శాసన మండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌ | BRS MLC was suspended from the Legislative Council | Sakshi
Sakshi News home page

శాసన మండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌

Mar 30 2026 11:03 AM | Updated on Mar 30 2026 11:49 AM

BRS MLC was suspended from the Legislative Council

సాక్షి,హైదరాబాద్‌: శాసన మండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌కు గురయ్యారు. పొంగులేటిని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలి సభ ప్రారంభం నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. 

అక్రమ మైనింగ్‌ అంశంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంపై సభా సంఘం వేయాలంటూ నినాదాలు చేశారు. వెల్‌లోకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో సభ సజావుగా జరిగే సభ్యులు వ్యవహరించాలని శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి  కోరారు. అనంతరం,బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని ఒక రోజు  సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement