పాక్‌ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్‌ | Pakistan Ishaq Dar Video Viral In Islamabad event | Sakshi
Sakshi News home page

పాక్‌ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్‌

Mar 30 2026 10:35 AM | Updated on Mar 30 2026 10:40 AM

Pakistan Ishaq Dar Video Viral In Islamabad event

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్‌లో జరిగిన కీలక నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్బంగా ఇషాక్‌ దార్‌ కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల మేరకు.. తాజాగా పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఇస్లామాబాద్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగా పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలట్టిని ఆహ్వానించే సమయంలో కాలు జారి కింద పడిపోయారు.

దీంతో, వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఆయనను పైకిలేపేందుకు సహాయం చేశారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. సమావేశం యథావిధిగా కొనసాగినట్టు సమాచారం. అయితే, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటికి కేవలం పాకిస్తాన్‌ నేతలకు మాత్రమే సాధ్యమని.. ఎవరూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement