పారిశుధ్యంపై ఫోకస్ పెంచాలి
జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కర్ణన్ ఆదేశం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పారిశుధ్యాన్ని మరింతగా మెరుగుపరచడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశించారు. సోమవారం ప్రారంభమైన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా తొలిరోజు నగరవ్యాప్తంగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిల క్లీనింగ్‌పై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించారు. కిస్మత్‌పూర్, నార్సింగి, సన్‌సిటీలలో కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. రానున్న రోజుల్లో ఫ్లై ఓవర్లు, రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్లు, చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం పక్కాగా చేపట్టాలన్నారు.


