‘దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిది’ | TG Governor Shiv Pratap Shukla Attends Rajasthan Statehood Day Celebrations | Sakshi
Sakshi News home page

‘దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిది’

Mar 30 2026 7:30 PM | Updated on Mar 30 2026 7:37 PM

TG Governor Shiv Pratap Shukla Attends Rajasthan Statehood Day Celebrations

హైదరాబాద్‌ దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో సోమవారం(మార్చి 30వ తేదీ )ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ లో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న రాజస్థాన్‌ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా సతీమణితో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాల పరంగా రాజస్థాన్‌కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. భగవాన్ శ్రీ రాముడు, జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని చెప్పారని.. వారి స్ఫూర్తితోనే రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసంకు గొప్ప సేవ చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు. గవర్నర్ సందేశం అనంతరం ఏర్పాటు చేసిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి.  ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి  శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement