన్‌గా మారింది ఇంటిలో వాటి కోసం ప్రత్యేకంగా గదులు, ఆడుకునేందుకు వార్డ్రోబ్లు, ప్రత్యేకంగా పెట్ పార్క్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇగ్వానాలు, షుగర్ గ్లైడర్లు, బర్మీస్ కొండచిలువ, బాల్ పైథాన్లు, నక్షత్ర తాబేలు వంటి జంతువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రేమాప్యాయతలు కనబరుస్తున్న పెట్ లవర్స్ వీటికి అనారోగ్యం వస్తే తట్టుకోలేని వైనం పెంపుడు పిల్లి మృతిని తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య తాజాగా నగర శివారు మీర్పేట్లో విషాద ఘటన కుక్క ఆరోగ్యం మెరుగవ్వలేదని వైద్యుడిపై ఇటీవల కేసు గ్రేటర్ పరిధిలో చోటుచేసుకుంటున్న పలు ఉదంతాలు -
ఆహార కల్తీని అరికడదాం
87126 61212కు ఫోన్ చేయండి అబిడ్స్: నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో (హెచ్–ఫాస్ట్) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గురువారం న్యూ ఉస్మాన్‌గంజ్ రోడ్డులోని పాత బేగంబజార్ పోలీస్‌స్టేషన్ భవనంలో ఈ టీమ్ కార్యాలయాన్ని ఐపీఎస్ అధికారి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభోత్సవం చేశారు. జంట నగరాల్లో ఆహార కల్తీని నిరోధించేందుకు కొత్వాల్ వీసీ సజ్జనర్ నేతృత్వంలో, ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో హెచ్–ఫాస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆహార కల్తీకి పాల్పడితే 87126 61212కు ఫిర్యాదు చేయవచ్చు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రంజిత్‌కుమార్ గౌడ్, అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు రమ్య, అభిలాష్, అఖిల్, కృష్ణ పాల్గొన్నారు. -
మణికొండ వేదకుమార్‌కు అరుదైన గుర్తింపు
ఇంటాక్ న్యూఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్‌కు నాలుగోసారి ఎన్నిక హిమాయత్‌నగర్: డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్, కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్), న్యూఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో నాలుగోసారి ఎన్నికై నట్లు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సెక్రెటరి కట్టా ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేదకుమార్ అర్బన్, రీజనల్ ప్లానర్, అంకితభావంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఇంటాక్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించడం ఆయన నిబద్ధత, విశ్వసనీయత, వారసత్వ సంరక్షణలో చేసిన విశిష్ట సేవలను ప్రతిబింబిస్తోందని అన్నారు. -
డీపీతో టోపీ!
నగర వ్యాపారి ఫొటో వాట్సాప్ డీపీగా వినియోగం సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మహిళా వ్యాపారి ఫొటోను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్‌గా (డీపీ) ఏర్పాటు చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్‌కు టోకరా వేశారు. ఆమె పంపినట్లుగా సందేశం పంపి రూ.1.2 కోట్లు కాజేశారు. మరో రూ.18 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నించగా... విషయం సదరు వ్యాపారికి తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సదరు సంస్థకు దేశ వ్యాప్తంగా క్లైంట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి వీరి ఖాతా నుంచి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. యజమానురాలి నుంచి వచ్చే మౌఖిక ఆదేశాలు, సందేశాల ఆధారంగా అక్కడ అకౌంటెంట్ ఈ లావాదేవీలు చేస్తూ ఉంటారు. దీన్నే సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఈ సంస్థ యజమానురాలితో పాటు ఇతర ఉద్యోగుల వివరాలను సంగ్రహించారు. నెట్ నుంచే సంగ్రహించిన యజమానురాలి ఫొటోను తమ వాట్సాప్ నెంబర్‌కు డీపీగా పెట్టారు. ఈ నెంబర్ నుంచి ఈ ఈ నెల 13 మధ్యాహ్నం 3.30 గంటలకు అకౌంటెంట్‌కు ఓ సందేశం పంపారు. అందులో పొందుపరిచిన బ్యాంకు ఖాతాకు రూ.1.2 కోట్లు బదిలీ చేయమంటూ ఆ సందేశంలో ఉంది. తమకు సందేశం వచ్చింది కొత్త నెంబర్ నుంచే అయినప్పటికీ... డీపీగా యజమానురాలి ఫొటోనే ఉండటంతో అకౌంటెంట్ నమ్మాడు. అది తన యజమానురాలికి చెందిన మరో నెంబర్‌గా భావించాడు. తరచు ఆమె నుంచి ఇలాంటి సందేశాలు రావడం, నగదు బదిలీలు జరగడం మామూలే కావడంతో ఆ సందేశంలో ఉన్న ఢిల్లీకి చెందిన సంస్థ బ్యాంకు ఖాతాకు రూ.1.2 కోట్లు బదిలీ చేశాడు. ఆ రోజు తన యజమానురాలు హైదరాబాద్‌లో లేకపోవడంతో ఈ వివరాలను తన రికార్డుల్లో పొందుపరిచినా.. ప్రత్యేకించి ఆమె దృష్టికి తీసుకువెళ్లలేదు. ఒకసారి తమ పథకం పారడంతో సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సంస్థ నుంచి మరికొంత దోచుకోవాలని భావించారు. ఇందులో భాగంగా మంగళవారం అదే వాట్సాప్ నెంబర్ నుంచి అకౌంటెంట్‌కు మరో సందేశం పంపారు. ఈసారి తమిళనాడులో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ ఖాతాకు రూ.18 లక్షలు బదిలీ చేయాలని అందులో పొందుపరిచారు. తన యజమానురాలి ఫొటో డీపీగా ఉన్న కొత్త వాట్సాప్ నెంబర్ నుంచి మరో సందేశం రావడం, అందులో మరో రాష్ట్రంలోని బ్యాంకు ఖాతా వివరాలు ఉండటంతో అకౌంటెంట్ అనుమానించాడు. అందుబాటులో ఉన్న యజమానురాలి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. దీంతో జరిగిన విషయం గుర్తించిన ఆమె నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్పర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్‌లోని 66సీ, 66 డీ, భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) 318 (4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించడానికి వాళ్లు వినియోగించిన సెల్‌ఫోన్ నెంబర్‌తో పాటు నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతా వివరాలను విశ్లేషిస్తున్నారు. ఆ నెంబర్ వినియోగించి ఆమె అకౌంటెంట్‌కు సందేశం ఢిల్లీకి చెందిన బ్యాంక్ ఖాతాలోకి నగదు బదిలీకి ఆదేశం రూ.1.2 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు, కేసు నమోదు -
ఇక చెల్లింపులే కీలకం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వాధీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు,సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది.మరోవైపు మెట్రో టోకోవర్‌తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రిమండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆర్ధిక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దశలవారీగా టేకోవర్.... ● మెట్రో రెండో దశ డీపీఆర్‌లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్‌లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది. ● ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది. ● గతేడాది సెప్టెంబర్‌లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది. ● దీంతో మెట్రో మొదటిదశను స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... ● అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి. ● ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది. ● అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్‌ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ● ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. చివరి అంకానికి చేరుకున్న మెట్రో టేకోవర్ మరో 10 రోజుల్లో సర్కార్ స్వాధీనంలోకి... బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం -
సంప్రదాయాలతోనే సమతుల్యత
మణికొండ: ప్రకృతి, పండగలు, సంప్రదాయాలు ఆచరించినపుడే జీవితంలో సమతుల్యత సాధ్యమని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. గురువారం ఉగాది పండగను పురస్కరించుకుని కోకాపేట నియోపోలీస్‌లోని పీఠంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఉదయం 9గంటల నుంచి శ్రీశారదా చంద్రమౌళీశ్వర ఆరాధన, సంగీత విహారి, పంచాంగ ఆవిష్కరణ, పంచాంగ శ్రవణం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే విశాఖలో ఉన్న పీఠం మాదిరిగానే కోకాపేటలోను ఏర్పాటు చేయాలని నిర్ణయించి పనులను కొనసాగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలు సుబిక్షంగా ఉండి, అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం రెండు రాష్ట్రాల ప్రజలకు సంపూర్ణంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. పంచాంగం, నక్షత్రాలు, గ్రహణాలు వంటి అంశాలు మూఢనమ్మకాలు కావని, వాటిపై మన రుషులు పరిశోధనలు చేసి వాటిని మనకు అందించారన్నారు. వాటి ఆదారంగానే సముద్రపు అలల మార్పు, జంతువుల ప్రవర్తన, చెట్లు చిగురించటం లాంటివి సృష్టిలో ఎన్నో జరుగుతున్నాయన్నారు. ఈ సంవత్సరం గురువు అధిపతి కాబట్టి అంతా బాగుంటుందని, ప్రతి రోజు ఉదయం సూర్యారాధన చేసే వారికి మరింతగా బాగుంటుందన్నారు. జూలై నెల నుంచి ఇక్కడే ఉండి పీఠం రాజశ్యామల అమ్మవారి దేవాలయ నిర్మాణ పనులను చూసుకుంటానన్నారు. కార్యక్రమంలో పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌రావు, ఎన్సీఎల్టీ న్యాయ సభ్యుడు జస్టిస్ బద్రీనాథ్, మాజీ న్యాయమూర్తి మఠం వెంకటరమణ, హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, డీఆర్డీఏ మాజీ చైర్మెన్ సతీష్‌రెడ్డి, మాజీ డీజీపీ అంజనీకుమార్, గజల్ గాయకుడు శ్రీనివాస్‌లతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. విశాఖ శ్రీశారదా పీఠాధిపతిస్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి -
స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు.. 20 మంది అరెస్ట్
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రెండు స్పా సెంటర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.పక్కా సమాచారంతో చేపట్టిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో అరెస్టైన 20 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. -
నిర్లక్ష్యపు నిప్పు
జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లోని మెట్రోస్టేషన్ సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో రెండు నెలల క్రితం వరకు మంగళగౌరీ అనే వస్త్ర దుకాణం కొనసాగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా షోరూం ముందు భాగంలో గోపురం డెకరేషన్‌ను, ఎదురుగా ఫుట్‌పాత్‌పై ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. షాపు మూసివేసిన తర్వాత ఎవరూ రాకపోవడంతో గోపురం డెకరేషన్‌ను తొలగించాలని భవన యజమాని టీవీ సురేష్‌కుమార్ నిర్ణయించి సిరాజ్ అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కొబ్బరి నార అంటుకుని.. ఉదయం 11 గంటల వేళ గోపురం డెకరేషన్‌కు వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు రావడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కోసం ఏర్పాటుచేసిన కొబ్బరినార అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెల్డింగ్ చేస్తున్న వారితో పాటు మిగతా కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, హైడ్రా రంగంలోకి దిగి మూడు ఫైరింజన్లతో మంటలను రెండు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చాయి. రెండు గంటల పాటు ఈ రోడ్డంతా స్తంభించిపోయింది. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే.. ఈ బిల్డింగ్‌లో మంగళగౌరీ వస్త్ర దుకాణాన్ని రెండు నెలల క్రితమే మూసివేశారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బిల్డింగ్‌పై యజమాని టీవీ సురేష్‌కుమార్ ఒక అంతస్తును అక్రమంగా నిర్మించడంతో పాటు సెట్‌బ్యాక్‌లో ఒకవైపు జనరేటర్ ఏర్పాటు చేసి, ఇంకోవైపు గదులు నిర్మించారు. దీంతో ఫైర్‌తో పాటు హైడ్రా సిబ్బంది పైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని జూబ్లీహిల్స్ పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకున్నా అక్రమ నిర్మాణాలతో పాటు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని అంటున్నారు. అద్దాలు పగులగొట్టుకుని.. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు భవనం అద్దాలు పగులగొట్టుకుని బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో వీరంతా గ్రౌండ్ ఫ్లోర్లో పని చేస్తుండగా, ప్రధాన ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పక్కనే ఉన్న అద్దాలను పగులగొట్టుకుని వీరు బయటకు పరుగులుతీశారు. స్క్రాప్ గోదాంలో మరో ఘటన.. జీడిమెట్ల: నగరంలో గురువారం మరో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల ఏస్వీ కోఆపరేటివ్ సొసైటీలోని స్క్రాప్ గోదాంలో భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. మహ్మద్, ఇస్మాయిల్ అనే వ్యక్తులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ కవర్లు, అట్టపెట్టెలు, మెడికల్ వ్యర్థాలు తీసుకువచ్చి గోదాంలో డంప్ చేసి విక్రయిస్తుంటారు. సాయంత్రం 6 గంటలకు గోదాంలో కూలీలు పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కూలీలు బయటికి పరుగులు తీశారు. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అనుమతులు లేని గోదాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. హంగులతో బెంగ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు వ్యాపార సంస్థలు చేసే హంగూ ఆర్భాటాలు, ప్రత్యేక అలంకరణలు అగ్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వస్త్ర దుకాణాలు, వివిధ రకాల షోరూమ్‌లు భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా అలంకరణలకు పాల్పడుతున్నాయి. ఈ తరహా అగ్ని ప్రమాదాలపై జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర విభాగాల అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. తాజాగా గురువారం జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి వస్త్ర దుకాణం వద్ద జరిగిన ప్రమాదానికి సెట్టింగే కారణమని అధికారులు తేల్చారు. మొదట సెట్టింగ్‌కు మంటలు అంటుకొని ఆ తర్వాత షోరూమ్‌లోకి వ్యాపించడంతో భవనం దగ్ధమైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా అలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. గోపురం డెకరేషన్‌కు వెల్డింగ్ చేస్తుండగా ఘటన వాణిజ్య భవనంలో ఎగిసిపడిన మంటలు అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు ప్రాణం నష్టం జరగకపోవడంతో ఉపశమనం -
ఫలితం పదిపోకుండా..
గ్రేటర్ పరిధిలో టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: మహా హైదరాబాద్ పరిధిలో పది ఫలితాల్లో వెనుకబాటుకు చెక్ పెట్టేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విద్యా సంవత్సరం ‘వంద శాతం ఉత్తీర్ణత’ లక్ష్యంగా ‘టార్గెట్.. టెన్త్’ పేరుతో విద్యాశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర గ్రామీణ జిల్లాలు ఫలితాల్లో దూసుకుపోతుంటే, అత్యాధునిక వసతులున్న నగర పరిధిలోని జిల్లాలు మాత్రం వెనుకబడి ఉండటంపై ఆయా యంత్రాంగాలు సీరియస్‌గా తీసుకున్నాయి. మూడు విభాగాలుగా.. పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధన కోసం విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా వారిని మూడు విభాగాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. పాస్ మార్కులు సాధించడంలో ఇబ్బంది పడే వెనుకబడిన విద్యార్థులకు కనీస అభ్యసన సామగ్రితో పాటు శిక్షణ, సగటు మార్కులతో ఉత్తీర్ణులయ్యే వారిని పై తరగతికి చేర్చేలా ప్రోత్సాహం, ప్రతిభావంతులైన విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించేలా ఉన్నత స్థాయి ప్రశ్నపత్రాలతో సాధనకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళ్లలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాల విశ్లేషణ, నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తోంది. జిల్లా 2025 2024 2023 2022 హైదరాబాద్ 88.53 86.76 80.92 79.63 రంగారెడ్డి 87.84 91.01 87.35 90.04 మేడ్చల్–మల్కాజిగిరి 90.76 89.61 90.72 86.31 గత ఏడాది ఇవీ స్థానాలు.. మహా హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు పదో తరగతిలో నాలుగేళ్ల నుంచి వెనుకబాటు తప్పడం లేదు. గతేడాది రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ 30 వ స్థానం, మేడ్చల్–మల్కాజిగిరి 28 వ, రంగారెడ్డి జిల్లా 31వ స్థానానికి దిగజారాయి. -
మెట్రోకు రుణాలిస్తాం
● సంసిద్ధత వ్యక్తంచేసిన ఐఆర్‌ఎఫ్‌ఆర్‌సీ ● వడ్డీ రేటు తగ్గింపునకు సంప్రదింపులు సాక్షి, సిటీబ్యూరో: మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌ఆర్‌సీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థకు, ఐఆర్ఎఫ్ఆర్సీకి మధ్య ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలిచ్చే భారతీయ ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఐఆర్ఎఫ్సీ నుంచి 3 శాతం వడ్డీకి రుణాలను తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు 3 నుంచి 4 శాతం మధ్య వడ్డీరేటుపై బేరసారాలు కొనసాగుతున్నాయన్నారు. మెట్రో టేకోవర్‌లో భాగంగా మొత్తం రూ.15 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సిన విషయం తెలిసిందే. ఇందులో రూ.2 వేల కోట్లు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు కావడం గమనార్హం. కాగా.. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ.. మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో మెట్రో సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత దీని నిర్వహణలో ఎల్అండ్టీ చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం టేకోవర్ చేసిన విషయం విదితమే. -
దొంగ తెలివి
పోలీసులు పట్టుకుంటున్నారు జాగ్రత్త సాక్షి, సిటీబ్యూరో: బతుకుదెరువు కోసం నేపాల్ నుంచి నగరానికి వస్తున్న కొందరు ఇక్కడ నేరాలు చేయడానికే మకాం వేస్తున్నారు. ఓ టార్గెట్‌ను ఎంపిక చేసుకుని, అవకాశం కోసం ఎదురుచూసి మరీ పంజా విసురుతున్నారు. ఈ ముఠాల్లోని కీలక సభ్యులు తమ లక్ష్యం ఏమిటన్నది నేపాల్‌లో ఉంటున్న తమ కుటుంబీకులకు చెబుతూ, ఎప్పటికప్పుడు వారి నుంచి అప్డేట్స్ తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న నందగిరిహిల్స్‌లో నివసించే ప్రముఖ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో ఈ నెల 5న భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ విచారణలో దీనికి సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భూపేందర్ సాహి అలియాస్ భువన్ను ఫోన్లో అతడి భార్య పంపిన యూట్యూబ్ లింక్ ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నగరంలో ఉన్న తన భర్త భారీ నేరానికి స్కెచ్ వేస్తున్న విషయం తెలిసిన నేపాల్‌లోని భువన్ భార్య ఇక్కడ జరిగే నేపాలీ సంబంధిత నేరాలు, వాటిలో అరెస్టులు తదితరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఈ వార్తల్ని నేపాల్‌లో యూట్యూబ్ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. నేరం పకడ్బందీగా చేయాలని సూచిస్తూ.. గత నవంబర్ 16న కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో ఓ నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ చేసింది. ఈ ముఠాలోని ఐదుగురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై గత డిసెంబర్ 8న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది నేపాల్‌లో ఓ యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైంది. దీని లింకునే వాట్సాప్ ద్వారా భువన్ భార్య గత నెల్లో అతడికి పంపి... నేరం జాగ్రత్తగా చేయాలని, హైదరాబాద్ పోలీసులు నేరగాళ్లను పట్టుకుంటున్నారని హెచ్చరించింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఈ లింకు కనిపించింది. జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితులైన జీవన్, కృష్ణ చాంద్ 2023లో మియాపూర్ పరిధిలో మరికొందరితో కలిసి నేరం చేసినట్లు తేలింది. ఆ ఏడాది అక్టోబర్ 15న రాకేష్ విశ్వనాథ్ తన కుటుంబంతో కలిసి కరీంనగర్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఆ ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న నవీన్‌తో పాటు మరో వ్యక్తి రూ.80 లక్షల విలువైన సొత్తు ఎత్తుకుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్ నవీన్ సహా ముఠాను పట్టుకోగా... ఈ నేరం వెనుక జీవన్, కృష్ణ చాంద్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. మరికొన్ని ఠాణాల్లోనూ కేసులు.. జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితులపై నగరంలోని మరికొన్ని ఠాణాల్లోనూ కేసులు ఉన్నాయి. దీంతో ఆయా అధికారులు పీటీ వారెంట్లుపై అరెస్టు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రవీంద్ర శర్మ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న భువన్ ఈ నెల 3న కృష్ణ, కమల్‌లను నగరానికి రప్పించాడు. వీళ్లు లక్డీకపూల్‌లోని ఓ లాడ్జిలో బస చేశారు. దర్యాప్తులో ఈ విషయాలు గుర్తించిన అధికారులు సదరు లాడ్జి నుంచి రికార్డులతో పాటు ఈ ద్వయం దాఖలు చేసిన గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5 రాత్రి రవీంద్రశర్మ కుటుంబం ఫంక్షన్‌కు వెళ్లడంతో అదే రోజు నేరం చేయాలని నిర్ణయించిన భువన్... కృష్ణ, కమల్ వేర్వేరుగా బయలుదేరి క్యాబ్స్‌లో నందగిరిహిల్స్‌కు చేరుకున్నారు. ఆ క్యాబ్ డ్రైవర్లను గుర్తించిన పోలీసులు వారి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు చెల్లింపులకు సంబఽందించిన ఆధారాలూ సేకరించారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత డిసెంబర్లో నేపాలీ గ్యాంగ్ అరెస్టు అక్కడ యూ ట్యూబ్ చానెళ్లలో ప్రసారమైన నగర నేర వార్తలు లింక్‌ను భర్తకు షేర్ చేసిన నిందితుడి భార్య జూబ్లీహిల్స్ చోరీ కేసులో వెలుగులోకి కీలకాంశాలు -
ముహూర్తం ఖరారు
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వెయ్యి పడకల సామర్థ్యమున్న సనత్‌నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. వచ్చే నెల 19న దీనిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఓపీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ వార్డులు, టెస్టింగ్ ల్యాబ్‌లు సిద్ధమవుతున్నాయి. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని 3 నెలల డిప్యుటేషన్‌పై నియమించారు. గాంధీ, ఉస్మానియా, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 40 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది రోజు నుంచి వైద్య సేవలు షురూ కానున్నాయి. గాంధీ, ఉస్మానియాలకు ఉపశమనం సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వెయ్యి పడకల సామర్థ్యం, అత్యాధునిక శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉగాది నుంచి టిమ్స్‌లో మొదలవుతున్నాయి. నిత్యం నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల ఓపీ ఉంటోంది. రోగుల తాకిడితో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వైద్య సేవల్లో నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని అభిప్రాయం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మెరుగైన వైద్య సేవలకు అవకాశం ఉంటుంది. గుండె చికిత్సలు సులువు సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్సలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ కోసం క్యాత్ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్యేకంగా రూపొందించిన 16 ఆపరేషన్ థియేటర్లు, సీటీస్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్‌రే, ఇతర అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రారంభం నాటికి 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సనత్‌నగర్ టిమ్స్ 19న ప్రారంభం ఉగాది రోజు నుంచే ఓపీ, ఐపీ, ఓటీ సేవలు డిప్యుటేషన్‌పై 40 మంది సిబ్బంది -
రాష్ట్రం నుంచి ఇద్దరు,ముగ్గురు ఒలింపియన్లు
బంజారాహిల్స్: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్ఏ) ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా నిర్వహించిన స్పోర్ట్స్ షూటింగ్ లీడర్షిప్ కాన్క్లేవ్–2026 విజయవంతంగా ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని టీఆర్ఏ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మాజీ ఎంపీ, క్రీడా సలహాదారు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ... 2032 నాటికి తెలంగాణ నుంచి కనీసం ఇద్దరు, ముగ్గురు ఒలింపియన్లు తయారుచేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కాలికేష్ నారాయణ్‌సింగ్ మాట్లాడుతూ... మౌలిక వసతుల మెరుగుదల, శాసీ్త్రయ కోచింగ్, ఏఐ ఆధారిత విశ్లేషణపై దృష్టి పెట్టాలని సూచించారు. టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్ సంఘి మట్లాడుతూ.. షూటింగ్ క్రీడ ప్రశాంతంగా కనిపించినా అత్యధిక ఒత్తిడి, క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమయ్యే క్రీడ అని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్, ఎండీ సోనిబాలదేవి తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
నిరుద్యోగులను పట్టించుకోని రేవంత్‌రెడ్డి
ఖైరతాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కృషితో ముఖ్యమంత్రి అయి ఇప్పుడు నిరుద్యోగులను మర్చిపోయారని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డీఎస్పీ, 40వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తా నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పారు.. కానీ ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎంతో మంది జీవితాలు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయానన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు డీఎస్సీ వేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ర్యాగ అరుణ్‌కుమార్, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


