బ్రహ్మోత్సవం.. భక్తగణం
నేటి నుంచి కీసరగుట్టలో ఉత్సవాలు
ప్రఖ్యాత శైవక్షేత్రం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల జాతరకు సుమారు ఐదారు లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ తెలిపారు. ఇప్పటికే 50 వేల లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచామని ఆయన పేర్కొన్నారు. – కీసర


